దేశంలో ఏకైక ప్రైవేట్ రైల్వే స్టేషన్.. రూ. 450 కోట్లతో నిర్మాణం, ఎక్కడో తెలుసా?

Published : May 03, 2025, 09:05 AM IST

భారతదేశంలో 7,308 కి పైగా రైల్వే స్టేషన్లు ఉన్నాయి. అయితే సహజంగానే రైల్వే స్టేషన్లు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయని తెలిసిందే. అయితే దేశంలో ఒక ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఉందని మీకు తెలుసా.? ఇంతకీ ఏంటా రైల్వే స్టేషన్.? ఎక్కడ ఉంది.? దాని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

PREV
19
దేశంలో ఏకైక ప్రైవేట్ రైల్వే స్టేషన్.. రూ. 450 కోట్లతో నిర్మాణం, ఎక్కడో తెలుసా?

మన భారతీయ రైల్వే ప్రపంచంలోని ఐదు అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌లలో ఒకటి. భారతదేశంలో 7,308 కి పైగా రైల్వే స్టేషన్లు పనిచేస్తున్నాయి. ప్రతిరోజూ 13,000 కంటే ఎక్కువ రైళ్లలో 2 కోట్లకు పైగా ప్రయాణికులు ప్రయాణిస్తారు.

29

అత్యధిక ప్రయాణికులు ప్రయాణించడం వల్ల భారత ప్రభుత్వానికి అత్యధిక ఆదాయం లభిస్తుంది. రైల్వే నుంచి వచ్చే ఆదాయం అధికమని తెలిసిందే. భారతీయ రైల్వే భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక, దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన,  చౌకైన రవాణా కావడంతో ప్రజలు కూడా రైళ్లకు మొగ్గు చూపుతారు. 

39

భారతీయ రైల్వే నిర్వహణను భారత ప్రభుత్వమే చూసుకుంటుంది. దేశంలోని అన్ని రైళ్లు భారత ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి. కానీ భారతదేశంలో ఒక ప్రైవేట్ రైల్వే స్టేషన్ ఉంది. 

49

ఈ రైల్వే స్టేషన్ అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను కలిగి ఉంది. ఈ రైల్వే స్టేషన్ పేరు రాణి కమలాపతి. గతంలో దీనిని హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ అని పిలిచేవారు. 2021 నవంబర్‌లో రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌గా పేరు మార్చారు.

59

ఈ రైల్వే స్టేషన్‌లో ఏయే సౌకర్యాలు ఉన్నాయి?

అతిపెద్ద పార్కింగ్ స్టేషన్, 24*7 విద్యుత్ సరఫరా, శుభ్రమైన త్రాగునీటి వ్యవస్థ, ఎయిర్ కండిషన్డ్ గదులు, ఆఫీసులు, దుకాణాలు, హై స్పీడ్ ఎస్కలేటర్, లిఫ్ట్, యాంకర్ స్టోర్, ఆటోమొబైల్ షోరూమ్‌లు, కన్వెన్షన్ సెంటర్, హోటల్,  సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వంటి ఉంటాయి. 

69

ఈ రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంది?

రాణి కమలాపతి రైల్వే స్టేషన్ మధ్యప్రదేశ్‌లోని హబీబ్‌గంజ్‌లో ఉంది. ఈ స్టేషన్ నవీ ఢిల్లీ,  చెన్నై మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని కలిగి ఉంటుంది. జూన్ 2007లో ఈ స్టేషన్‌ను ప్రైవేటీకరించారు. ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేశారు. ప్రభుత్వం, ప్రైవేట్ సంయుక్తంగా ఈ రైల్వే స్టేషన్‌ను ఉన్నత స్థాయికి తీసుకువెళ్లారు.

79

బన్సల్ గ్రూప్, ఒక ప్రైవేట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సంస్థ, ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ - IRSDC కలిసి పనిచేస్తున్నాయి. నవంబర్ 15, 2021న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ స్టేషన్ నిర్వహణను ప్రైవేట్ కంపెనీ చూసుకుంటుంది, కానీ అది భారత ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది.

89

రాణి కమలాపతి రైల్వే స్టేషన్ పునరాభివృద్ధికి ఏకంగా 450 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. దీని ద్వారా అన్ని మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలను కల్పించారు.

99

ప్రజలను నియంత్రించడానికి ప్రత్యేక ప్రవేశ ద్వారం, నిష్క్రమణ ద్వారాలను ఏర్పాటు చేశారు. 18వ శతాబ్దపు గోండ్ రాణి, ధైర్యవంతురాలు, పోరాట యోధురాలు రాణి కమలాపతి పేరును నవీకరించిన రైల్వే స్టేషన్‌కు పెట్టారు.

Read more Photos on
click me!

Recommended Stories