Most Expensive Things: ఇండియన్స్ సృష్టించిన అత్యంత ఖరీదైన అద్భుతాలు ఏంటో తెలుసా?

Published : Jan 24, 2026, 03:58 PM IST

ఇండియన్స్ అంటే ఇన్నోవేషన్, విజన్, వెల్త్ క్రియేషన్ కి బ్రాండ్. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నిర్మాణాలు, ప్రాజెక్టులు, బిజినెస్ ల వంటి వాటి వెనుక భారతీయుల మేథస్సు దాగి ఉంది. అలా మన ఇండియన్స్ క్రియేట్ చేసిన అత్యంత ఖరీదైన అద్భుతాల గురించి మీకు తెలుసా?

PREV
18
స్టాట్చ్యూ ఆఫ్ యూనిటీ

ప్రపంచంలోని అత్యంత ప్రసిద్ధ విగ్రహాలలో స్టాట్చ్యూ ఆఫ్ యూనిటీ ఒకటి. ఈ మహా విగ్రహాన్ని సర్దార్ వల్లభ భాయ్ పటేల్‌ జ్ఞాపకార్థంగా గుజరాత్ రాష్ట్రంలోని నర్మదా నది ఒడ్డున నిర్మించారు. దీని ఎత్తు 182 మీటర్లు. భారతదేశ శక్తి, ఏకత్వం, దృఢ సంకల్పాన్ని ఈ విగ్రహం ప్రతిబింబిస్తుంది. స్టాట్చ్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణానికి దాదాపు రూ. 3000 కోట్ల వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

28
సూరత్ డైమండ్ బోర్స్

సూరత్ డైమండ్ బోర్స్ ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రాల వాణిజ్య కేంద్రం. ఇది గుజరాత్‌లోని సూరత్‌లో ఉంది. ఇందులో 4,200కు పైగా వజ్రాల వ్యాపార కాంప్లెక్స్ లు, కట్టింగ్, పాలిషింగ్, ట్రేడింగ్, రిటైల్ జ్యువెలరీ షాపులు, కస్టమ్స్ క్లియరెన్స్ హౌస్‌ లు ఉన్నాయి. దీన్ని నిర్మించడానికి దాదాపు 3400 కోట్ల రూపాయల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.

38
యాంటీలియా

ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబం నివసించే అత్యంత విలాసవంతమైన నివాసం యాంటీలియా. ఇది ముంబైలో ఉంది. యాంటీలియా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఇది 27 అంతస్తులు, హెలిప్యాడ్‌ లు, థియేటర్, అధునాతన సౌకర్యాలతో కూడిన ఒక అద్భుతమైన నిర్మాణం. యాంటీలియా విలువ 15 వేల కోట్ల రూపాయల వరకు ఉంటుంది.

48
కోహినూర్ డైమండ్

కోహినూర్ వజ్రం గురించి వినని వారుండరు. ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ప్రసిద్ధ వజ్రాలలో ఇదీ ఒకటి. కృష్ణా నది తీరంలోని గోల్కొండ (కోల్లూరు) గనులలో ఇది లభించింది. చేతులు మారుతూ మారుతూ చివరకు బ్రిటన్‌ చేరింది. ప్రస్తుతం లండన్ టవర్‌లోని క్వీన్ మదర్ కిరీటంలో అమర్చబడి ఉంది. మొదట దీని బరువు 186 క్యారెట్లుగా ఉండేది. పునఃకటింగ్ తర్వాత 105.6 క్యారెట్లకు తగ్గింది. కోహినూర్ వజ్రానికి నిర్దిష్టమైన ధర లేదు. కానీ నిపుణుల అంచనాల ప్రకారం దీని విలువ సుమారు రూ. 8,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల మధ్య ఉంది.

58
ఇండియన్ ప్రీమియర్ లీగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) అనేది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను ఆకర్షించిన ప్రముఖ టీ20 లీగ్. 2008 లో బీసీసీఐ ఈ లీగ్‌ని ప్రారంభించింది. ఈ పోటీలు సాధారణంగా ప్రతి సంవత్సరం వేసవిలో జరుగుతాయి. ఈ టోర్నమెంట్‌లో జాతీయ, అంతర్జాతీయ స్టార్ ఆటగాళ్లు పోటీపడతారు. ఐపీఎల్ విలువ రూ. 1.55 లక్షల కోట్లకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది.

68
ఐఎన్‌ఎస్ విక్రాంత్

ఐఎన్‌ఎస్ విక్రాంత్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక. ఇది భారత నావికాదళానికి ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యానికి నిదర్శనం. సంస్కృతంలో దీని అర్థం 'ధైర్యవంతుడు' అని. 1971 ఇండో-పాక్ యుద్ధంలో కీలక పాత్ర పోషించిన పాత విక్రాంత్ (R11) పేరుకు ఇది నివాళి. కొత్త విక్రాంత్ ను (2013) అధునాతన సాంకేతికతతో నిర్మించారు. దీని కోసం రూ. 23 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

78
జియో డిజిటల్ ఎకోసిస్టమ్

జియో డిజిటల్ ఎకోసిస్టమ్ అనేది భారతదేశంలో డిజిటల్ విప్లవానికి నాంది పలికిన ఒక సమగ్ర సాంకేతిక వ్యవస్థ. తక్కువ ఖర్చుతో ఇంటర్నెట్‌ను ప్రతి ఒక్కరికీ అందించాలనే ఉద్దేశంతో రూపొందించబడింది. సినిమాల నుంచి చదువు వరకు, షాపింగ్ నుంచి పేమెంట్స్ వరకు అన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌లో అందుబాటులోకి తీసుకువచ్చింది జియో. స్మార్ట్‌ఫోన్ వాడే ప్రతి ఒక్కరి రోజువారీ జీవితంలో భాగమై, “డిజిటల్ ఇండియా” లక్ష్యాలను సాధించడంలో సహాయపడటం జియో ప్రధాన ఉద్దేశం. దీని విలువ సుమారు రూ. 3-4 లక్షల కోట్ల వరకు ఉంటుంది.

88
వందే భారత్ ఎక్స్‌ప్రెస్

వందే భారత్ ఎక్స్‌ప్రెస్, భారతదేశంలో తయారైన సెమీ-హై-స్పీడ్ రైలు, విమానం వంటి అనుభూతినిస్తూ వేగంగా, సౌకర్యవంతంగా ప్రయాణించడానికి రూపొందించబడింది. ఇందులో అత్యాధునిక సౌకర్యాలు, భద్రతా వ్యవస్థలు, బయో-టాయిలెట్లు, ఆకర్షణీయమైన డిజైన్,  స్లీపర్ కోచ్‌లతో సహా వివిధ వెర్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. మొదటి వందే భారత్ రైలు 2019 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఒక్కో రైలు విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories