ఎముకల పెరుగుదల, బలోపేతానికి ప్రోటీన్లు కూడా చాలా అవసరం. బోన్ హెల్త్ లో ప్రోటీన్లు కీలక పాత్ర పోషిస్తాయి. పప్పులు, బీన్స్, గుడ్లు, చికెన్, చేపలలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పిల్లల వయస్సును బట్టి వారికి సరైన మోతాదులో ప్రోటీన్లు ఇవ్వాలి. అలాగే విటమిన్ కె ఎముకల ఆరోగ్యాన్ని నిర్ధారిస్తుంది. బ్రోకలీ, క్యాబేజీ, ఆకుకూరలలో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్లతో పాటు మెగ్నీషియం, భాస్వరం వంటి ఇతర ఖనిజాలు, విటమిన్లు కూడా ఎముకల పెరుగుదలకు అవసరం. కాబట్టి పిల్లలకు పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, ప్రోటీన్లు వంటి సమతుల్య ఆహారం అందించాలి.