ashwagandha
ప్రకృతి మనకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. అందుకే ప్రకృతి వైద్యం ఎంతో ప్రాచుర్యం పొందింది. అంతేకాక ఆయుర్వేద మూలికలు కూడా మనకున్న ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేస్తాయి. ఇలాంటి వాటిలో అశ్వగంధ ఒకటి.
అవును అశ్వగంధలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. అందుకే దీనిని ఎన్నో ఆయుర్వేద మందులల్లో ఉపయోగిస్తారు. ఈ అశ్వగంధ మొక్క పురుషుల ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా ప్రయోజకరంగా ఉంటుంది తెలుసా?
Image: Freepik
పురుషుల శారీరక సమస్యలను తొలగించడానికి అశ్వగంధం ఒక ఔషధంలా సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అశ్వగంధ పురుషులకు ఎలాంటి ప్రయోజనాలు అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
స్పెర్మ్ కౌంట్
ప్రస్తుత కాలంలో చాలా మంది మగవారు తక్కువ స్పెర్మ్ కౌంట్ తో బాధపడుతున్నారు. పిల్లలు పుట్టాలన్నా, భార్యాభర్తల లైంగిక జీవితం మెరుగ్గా ఉండాలన్నా స్పెర్మ కౌంట్ బాగుండాలి. అయితే అశ్వగంధ పురుషుల్లో లైంగిక సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఇది పురుషుల్లో వీర్యకణాల సంఖ్యను, నాణ్యతను మెరుగుపరచడానికి కూడా ఎంతగానో సహాయపడుతుంది.
Image: Freepik
సంతానోత్పత్తి
ప్రస్తుత కాలంలో చాలా మంది జంటలు సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు. అయితే పురుషులు నపుంసకత్వం నుంచి బయటపడటానికి, సంతానోత్పత్తిని పెంచడానికి అశ్వగంధ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
Image: Freepik
టెస్టోస్టెరాన్ హార్మోన్
శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ సమతుల్యతను పెంచడానికి అశ్వగంధ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే టెస్టోస్టెరాన్ హార్మోన్ అసమతుల్యంగా ఉన్నవారు దీనిని తీసుకోవచ్చు.
లిబిడో
అశ్వగంధ కూడా లిబిడోను పెంచడంలో చాలా ఎఫెక్టీగ్ గా పనిచేస్తుంది. దీనిని వాడటం వల్ల మీరు ఎక్కువసేపు సెక్స్ లో పాల్గొంటారు. ఇది మీ సెక్స్ స్టామినాను పెంచుతుంది. మీ బలహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది.
లైంగిక వాంఛ
వయసు పెరుగుతున్న కొద్దీ లైంగిక వాంఛలు తగ్గడం చాలా కామన్. కానీ వయసులో ఉన్నవారికి కూడా ప్రస్తుత కాలంలో లైంగిక కార్యకలాపాల పట్ల ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. దీనికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే అశ్వగంధను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా లైంగిక వాంఛ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ఇది కండరాలను బలోపేతం చేయడానికి కూడా సహాయపడుతుంది. ఏదేమైనా మీరు డాక్టర్ సలహా తీసుకుని మాత్రమే వాడాలి.