Pregnancy Diet: బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలంటే.. గర్భిణులు తినాల్సిన ఆహారం
pregnancy-parenting Jun 25 2025
Author: Rajesh K Image Credits:Freepik
Telugu
ప్రోటీన్ ఫుడ్
గర్భిణీ స్త్రీలు మాంసం, గుడ్లు, పప్పులు, పాలు వంటి ఆహారాలను తీసుకోవడం శిశువు పెరుగుదలకు, కండరాల అభివృద్ధికి సహాయపడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి, బిడ్డలకు పోషకాహారం ముఖ్యం.
Image credits: Freepik
Telugu
ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్
గర్భిణులకు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్స్ చాలా అవసరం. మెదడు, వెన్నెముక రుగ్మతలు వంటి పుట్టుకతో వచ్చే లోపాలను నిరోధించడంలో సహాయపడుతుంది. అందుకే ఆకుకూరలు, చిక్కుళ్ళు, పండ్లు తీసుకోవాలి.
Image credits: Freepik
Telugu
కాల్షియం అధికంగా ఆహారం
పాలు, పెరుగు, జున్ను వంటి పాల ఉత్పత్తులు తల్లి, బిడ్డల ఎముకలు, దంతాల బలోపేతానికి సహాయపడతాయి. ఇందులో కాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలు అధికంగా ఉంటాయి.
Image credits: Freepik
Telugu
ఐరన్ ఫుడ్
పాలకూర, మాంసం, నారింజ వంటి ఆహారాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. ఇవి తినడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టవచ్చు.
Image credits: Freepik
Telugu
మెదడు అభివృద్ధికి
శిశువు మెదడు అభివృద్ధికి అవసరమైన కొవ్వు ఆమ్లాలను అవకాడోలు, గింజలు, ఆలివ్ నూనె అందిస్తాయి. అవకాడో, డ్రై ఫ్రూట్స్ లో హెల్తీ ఫ్యాట్స్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
Image credits: Freepik
Telugu
తృణధాన్యాలు
జొన్నలు, సజ్జలు, రాగులు, గోధుమలు, ఓట్స్, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాలు గర్భిణీ స్త్రీలకు మేలు చేస్తాయి. ఇవి పోషకాల గని, రక్తహీనతను నివారిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి.