దీపావళి పర్వదినాన అయోధ్యలో అద్భుతం ... అకాశవీధుల్లో బాలరాముడి దర్శనం

By Arun Kumar PFirst Published Oct 19, 2024, 1:57 PM IST
Highlights

అయోధ్య దీపోత్సవంలో ఈసారి 500 డ్రోన్‌లతో అద్భుతమైన షో ఉంటుంది. రామ, లక్ష్మణ, హనుమాన్, రావణ సంహారం వంటి ఆకృతులు ఆకాశంలో కనిపిస్తాయి. 

అయోధ్య : భక్తి, ఆధ్యాత్మికతతో పాటు ఆధునికత సాయంతో ఈ దీపావళి వేడుకలను జరిపేందుకు సిద్దమయ్యింది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం. ఎక్కడాలేని విధంగా ఏరియల్ డ్రోన్ షో తో కూడిన  దీపోత్సవాన్ని నిర్వహించనున్నారు. బాలరాముడు కొలువైన అయోధ్య ఆకాశవీధిలో రంగురంగుల లైట్లతో కూడిన 500 డ్రోన్ల ద్వారా అద్భుతాన్ని సృష్టించనున్నారు. ఇలా దీపోత్సవం వేళ 15 నిమిషాల పాటు ఏరియల్ డ్రోన్ షో ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి మేడ్ ఇన్ ఇండియా డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు. 

ఏరియల్ డ్రోన్ షో ద్వారా శ్రీరాముడు, లక్ష్మణుడు, హనుమంతుడి వీర ముద్రలను ప్రజలు చూడగలరు. ఈ కార్యక్రమంలో లేజర్ లైట్లు, వాయిస్ ఓవర్, మ్యూజికల్ నేరేషన్ ప్రజలను ఆకట్టుకుంటుంది. రావణ సంహారం, పుష్పక విమానం, దీపోత్సవం, రామ దర్బార్, వాల్మీకి, తులసీదాస్, రామాలయం వంటి వాటిని కూడా అయోధ్య ఆకాశంలో డ్రోన్‌ల ద్వారా ప్రదర్శిస్తారు. దీపోత్సవం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం, పర్యాటక శాఖ లోగోలు కూడా కార్యక్రమంలో అయోధ్య ఆకాశంలో కనిపిస్తాయి.

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం డ్రోన్ షో నిర్వహణ

Latest Videos

బాలరాముని విగ్రహం భవ్య మందిరంలో ప్రతిష్టించిన తర్వాత మొదటిసారిగా జరుగుతున్న దీపావళి పండగ ఇది. కాబట్టి ఆరోజు దీపోత్సవ కార్యక్రమాన్ని గొప్పగా నిర్వహించాలని... ఎటువంటి లోటు లేకుండా చూస్తోంది యోగి సర్కార్. ఈ దీపోత్సవ కార్యక్రమం మరింత ప్రత్యేకంగా వుండేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఏరియల్ డ్రోన్ షో చేపట్టారు.     అక్టోబర్ 30న జరగనున్న దీపోత్సవ కార్యక్రమానికి ముందు అక్టోబర్ 29న డ్రోన్ షో రిహార్సల్ కూడా నిర్వహిస్తారు. రామ్ కి పైడీ వద్ద ఈ డ్రోన్ షో నిర్వహిస్తారు.

 ఈ కార్యక్రమంలో భాగంగా 15 ఆకృతులను ఆకాశంలో ప్రదర్శించాలని యోచిస్తున్నారు. ఈ పనులను పూర్తి చేయడానికి యానిమేషన్‌తో కూడిన డీటెయిల్డ్ స్టోరీబోర్డ్‌ను రూపొందిస్తారు, దీనిని ఉత్తరప్రదేశ్ పర్యాటక శాఖ ఆమోదిస్తుంది. ఆకాశంలో ఏర్పడే ఆకృతులకు మద్దతుగా కాన్సెప్ట్, స్క్రిప్ట్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, వాయిస్ ఓవర్, నేరేషన్, లేజర్ లైట్లు వంటి వివిధ ప్రక్రియలను పూర్తి చేస్తారు. ఈ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.

లైట్ అండ్ సౌండ్ షోతో పాటు బాణసంచా కూడా

అయోధ్యలోని రామ్ కి పైడీ వద్ద లేజర్ లైట్ అండ్ సౌండ్ షో ద్వారా శ్రీరాముని జీవిత చరిత్రకు సంబంధించిన ప్రేరణాత్మక సంఘటనలను ప్రదర్శిస్తారు. రామ్ కి పైడీ వద్ద ప్రతిరోజూ లేజర్, సౌండ్ షో నిర్వహిస్తారు... కానీ దీపోత్సవ కార్యక్రమ వేళ ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. డ్రోన్ షోతో పాటు సౌండ్, లేజర్ షో కూడా నిర్వహిస్తారు. దీనికి అందమైన ఆకృతులతో కూడిన గ్రీన్ బాణసంచా కూడా ఉంటుంది, ఇది అయోధ్యలోని ఆకాశవీధులను అందంగా మారుస్తుంది.

click me!