సమతల ప్రాంతాలలో పండించలేమా?
గుచ్చి పుట్టగొడుగులకు ఉన్న డిమాండ్, ధర కారణంగా చాలా మంది వీటిని పండించడానికి ప్రయత్నించారు. కొంతమంది ఇంట్లో పండించడంలో విజయం సాధించారు. కానీ నాణ్యత మాత్రం జమ్ము కశ్మీర్ లాంటి ప్రాంతాల్లో పండించిన వాటితో సమానంగా లేదు.
ఏయే పోషకాలు ఉన్నాయి?
గుచ్చి పుట్టగొడుగులలో పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ధర కూడా ఎక్కువ. ఈ పుట్టగొడుగులో యాంటీఆక్సిడెంట్లు, ప్రోటీన్, ఫైబర్, విటమిన్ డి, బి విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి క్యాన్సర్ నిరోధకత, ఎముకల బలోపేతం, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.