Cow Milk for Babies: చిన్నారులకు ఏ నెల నుంచి ఆవు పాలు తాగించొచ్చు?

Published : Jun 23, 2025, 02:48 PM IST

Cow Milk for Babies: పిల్లలకు ఎలాంటి ఆహారం ఇవ్వాలని తల్లిదండ్రులు తెగ ఆలోచిస్తారు. ఈ క్రమంలో తరుచుగా పలు సందేహాలు వ్యక్తమవుతాయి. అలాంటిదే..  చిన్నారులకు ఏ నెల నుంచి ఆవుపాలు తాగించాలి? ఎందుకు? అనే విషయంపై వివరణ తెలుసుకుందాం..

PREV
15
చిన్నారులకు ఆవు పాలు మంచివేనా?

పిల్లలు ఎదుగుదలకు సరైన పోషకాహారం ముఖ్యం. అలాంటి వాటిలో పాలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో చాలా మంది తల్లిదండ్రులకు ఒక ప్రశ్న ఉంటుంది, చిన్న పిల్లలకు ఆవు పాలను ఎప్పుడు ప్రారంభించాలి?. ఈ ప్రశ్నకు సమాధానం మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ కథనం మీకు సహాయపడుతుంది.

25
పోషకాల నిధి

ఈ విషయం గురించి శిశువైద్యురాలు నిమిషా అరోరా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో, వైద్యులు, ‘మొదటి 9 నుండి 10 నెలల వరకు శిశువుకు పాలు చాలా ముఖ్యం. కానీ జననం తర్వాత మొదటి 6 నెలల వరకు తల్లి పాలను మాత్రమే ఇవ్వాలి. ఏదైనా కారణం చేత తల్లి పాలు ఇవ్వలేకపోతే, ఫార్ములా పాలు సురక్షితమైన ఎంపిక.’ ఈ పాలను తల్లి పాల మాదిరిగానే శాస్త్రీయంగా తయారు చేస్తారు, ఇది శిశువుకు అవసరమైన పోషకాలను అందిస్తుంది.’ అని తెలిపారు.

35
ఎప్పటి నుంచి

డాక్టర్ అరోరా ప్రకారం.. శిశువుకు 6 నెలల వరకూ ఏ సందర్భంలోనూ ఆవు పాలు లేదా నీరు ఇవ్వకూడదు. 6 నెలల తర్వాత పిల్లలకు ఆహారం ఇవ్వడం ప్రారంభించినప్పుడు.. తక్కువ మొత్తంలో ఆవు పాలను అందించవచ్చు. అలాగే, పెరుగు, చీజ్, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులను కూడా తక్కువ మొత్తంలో ఇవ్వవచ్చు. కానీ ఈ సమయంలో కూడా పిల్లలకు తల్లి పాలు లేదా ఫార్ములా పాలు మాత్రమే తాగించాలి. 

45
ఆవు పాలు ఎప్పుడు ఇవ్వాలి?

పిల్లలకు ఏడాది నిండిన తరువాత వారు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు.. మీరు ఆవు పాలను తాగించడం ప్రారంభించవచ్చు. కానీ పాలు బాగా మరిగించి శుభ్రంగా ఉండాలని గుర్తుంచుకోవాలి. 1 నుండి 1.5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు రోజుకు 300-400 ml కంటే ఎక్కువ పాలు ఇవ్వకూడదని డాక్టర్ అరోరా సూచిస్తున్నారు. ఎక్కువ మొత్తంలో పశువుల పాలు ఇవ్వడం వల్ల పిల్లలలో ఐరన్ లోపం, మలబద్ధకం, జీర్ణ సమస్యలు వచ్చే అవకాశముంది.  

55
శారీరక, మానసిక అభివృద్ధికి

పిల్లల వయస్సు ఏడాది దాటిన తర్వాత పాలు కాకుండా అన్నం, కిచిడి, పండ్లు, ఉడికించిన కూరగాయలు వంటివి ఎక్కువ మొత్తంలో ఇవ్వాలి. ఇది వారి శారీరక, మానసిక అభివృద్ధికి అవసరమైన పోషకాలను అందిస్తాయి. 

Read more Photos on
click me!

Recommended Stories