Pregnancy: వర్షాకాలంలో గర్భిణులు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ చిట్కాలను పాటించాల్సిందే..

Published : Jun 27, 2025, 02:55 PM IST

Monsoon Pregnancy Safety Tips:  వర్షాకాలంలో గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే.. అనారోగ్యాలకు గురయ్యే ప్రమాదం ఉంది. పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే..  వర్షాకాలంలో గర్భిణీలు పాటించాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. 

PREV
16
పరిశుభ్రతపై శ్రద్ధ

గర్భిణీ స్త్రీలు పాటించాల్సిన ముఖ్య చిట్కా ఏమిటంటే.. వారు తన శరీరంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. సూక్ష్మక్రిములు, ఇన్ఫెక్షన్స్ దూరంగా ఉండాలంటే.. ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి. అలాగే చేతులు శుభ్రం చేయడానికి హ్యాండ్ శానిటైజర్‌ ని ఉపయోగించండి. ఫంగల్ ఇన్ఫెక్షన్స్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అలాగే.. బట్టలను శుభ్రంగా ఉంచుకోవాలి. 

26
వైద్యుల సలహా తప్పనిసరి

వర్షాకాలంలో జలుబు, జ్వరం లేదా ఒళ్ళు నొప్పులు వస్తే .. కొందరు నేరుగా పారాసిటమాల్ వేసుకుంటారు. గర్భధారణ సమయంలో వైద్యుల సలహా లేకుండా మందులు వాడటం ప్రమాదకరం.

36
అక్కడ నడవకండి

వర్షాకాలంలో రోడ్లు, మెట్లు జారుడుగా ఉంటాయి. గర్భిణులు జారి పడితే ప్రమాదం. మంచి గ్రిప్ ఉన్న చెప్పులు వేసుకోవడం, నెమ్మదిగా నడవడం, గుంతల రోడ్లు దాటకుండా ఉండటం చాలా ముఖ్యం.

46
స్ట్రీట్ ఫుడ్ కు దూరం

వర్షాకాలంలో బయట ఆహారం, చాట్ వంటివి తింటే ఫుడ్ పాయిజనింగ్, డయేరియా లేదా టైఫాయిడ్ వచ్చే ప్రమాదం ఉంది. గర్భిణులు ఇలాంటి ఆహారాలకు దూరంగా ఉండి, ఇంట్లో వండిన శుభ్రమైన, తాజా ఆహారం తినాలి.

56
దోమతెర వాడండి

వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ఎక్కువగా వ్యాపిస్తాయి. గర్భిణులు దోమతెర వాడాలి, శరీరం పూర్తిగా కవర్ అయ్యే దుస్తులు ధరించాలి. వైద్యుల సలహా మేరకు దోమల నివారణ క్రీమ్‌లు వాడాలి.

66
సరిపడా నిద్ర, విశ్రాంతి

వర్షాకాలంలో వాతావరణం బద్ధకం కలిగిస్తుంది, కానీ కొందరు స్త్రీలు ఇంటి పనులు, ప్రయాణాలు వంటివి చేస్తూనే ఉంటారు. అలసట, ఒత్తిడి గర్భిణులకు హానికరం. తగినంత విశ్రాంతి, నిద్ర చాలా అవసరం.

Read more Photos on
click me!

Recommended Stories