అయితే ప్రభాస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేసిన చిత్రాలు మాత్రం డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి అని చెప్పాలి. డార్లింగ్ అనంతరం అమ్మాయిల్లో ప్రభాస్ కి క్రేజ్ పెరిగింది. ప్రభాస్ కి లేడీ ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన చిత్రాల్లో మిస్టర్ పర్ఫెక్ట్ సైతం ఒకటి. ఈ చిత్రానికి దశరధ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మించారు. కాగా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా ప్రభాస్ చేయాల్సింది కాదట. ఆ ప్రాజెక్ట్ ఆయన రిజెక్ట్ చేద్దామని అనుకున్నాడట.
ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజు ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. దిల్ రాజు మాట్లాడుతూ... స్టోరీ లైన్ చెప్పినప్పటి నుండి డైరెక్టర్ దశరధ్ తో నేను ట్రావెల్ అయ్యాను. ప్రభాస్ మలేషియాలో ఉన్నాడు. అక్కడ బిల్లా షూటింగ్ జరుగుతుంది. ప్రభాస్ ని కలిసి కథ వినిపించాము. ఆయనకు ఫస్ట్ హాఫ్ బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ మాత్రం నచ్చలేదు. అదే విషయం చెప్పాడు.