పాఠశాలకు వెళ్లే పిల్లల పనితీరు వారి ఉదయపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. పిల్లల ఉదయపు అలవాట్లు వారిని పాఠశాల కోసం సిద్ధం చేయడమే కాకుండా, వారి దృష్టి, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి సహాయపడతాయి. మీ పిల్లలు పాఠశాలలో బాగా రాణించాలని, వారి వ్యక్తిత్వం అభివృద్ధి చెందాలని కోరుకుంటే, వారికి ఈ 5 ఉదయపు అలవాట్లను తప్పకుండా నేర్పించండి.