నాగార్జునకి బాలకృష్ణ తమ్ముడిగా మారిన సందర్భం, బాబాయ్‌గా నీకు నేనున్నా అంటూ నాగచైతన్యకి భరోసా!

First Published | Oct 19, 2024, 7:36 PM IST

నాగార్జున, బాలకృష్ణ మధ్య విభేదాలున్నాయనే విషయం తెలిసిందే. కానీ ఇద్దరు మధ్య అనుబంధం చాటి చెప్పిన సందర్భం, నాగ్‌కి బాలయ్య తమ్ముడిగా మారిన సందర్బం, చైతన్యకి బాబాయ్‌గా మారిన సందర్భంగా ఉంది.  

నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జునకి పడదు అని, ఇద్దరి మధ్య విభేదాలున్నాయనే ప్రచారం నడుస్తున్న విషయం తెలిసిందే. మధ్యలో ఓ సందర్భంలో బాలయ్యతో తనకు ఎలాంటి విభేదాలు లేవని ఇద్దరు చెప్పారు. ఒకటి రెండు ఈవెంట్లలో ఇద్దరు ఈ విషయాన్ని క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికీ ఆ రూమర్‌ రన్‌ అవుతూనే ఉంది. ఆ తర్వాత వీరిద్దరు పెద్దగా కలవకపోవడమే దానికి కారణంగా చెప్పొచ్చు. 

అయితే ఈ ఇద్దరు ఒకప్పుడు బాగానే కలిసి ఉన్నారు. ఇద్దరి మధ్య మంచి అనుబంధమే ఉంది. ఈ పది పదిహేనేళ్లుగానే ఈ రూమర్‌ వినిపిస్తుంది. కానీ అంతకు ముందు చాలా సందర్భాల్లో ఈ ఇద్దరు బాగానే ఉన్నారు. కానీ అప్పుడు ఇంతటి మీడియా, సోషల్‌ మీడియా లేకపోవడం వల్ల అది బయటకు రాలేదు. కానీ బాలయ్య, నాగార్జునతో ఉన్న అనుబంధాన్ని చాటి చెప్పిన సందర్భం ఉంది. తాను నాగ్‌కి తమ్ముడిగా మారిపోయిన సందర్భం ఉంది. ఏఎన్నార్‌ని బాబాయ్‌గా పిలిస్తే, తాను నాగ చైతన్యకి బాబాయ్‌గా పిలిపించుకోవడం విశేషం. మరి ఇంతకి ఈ సంఘటన ఎక్కడ చోటు చేసుకుంది. ఇలాంటి అరుదైన సందర్భానికి కారణం ఏంటనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలు చూస్తే. 


నాగార్జున ఇండస్ట్రీలో కింగ్‌గా, మన్మథుడిగా రాణించారు. ఆయన తన కొడుకు నాగచైతన్యని `జోష్‌` సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం చేశారు. ఈ మూవీని దిల్‌ రాజు నిర్మించగా, వాసు వర్మ దర్శకత్వం వహించారు. 2009లో ఈ సినిమా విడుదలైంది.  ఈ `జోష్‌` సినిమా ఆడియో ఈవెంట్‌ని గ్రాండ్‌గా ప్లాన్‌ చేశారు నాగార్జున. ఓ రకంగా నాగచైతన్యని ప్రపంచానికి పరిచయం చేసే వేదిక అది. ఫ్యాన్స్ కి పరిచయం చేసే వేదిక. చాలా మంది ప్రముఖులు దీనికి హాజరయ్యారు. 
 

టాప్‌ స్టార్స్ చాలా మంది వచ్చారు. చిరంజీవి తప్ప.. ఏఎన్నార్‌, నాగార్జునతోపాటు వెంకటేష్‌, మోహన్‌బాబు, కే రాఘవేంద్రరావు, రామానాయుడు, అప్పటి స్పీకర్‌ కిరణ్‌ కుమార్‌రెడ్డి, రాజమౌళి, శ్రీనువైట్ల, బోయపాటి శ్రీను, శ్రీహరి వంటి వారంతా పాల్గొన్నారు. రాధిక, ఆమె కూతురు, సినిమా హీరోయిన్‌ కార్తీక కూడా పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్‌కి బాలయ్య కూడా గెస్ట్ గా రావడం విశేషం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్కినేని ఫ్యామిలీతో తమకు ఉన్న అనుబంధాన్ని వెల్లడించారు. 
 

`నాగచైతన్య తాతగారు నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నాకు బాబాయ్‌ అయితే, నాగచైతన్యని ఆశీర్వదించడానికి ఈ బాబాయ్‌ ఈ వేదిక మీదకు వచ్చాడు` అంటూ ప్రకటించడం విశేషం. `జోష్‌` ఆడియో ఈవెంట్‌లో ఈ బాలకృష్ణ చెప్పిన మాటకి ఈవెంట్‌ మొత్తం దద్దరిల్లిపోయింది. ఈ సందర్బంగా ఆయన నాగార్జునపై కూడా సెటైర్లు పేల్చాడు. తండ్రి ఏఎన్నార్‌ లాగే పునికి పుచ్చుకున్నాడు పోలికలు. వెరీ గుడ్ కమర్షియల్‌ బిజినెస్‌ మేన్‌. నాగేశ్వరరావు చేసిన సినిమాలకు, నాగార్జున చేసిన సినిమాలకు పొంతన లేదని, పూర్తి భిన్నమైనవి అని తెలిపారు. నాన్నగారు(ఎన్టీఆర్‌) ఎప్పుడూ చెబుతుండే వారు, అనుకరించే వాడు నకిలి అని, అనుసరించే వాడు నిజమైన వారసుడు అవుతాడని, అలా నాగార్జున అనుసరిస్తాడు తెలపడం విశేషం. ఆ తర్వాత టీఎన్‌ఆర్‌ అవార్డు ఈవెంట్‌లో మరోసారి కలిసి కనిపించారు బాలయ్య, నాగ్‌. కానీ ఆ తర్వాత మళ్లీ కలవలేదు. 

Latest Videos

click me!