Today Top 5 News : నేడు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే..

Published : Sep 11, 2025, 07:14 PM ISTUpdated : Sep 11, 2025, 07:39 PM IST

Today Top 5 News : మీరు ఇవాళ్టి టాప్ న్యూస్ ఒకేచోట తెలుసుకోవాలని అనుకుంటున్నారా? మీకోసమే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, నేషనల్ , ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ లో టాప్ 5 వార్తలు అందిస్తున్నాం. 

PREV
16
నేడు మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలివే..

Today’s News Roundup 11th September 2025: తెలంగాణ స్థానికసంస్థల ఎన్నికల్లో బిసిలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ ఆమోదం, నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారితో విశాఖకు బయలుదేరిన విమానం, నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ ఘిసింగ్ నియామకం, భారత్ లో బాంబుదాడులకు కుట్రలు పన్నినట్లు ఆరోపిస్తూ పాకిస్థాన్ దౌత్యవేత్తకు ఎన్ఐఏ సమన్లు, ఆసియా కప్ 2025 లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగే మ్యాచ్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వంటి ప్రధాన వార్తలున్నాయి. ఇవాళ వీటిగురించి మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిందే.

26
1. బిసిలకు 42% రిజర్వేషన్ బిల్లుకు గవర్నర్ ఆమోదం (Telangana News)

తెలంగాణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్ధానిక సంస్థల ఎన్నికలకు లైన్ క్లియర్ అయ్యింది. రేవంత్ సర్కార్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బిసి రిజర్వేషన్లను పెంచిన విషయం తెలిసిందే... ఇందుకోసం ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించింది. అన్నిపార్టీల ఆమోదంతో తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం, 2018 ని సవరించి బిసి రిజర్వేషన్లను పెంచేందుకు ఆమోదం తెలిపారు... ఈ ముసాయిదా ఆర్డినెన్స్ ను గవర్నర్ ఆమోదానికి పంపారు. కానీ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దీనికి వెంటనే ఆమోదం తెలపకుండా న్యాయసలహా కోసం టైమ్ తీసుకున్నారు.. దీంతో అసలు బిసి రిజర్వేషన్ల పెంపు జరుగుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

అయితే చివరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బిసి రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం తెలపడంతో తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అడ్డంకి తొలగిపోయింది. గ్రామీణప్రాంతాల్లో సర్పంచ్, ఎంపిటిసి, జడ్పిటిసితో పాటు పట్టణప్రాంతాల్లోని మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇక 50 శాతానికి పైగా రిజర్వేషన్లు అమలుకానున్నాయి. గవర్నర్ రిజర్వేషన్లకు ఆమోదం తెలపడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల (సెప్టెంబర్) లోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తుందేమో చూడాలి.

పూర్తి వార్త కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి https://telugu.asianetnews.com/telangana/elangana-bc-reservations-governor-approves-42-percent-quota-bill-articleshow-gt89gtl

36
2. నేపాల్ చిక్కుకున్న తెలుగువారితో ఏపీకి విమానం (Andhra Pradesh News)

నేపాల్ లో ప్రస్తుతం హింసాత్మక పరిస్ధితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగువారిని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారిని సురక్షితంగా నేపాల్ నుండి తీసుకువచ్చేందుకు ఐటీ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వార్ రూమ్ ను ఏర్పాటుచేసి విదేశాంగ శాఖ అధికారులు, నేపాల్ లోని భారత ఎంబసీ సాయంతో తెలుగువారు ఎక్కడెక్కడున్నారో గుర్తించింది ఏపీ ప్రభుత్వం. ఇలా గుర్తించిన 114 మందిని ప్రత్యేక విమానంలో ఇండియాకు తరలిస్తున్నారు... ఉదయమే విమానం ఖాట్మండు నుండి బయలుదేరింది. ఈ విమానం విశాఖపట్నం, తిరుపతి విమానాశ్రయాల్లో తెలుగువారిని విడిచిపెడుతుంది.

46
3. ఇండియాలో బాంబు పేలుళ్లకు పాక్ దౌత్యవేత్త కుట్రలు (National News)

ఇండియాలో బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఆరోపిస్తూ పాకిస్థాన్ దౌత్యవేత్త అమీర్ జుబేర్ కు చెన్నైలోని ఎన్ఐఏ కోర్టు నోటీసులు జారీ చేసింది. భారత్ లోని అమెరికా, ఇజ్రాయెల్ ఎంబసీలపై దాడులకు కుట్రలు జరిగాయని... వీటితో జుబేర్ కు సంబంధాలున్నాయని ఎన్ఐఏ పేర్కొంది. శ్రీలంకలోని పాకిస్థాన్ హైకమీషన్ లో వీసా కౌన్సిలర్ గా పనిచేసే సమయంలో సిద్దిఖీ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొన్నారని ఎన్ఐఏ పేర్కొంది.

56
4. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ ఘిన్సింగ్? (International News)

Generation Z (జెన్-జి) ఉద్యమం నేపాల్ ను కుదిపేస్తోంది... యువత దెబ్బకు అక్కడి ప్రభుత్వం కూలిపోయింది. సోషల్ మీడియా యాప్స్ ను బ్యాన్ చేయడంతో మొదలైన నిరసనలు అవినీతి వ్యతిరేక పోరాటానికి దారితీశాయి. ప్రధాని ఓలితో పాటు ఆయన మంత్రులు, ఇతర పాలకులు, అధికారులు అవినీతిలో మునిగిపోయారని నేపాల్ యువత ఆరోపణ. దీంతో భారీగా రోడ్లపైకి వచ్చిన యువత పాలకులు, అధికారులను చితకబాదుతున్నారు. దీంతో ప్రధానితో పాటు ఇతర మంత్రులు రాజీనామా చేశారు.

అయితే నేపాల్ లో పరిస్ధితిని చక్కదిద్దేందుకు, పాలనను కొనసాగించేందుకు ఓ నాయకత్వం కావాలి... ఇందుకోసం తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ ఘిసింగ్ ను నియమించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఆయనకు పాలనా బాధ్యతలు అప్పగించేందుకు నిరసనకారులు కూడా అంగీకారం తెలిపినట్లు సమాచారం. అందరి ఆమోదంతో ఆయనను ప్రధాని బాధ్యతలు అప్పగించనున్నట్లు నేపాల్ మీడియాలో ప్రసారం అవుతోంది. ఆయన కూడా ఈ బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది.

పూర్తి వార్త కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి

https://telugu.asianetnews.com/international/nepal-crisis-kulman-ghising-takes-charge-of-governance-who-is-he-articleshow-rdl6pwf

66
5. ఆసియా కప్ 2025 లో ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ జరుగుతుందా? (Sports News)

ఆసియా కప్ 2025 లో అత్యంత ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్ ఇండియా-పాకిస్థాన్... ఈ మ్యాచ్ కోసం ఇరుదేశాలకు చెందిన కోట్లాదిమంది ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 14న దుబాయ్ వేదికన జరిగే ఈ హైవోల్టేజ్ మ్యాచ్ పై అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ఈ మ్యాచ్ ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలయ్యింది. నలుగురు న్యాయ విద్యార్థులు ఈ పిల్ దాఖలు చేశారు. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ వంటి ఘటనల నేపథ్యంలో ఇండియా-పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.. ఇలాంటి పరిస్థితుల్లో ఇరుదేశాల మధ్య క్రికెట్ మ్యాచ్ సమంజసం కాదని... ఇది దేశాన్ని అగౌరవ పర్చడమేనని అన్నారు. అయితే ఈ మ్యాచ్ ను సాధారణ క్రీడల మాదిరిగానే తీసుకోవాలంటూ న్యాయస్థానం విచారణకు అంగీకరించలేదు.

Read more Photos on
click me!

Recommended Stories