సాధారణంగా స్కూల్ కు వెళ్లే పిల్లల సామర్థ్యంపై వారి మార్నింగ్ అలవాట్ల ప్రభావం కచ్చితంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పిల్లల మార్నింగ్ అలవాట్లు వారిని స్కూల్ కు సిద్ధం చేయడమే కాకుండా వారి ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, ఆత్మవిశ్వాసాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి. పిల్లలు స్కూల్లో బాగా చదవడానికి, వారి వ్యక్తిత్వం మెరుగుపరచడానికి తల్లిదండ్రులు వారికి కొన్ని విషయాలు తప్పకుండా నేర్పించాలి. అవెంటో ఇక్కడ చూద్దాం.
హోం వర్క్:
ప్రతిరోజూ ఉదయం 10 నుంచి 15 నిమిషాలు పిల్లలు వారి హోంవర్క్ మొదలైన వాటిని సమీక్షించాలి. ఇది వారి జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
నీళ్లు తాగే అలవాటు:
ఉదయం లేవగానే పిల్లలకు నీళ్లు తాగే అలవాటు చేయాలి. ఇది వారి మనస్సును చురుకుగా ఉంచుతుంది. ఏకాగ్రతను మెరుగుపరుస్తుంది.
స్క్రీన్ టైమ్:
ఉదయం పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వడం మానుకోండి. ఇది వారి మెదడును అలసిపోయేలా చేస్తుంది. ఏకాగ్రతను తగ్గిస్తుంది.
ఆరోగ్యకరమైన ఆహారం:
పిల్లలకు ఉదయం ఆరోగ్యకరమైన ఆహారం ఇవ్వాలి. ఇది మెదడుకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఏదైనా నేర్చుకోవడానికి లేదా బాగా చదువుకోవడానికి సహాయపడుతుంది.
త్వరగా లేచే అలవాటు:
పిల్లలు ఉదయం త్వరగా నిద్రలేచే అలవాటు చేయాలి. దీనివల్ల వారికి ఎక్కువ సమయం ఉంటుంది. కాబట్టి రోజును ప్రశాంతంగా ప్రారంభిస్తారు. పిల్లలు రోజూ వీటిని చేస్తూ ఉంటే మంచి ఫలితాలు చూస్తారు.