Parenting Tips: పిల్లల విషయంలో పేరెంట్స్ కామన్ గా చేసే తప్పులు ఇవే..!

Published : Jun 14, 2025, 05:32 PM IST

కొందరు అమితమైన ప్రేమ చూపిస్తారు.. మరి కొందరు.. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అతి ప్రేమ చూపించే క్రమంలో, అతి స్ట్రిక్ట్ గా ఉండే క్రమంలో చాలా మంది పేరెంట్స్ తప్పులు చేస్తూ ఉంటారు.

PREV
15
పేరెంటింగ్ టిప్స్..

పిల్లల పెంపకం అనేది ఒక మాన్యువల్ కాదు. పిల్లలను ఇలానే పెంచాలి అనే రూల్ ఏదీ ఉండదు. అందరి పేరెంటింగ్ ఒకేలా ఉండదు. ఒక్కొక్కరి పెంపకం ఒక్కోలా ఉంటుంది. కానీ, పెంచే విధానం ఎలా ఉన్నా.. పిల్లల భవిష్యతు బాగుండాలనే కోరికతోనే పెంచుతారు. కొందరు అమితమైన ప్రేమ చూపిస్తారు.. మరి కొందరు.. చాలా స్ట్రిక్ట్ గా ఉంటారు. అతి ప్రేమ చూపించే క్రమంలో, అతి స్ట్రిక్ట్ గా ఉండే క్రమంలో చాలా మంది పేరెంట్స్ తప్పులు చేస్తూ ఉంటారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఏ విషయంలో తప్పులు చేయకూడదో తెలుసుకుందాం...

25
1.పిల్లలను ఇతరులతో పోల్చడం...

చాలా మంది పేరెంట్స్ చేసే మొదటి తప్పు..తమ పిల్లలను ఇతరులపై పోల్చడం. చదువు విషయంలో మాత్రమే కాదు.. వాళ్లు అలా ఉన్నారు.. మాట చక్కగా వింటారు.. ఇలా ఏదైనా సరే మరొకరితో పోల్చడం మంచిది కాదు. ఇది పిల్లల్లో కాన్ఫిడెన్స్ ని తగ్గించేస్తుంది.తమ వల్ల ఏదీ కాదు, తాము పర్ఫెక్ట్ కాదు అనే భావన పిల్లల్లో పెరిగిపోతుంది. నిజంగా పిల్లలు ఏదైనా తప్పు చేస్తే, వాళ్లను కరెక్ట్ చేయడానికి ప్రయత్నించాలి. కానీ, మరొకరితో పోల్చకూడదు.

35
2.పిల్లలు చెప్పేది వినకపోవడం...

చాలా మంది పేరెంట్స్ తాము చెప్పిందే పిల్లలు వినాలి అనుకుంటారు. పేరెంట్స్ చెప్పిన మాట పిల్లలు వినాలి అది కరెక్టే కానీ, పిల్లలు చెప్పేది కూడా పేరెంట్స్ వినాలి. పిల్లలు చెప్పేది విన్న తర్వాతే మీరు ఎలాంటి నిర్ణయం అయినా తెలుసుకోవాలి. పిల్లలు చెప్పే చిన్న విషయం పైన అయినా శ్రద్ధ చూపించాలి. అప్పుడే పిల్లలకు తాము మాట్లాడే విషయంపై నమ్మకం పెరుగుతుంది. ఎందరి ముందు అయినా మాట్లాడే ధైర్యం కూడా కలుగుతుంది.

45
3.పిల్లల సమస్యలను పరిష్కరిచడం..

పిల్లలకు ఏదైనా చిన్న సమస్య వచ్చినా.. వెంటనే పేరెంట్స్ ఇన్వాల్వ్ అయిపోతారు. తామే ఆ సమస్యను పరిష్కరించాలి అని ఆరాటపడుతుంటారు. పిల్లల సమస్యను పేరెంట్స్ పరిష్కరించడం మంచిదే. కానీ, ప్రతి దాంట్లో దూరిపోకూడదు. వీలైనంత వరకు వారి సమస్యను వారే పరిష్కరించుకునే స్వేచ్ఛను ఇవ్వాలి. లేకపోతే.. పిల్లలు తమను తాము అసమర్థులు అనే ఫీలింగ్ పెంచుకుంటారు.

4.పిల్లల ముందు కఠినమైన భాష ఉపయోగించడం..

పిల్లలను చాలా మంది పేరెంట్స్ బూతులు తిడుతూ ఉంటారు. అయితే.. బూతులు మాత్రమే కాదు, నువ్వు దేనికీ పనికిరావు, నువ్వు ఏదీ నేర్చుకోలేవు మాటలు కూడా పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. నిజంగానే తాము ఏమీ సాధించలేం అనే భావన వారిలో పడిపోతుంది.

55
5. గ్రేడ్‌లపై మాత్రమే దృష్టి పెట్టడం

చాలా మంది మంచి మార్కులు విజయం లేదా ప్రయత్నానికి ఏకైక సంకేతం అని నమ్ముతారు. కానీ చదువులో మార్కులు రానంత మాత్రాన వారు దేనికీ పనికి రారు అనుకోవడం పొరపాటు. మార్కులతో పని లేకుండా జీవితంలో విజయం సాధించిన వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి, పిల్లల మార్కులపై కాకుండా, ఫలితం ఆశించకుండా ఎలా ప్రయత్నించాలో వివరించాలి.

6.ప్రతి దాంట్లో పర్ఫెక్ట్ గా ఉండటం..

చాలా మంది పేరెంట్స్ తమ పిల్లలు అన్ని విషయాల్లో చాలా పర్ఫెక్ట్ గా ఉండాలని కోరుకుంటారు. అలా కోరుకోవడంలో తప్పు లేదు కానీ, దాని కోసం పిల్లలను ఇబ్బంది పెట్టకూడదు. అన్ని విషయాల్లో పర్ఫెక్ట్ గా ఉండటం ఎవరి వల్లా కాదు. అది పిల్లలపై ఒత్తిడి పెంచుతుంది. కాబట్టి, అలాంటి ఒత్తిడి పిల్లలపై పెట్టకుండా ఉండాలి.

Read more Photos on
click me!

Recommended Stories