అంగం పెద్దగా ఉంటేనే ఆనందాన్ని పొందుతారా?

First Published | May 9, 2023, 9:48 AM IST


సెక్స్ గురించి పూర్తి అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి అపోహలను నమ్ముతున్నారు చాలా మంది. ముఖ్యంగా లైంగిక అవయవాల పరిమాణం గురించి ఇదొక పెద్ద అపోహ. ఈ విషయాన్ని నమ్మడం వల్లే మార్కెట్ లోకి ఎన్నో మందులు, నూనెలు అంటూ ఎన్నో ప్రొడక్ట్స్ వస్తున్నాయి. కానీ పరిమాణం నిజంగా అంత ముఖ్యమా? 
 

వైవాహిక జీవితంలో సెక్స్ ఒక ముఖ్యమైన భాగం. ఇది ఇద్దరు వ్యక్తుల సమ్మతితో చేయబడుతుంది. ఇద్దరు ఆనందాన్నిపొందడానికి సులభమైన మార్గం ఇది. కొంతమంది దీనిని గంటల తరబడి ఆస్వాదిస్తారు, మరికొందరు ఒకటి లేదా రెండుసార్లు సంతృప్తి చెందుతారు. లైంగిక సంబంధాలు మన శరీరంలో ఉత్తేజాన్ని కలిగిస్తాయి. సెక్స్ శరీరంలో సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది. ఇది నిద్రలేమి వంటి సమస్యలను తొలగించడమే కాదు.. దీని ప్రభావం మన చర్మంపై కూడా కనిపిస్తుంది.
 

ఇద్దరు వ్యక్తుల మధ్య లైంగిక సంబంధం.. ఇద్దరినీ మరింత దగ్గర చేస్తుంది. ప్రేమను పెంచుతుంది. సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. దీనిలో పెన్నీస్, వజీనాది ప్రత్యేక పాత్ర. పురుషాంగం, పురుషాంగం పరిమాణం లైంగిక జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో మీకు తెలుసా?

Latest Videos


నిపుణుల ప్రకారం.. ఆనందం అనేది శారీరక, భావోద్వేగ, మానసిక స్థితికి సంబంధించింది. దీనిలో ఆనందాన్ని అనుభవిస్తారు. అంతేకాదు సెక్స్ లో సైజు ముఖ్యం కాదు. పరిమాణం అంతకంటే కాదు. సన్నిహిత స్పర్శ, సెక్సీ టాక్, ఉద్వేగం ద్వారే దీనిలో ఆనందాన్ని పొందుతారు. కానీ ఇప్పటికీ కొంతమందికి అంగం పరిమాణం గురించి కొన్ని అపోహలు పెట్టుకున్నారు. 

penis

సెక్స్ కోసం అంగస్తంభనలో అవయవ పరిమాణం 4 అంగుళాలు ఉండాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో శృంగారానికి ముఖ్యమైన అంశం స్టామినా. ఈ స్టామినా వల్లే ఆనందం కలుగుతుంది. మీ భాగస్వామి డిశ్చార్జ్ సమయం సరిగ్గా ఉంటే.. అంటే 15 నుంచి 20 నిమిషాలు ఉంటే అది లిబిడోను పెంచుతుంది. అలాగే సెక్స్ సమయంలో ఆనందం కూడా లభిస్తుంది.

మీ భాగస్వామి పురుషాంగం పరిమాణం 6 అంగుళాలు, స్టామినా లేకపోతే మీరు సంతృప్తి చెందలేరు. పరిమాణం 4 అంగుళాల కంటే ఎక్కువ ఉంటే అది ప్లస్ పాయింట్ అని గమనించాలి. ఇంతకంటే తక్కువగా ఉంటే సంతృప్తి పరచడంలో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఉత్సర్గ, అంగస్తంభన సమయం సరిగ్గా ఉండాలి.
 

జర్నల్ ఆఫ్ సెక్స్ అండ్ మారిటల్ థెరపీ ప్రకారం.. పురుషాంగం 5.1 నుంచి 5.5 అంగుళాల వరకు నిటారుగా ఉంటుంది. అయితే పురుషాంగం పరిమాణం సెక్స్ పై ఎలాంటి ప్రభావం చూపడదు. అలాగే ఆరోగ్యంపై కూడా చూపదు. సగటు పరిమాణం కంటే తక్కువగా ఉంటే అది ఆ వ్యక్తి  విశ్వాసాన్ని తగ్గిస్తుంది. శృంగారాన్ని ఆస్వాదించే సామర్థ్యంపై కూడా ఇది ప్రభావం చూపుతుంది. దీనికి తోడు ఎక్కువ ఒత్తిడి, ఎక్కువగా ఆలోచించడం వల్ల క్లైమాక్స్ కు చేరుకోవడం కష్టమవుతుంది.
 

ఇంటర్నేషనల్ యూరోజెనికాలజీ జర్నల్ లో ప్రచురించబడిన 2010 అధ్యయనం ప్రకారం..  యోని పొడవు, ప్రారంభ పరిమాణం లైంగిక సంతృప్తితో సంబంధం కలిగి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి పరిశోధకులు 40, అంతకంటే ఎక్కువ వయస్సున్న దాదాపు 500 మంది గైనకాలజికల్ రోగుల వైద్య రికార్డులను స్కాన్ చేశారు. ఈ పరిశోధన ప్రకారం.. కోరికలు, ఉద్వేగం, నొప్పి, లైంగిక సంతృప్తి యోని పరిమాణాన్ని పెంచడంలో ప్రభావవంతంగా ఉన్నాయని రుజువు అయ్యింది. పరిమాణం, ఆకారం కంటే ఇద్దరు వ్యక్తుల కోరిక, ఓదార్పు శృంగారాన్ని ఆహ్లాదకరంగా మారుస్తాయని అధ్యయనంలో తేలింది.

Image: Getty

వీటిపై శ్రద్ధ పెట్టండి

ఒత్తిడికి దూరంగా ఉండండి: చాలాసార్లు ఒత్తిడి మీ జీవితాన్ని శాసిస్తుంది. ఈ కారణంగా మీరు శృంగారాన్ని ఆస్వాదించలేరు. అందుకే ధ్యానం చేయడం చాలా ముఖ్యం. ప్రతిరోజూ ధ్యాన భంగిమలో కూర్చుంటే మీ ఇంద్రియాలు మీ నియంత్రణలోకి  వస్తాయి. మీ మనస్సు క్రమంగా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఊబకాయాన్ని తగ్గించడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఊబకాయం కారణంగా చాలాసార్లు శృంగారంలో పూర్తిగా పాల్గొనలేరు. బరువు తగ్గడానికి వ్యాయామం, సైక్లింగ్ చేయండి. ఇది శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. 

click me!