తెలుగులో మహేష్, ప్రభాస్, బాలయ్య, వెంకటేష్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, తమిళంలో అజిత్, విజయ్, విశాల్, లాంటి స్టార్ హీరోలతో జతగా కనిపించిది త్రిష. ఇక కృష్ణ, అతడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, , వర్షం, పౌర్ణమి, బుజ్జిగాడు, స్టాలిన్ ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియేంటడ్ మూవీస్ కూడా చేసింది. ప్రస్తుతం కోలీవుడ్ లో బిజీ బిజీ అయిపోయింది త్రిష.