Kulman Ghising :నేపాల్ లో ప్రస్తుతం పాలనా సంక్షోభం కొనసాగుతోంది. జెన్-జి నిరసన నేపథ్యంలో ప్రధాని ఓలి రాజీనామా చేయడంతో తర్వాత పాలనాపగ్గాలు ఎవరికి దక్కుతాయన్నది ఆసక్తరంగా మారింది.

Kulman Ghising: నేపాల్ 'జెన్-జి' ఉద్యమం తారాస్థాయికి చేయింది. ఇప్పటికే ప్రజలు మరీముఖ్యంగా నేపాల్ యువత రోడ్లపైకి వచ్చి ఆందోళనకు దిగుతోంది... పాలకులు, అధికారులు ఎవ్వరినీ వదిలిపెట్టకుండా దొరికినవారికి దొరికినట్లు చితకబాదుతున్నారు. చివరకు మాజీ ప్రధానులు, మంత్రులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులు నిరసనకారులు చేతిలో దెబ్బలుతిన్నారు... చాలామంది రహస్య ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారు. అయితే ఈ అల్లర్ల నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం కుప్పకూలింది... ప్రధాని కెపి శర్మ ఓలి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుత గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వాన్ని నడిపేందుకు ఎవ్వరూ ముందుకు రావడంలేదు.

ఎవరీ కుల్మాన్ ఘిసింగ్ :

మొదట ఖాట్మండు మేయర్ బాలెన్ షా, మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి నేపాల్ పాలనా పగ్గాలు చేపడతారని ప్రచారం జరిగింది. అయితే వీరు ఈ బాధ్యతలు స్వీకరించేందుకు తిరస్కరించినట్లు సమాచారం. దీంతో దేశ విద్యుత్ అథారిటీ అధిపతి కుల్మాన్ ఘిసింగ్ ప్రభుత్వాన్ని నడిపించనున్నట్లు తెలుస్తోంది. ఆయనకు ప్రజల్లోనూ మంచి పేరుంది... అవినీతి మరకలు లేవు.. అందుకే ఆయన అయితేనే యువతలో ఆగ్రహావేశాలు చల్లబడతాయని భావిస్తున్న ఆర్మీ ఎన్నికలు జరిగేవరకు పాలనాపగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం.

నేపాల్ లో సోషల్ మీడియాను బ్యాన్ చేయడంతో మొదలైన 'జెన్-జి' ఉద్యమం అవినీతికి వ్యతిరేకంగా కొనసాగుతోంది. ఓలి ప్రభుత్వం ప్రజాగ్రహానికి తలొగ్గి సోషల్ మీడియాపై బ్యాన్ ఎత్తేసినా ఉద్యమం కొనసాగుతోంది. సుపరిపాలన కోసం తమ నిరసనను కొనసాగించారు నేపాల్ ప్రజలు. దీంతో ప్రధాని ఓలి రాజీనామా చేశారు... దీంతో ప్రభుత్వం కుప్పకూలిపోగా తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో దేశాన్ని నడిపే నాయకుడు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.

జెన్-జి యువత ఛాయిస్ ఆయనేనా?

అయితే కుల్మాన్ ఘిసింగ్ కు ప్రధాని బాధ్యతలు అప్పగించేందుకు ఇటు 'జెన్-జి' ఉద్యమకారులు, అటు ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. దీంతో ఆయన నేపాల్ లో తాత్కాలిక ప్రభుత్వాన్ని నడిపనున్నారు. మరి ఈయన బాధ్యతలు చేపట్టాక అయినా ‘జెన్-జి’ ఉద్యమకారులు చల్లబడతారా? నేపాల్ లో శాంతియుత వాతావరణం ఏర్పడుతుందేమో చూడాలి.