OTT Censorship : ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై సెన్సార్‌షిప్ ఆంక్షలు? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే?

First Published Oct 19, 2024, 5:24 PM IST

OTT Censorship: ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్ ను నియంత్రించడానికి స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ఇదివ‌ర‌కు పిటిషన్ దాఖ‌లైంది. ఈ విషయంలో ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాల‌ని కోరింది.
 

OTT Censorship: భారతదేశంలో ఓవర్-ది-టాప్ (OTT), స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను పర్యవేక్షించడానికి, నిర్వహించడానికి రెగ్యులేటరీ బోర్డు ఆవశ్యకతకు సంబంధించిన పిల్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. భారత యూనియన్, సమాచార అండ్ ప్రసార మంత్రిత్వ శాఖ OTT ప్లాట్‌ఫారమ్‌లను స్వీయ-నియంత్రణ కోసం IT రూల్స్ 2021 ను ప్రవేశపెట్టాయి, అయితే అది అసమర్థంగా ఉందని పిటిషన్ పేర్కొంది. ప్ర‌భుత్వానికి ఈ విష‌యంలో ఆదేశాలు ఇవ్వాల‌ని కోరింది. అయితే, సుప్రీంకోర్టు ఈ పిటిష‌న్ ను తొసిపుచ్చింది.

court

వివ‌రాల్లోకెళ్తే.. OTT ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్‌ను నియంత్రించడానికి స్వతంత్ర నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని దాఖలు చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు శుక్ర‌వారం తిరస్కరించింది. అటువంటి బోర్డును ఏర్పాటు చేసేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిఐఎల్) కోర్టు కొట్టివేసింది.

ఈ అంశం విధానపరమైనదని వివరించింది.ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జ‌స్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం OTT ప్లాట్‌ఫారమ్‌లలో కంటెంట్‌ను నియంత్రించడం ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించిన విషయమనీ, వివిధ వాటాదారులతో విస్తృతమైన సంప్రదింపులు అవసరమని సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం పేర్కొంది.

Latest Videos


Supreme Court

ఇప్పుడు చాలా పిల్ లు విధానపరమైన సమస్యలపై ఆధారపడి ఉన్నాయనీ, తద్వారా నిజమైన ప్రజా ప్రయోజనాలను విస్మరిస్తున్నారని కూడా ప్రధాన న్యాయమూర్తి పేర్కొన్నారు.

ఈ పిటిషన్‌ను దాఖలు చేసిన న్యాయవాది శశాంక్ శేఖర్ ఝా తన ఫిర్యాదులతో సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖను ఆశ్రయించేందుకు అనుమతిని కోరారు, అయితే కోర్టు పిటిషన్‌ను పూర్తిగా తోసిపుచ్చింది. పిటిషన్‌లో నెట్‌ఫ్లిక్స్ సిరీస్ "IC 814: ది కాందహార్ హైజాక్" ను కూడా ప్ర‌స్తావించారు.  అటువంటి నియంత్రణ యంత్రాంగం అవసరమని పేర్కొంది. సినిమాటోగ్రాఫ్ చట్టం ప్రకారం పబ్లిక్ సినిమాలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) మాదిరిగానే, ప్రస్తుత పరిస్థితుల్లో OTT ప్లాట్‌ఫారమ్‌లలో చూపించే కంటెంట్‌పై నియంత్రణ లేదని పిటిషనర్ పేర్కొన్నారు.

సినిమాటోగ్రాఫ్ చట్టం చలనచిత్రాలపై కఠినమైన ధృవీకరణ ప్రక్రియను విధిస్తుంది, అయితే OTT ప్లాట్‌ఫారమ్‌లలో చూపబడే కంటెంట్‌పై బాహ్య నియంత్రణ ఉండదు. ప్రస్తుతం OTT ప్లాట్‌ఫారమ్‌లు స్వీయ-నియంత్రణపై మాత్రమే ఆధారపడి ఉన్నాయి, అయితే ఈ నియమాలను సరిగ్గా పాటించడం లేదని పిటిషనర్ తెలిపారు.

భారతదేశంలో ప్రస్తుతం 40 కంటే ఎక్కువ OTT, వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు పౌరులకు చెల్లింపు, ప్రకటన-మద్దతు ఉన్నవాటితో పాటు, ఉచిత కంటెంట్‌తో సహా వివిధ ఫార్మాట్‌లలో కంటెంట్‌ను అందిస్తున్నాయి. భావ ప్రకటనా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.

click me!