Republic Day 2026 : భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 77 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఇవాళ (జనవరి 26న) జరుగుతున్న గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విదేశీ అతిథులు పాల్గొన్నారు.
Republic Day 2026 : భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నారు. దేశ రాజధాని డిల్లీ నుండి మారుమూల గల్లీ వరకు ప్రతిచోట మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. దేశ రాజధాని న్యూడిల్లీలోని కర్తవ్యపథ్ లో అయితే వేడుకలు అట్టహాసంగా సాగాయి… రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జెండాను ఆవిష్కరించారు.
దేశ సైనిక సత్తాను చాటే పరేడ్, ఆయుధసంపత్తి ప్రదర్శన, వివిధ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన శకటాల ప్రదర్శనలతో కర్తవ్యపథ్ లో సందడి నెలకొంది. యావత్ దేశమే గర్వించేలా ఈ వేడుకలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని సందర్శించిన మొట్టమొదటి భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా రాష్ట్రపతి చేతులమీదుగా అత్యున్నత శౌర్య పురస్కారం 'అశోక చక్ర' అందుకున్నారు.
24
రిపబ్లిక్ డే వేడుకల్లో విదేశీ అతిథులు
ఈ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా యురోపియన్ కౌన్సిల్ అధ్యక్షులు ఆంటోనియా కోస్టా, యురోపియన్ కమీషన్ అధ్యక్షరాలు ఉర్సులా హన్ డెర్ లేయెన్ హాజరయ్యారు. అలాగే ఉప రాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, సామాన్య ప్రజలు హాజరయ్యారు. ''స్వతంత్రత కా మంత్ర - వందేమాతరం'' సమృద్ధి కా మంత్ర - ఆత్మనిర్భర్ భారత్" థీమ్ తో ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు.
34
ఫస్ట్ టైమ్ అమరావతిలో రిపబ్లిక్ డే వేడుకలు..
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిలో మొదటిసారి రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. హైకోర్టు సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మైదానంలో ఈ వేడుకలు నిర్వహించారు... గవర్నర్ అబ్దుల్ నజీర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజధాని ప్రాంతాలకు చెందిన రైతులు కూడా పెద్దసంఖ్యలో ఈ వేడుకలకు హాజరయ్యారు. పోలీసుల పరేడ్, వివిధ శాఖల శకటాల ప్రదర్శన, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. అమరావతి ప్రాంతంలో జరిగిన ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తెలంగాణలో కూడా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ముందుగా మైదానంలోని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు గవర్నర్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలో ఉండటంతో ఈ ఈ రిపబ్లిక్ డే వేడుకలకు హాజరుకాలేకపోయారు… డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇక తెలంగాణ అసెంబ్లీలో కూడా రిపబ్లిక్ వేడుకలు నిర్వహించారు. శాసనసభలో స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన మండలిలో ఛైర్మర్ గుత్తా సుఖేందర్ రెడ్డి లు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, అన్ని విద్యాసంస్థల్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.