ప్రయాగరాజ్ లో 300 ఏళ్లనాటి అక్షయవట ... యోగి హయాాంలో ఈ వృక్షానికి మహర్దశ

By Arun Kumar PFirst Published Oct 18, 2024, 7:00 PM IST
Highlights

2025 మహాకుంభ్ కోసం యోగీ సర్కార్ ప్రయాగరాజ్‌లోని అక్షయవట అభివృద్ధి చేస్తుంది. రామాయణ, రఘువంశంలో వర్ణించిన ఈ పవిత్ర వృక్ష ప్రస్తావన వుంది. అసలు ఏమిటీ వృక్షం ప్రత్యేకత... 

ప్రయాగరాజ్ : వ చ్చే ఏడాది 2025 జనవరిలో జరగనున్న మహా కుంభమేళా కోసం ప్రయాగరాజ్‌లోని ఆద్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేస్తోంది యోగి సర్కార్. భక్తులకు కుంభనగరి గొప్పతనం, కొత్తదనాన్ని చూపించడానికి భారీ బడ్జెట్‌ను ప్రకటించింది. 

ప్రయాగరాజ్ లోని అక్షయవటకు గొప్ప పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. సంగమ స్నానం తర్వాత 300 ఏళ్ల నాటి ఈ వృక్షాన్ని దర్శించుకుంటేనే స్నానఫలం లభిస్తుందని నమ్మకం. అందుకే భక్తులు, సాధువులు సంగమ స్నానం తర్వాత ఈ అక్షయవటను దర్శించుకుంటారు. దీని తర్వాతే తమ కోరికలు నెరవేరుతాయని భావిస్తారు. ఇలా చారిత్రక ప్రముఖ్యత కలిగిన ఈ అక్షయవట పరిసరాల అభివృద్దికి యోగి సర్కార్ సిద్దమయ్యింది. 

Latest Videos

ఇప్పటికే యోగి ప్రభుత్వం ప్రతిష్టాత్మక అక్షయవట కారిడార్ సుందరీకరణ ప్రణాళికను సమీక్షించింది. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ఇటీవల పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మహాకుంభ్ సమయానికి ఈ సుందరీకరణ పనులు పూర్తయి ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. 

రామాయణం, రఘువంశం, హుయాన్‌త్సాంగ్ యాత్రా వివరణల్లో అక్షయవట ప్రస్తావన

శ్రీరాముడు వనవాసానికి వెళ్తున్నప్పుడు సంగమ నగరంలో భరద్వాజ ముని ఆశ్రమానికి చేరుకున్నప్పుడు, ముని ఆయనకు వటవృక్ష ప్రాముఖ్యతను వివరించారు. సీతమ్మ వటవృక్షాన్ని ఆశీర్వదించిందని నమ్మకం. ప్రళయ సమయంలో భూమి మునిగిపోయినప్పుడు ఒక వటవృక్షం మాత్రమే మిగిలింది, దానినే మనం అక్షయవట అని పిలుస్తాం. ఇలా  రామాయణంలో ఈ అక్షయవట ప్రస్తావన వుంది. 

మహాకవి కాళిదాసు రఘువంశం, చైనా యాత్రికుడు హుయాన్‌త్సాంగ్ యాత్రా వివరణల్లో కూడా అక్షయవట ప్రస్తావన ఉంది. అక్షయవట దర్శనం వల్ల అక్షయ పుణ్యం లభిస్తుందని చెబుతారు. భారతదేశంలో నాలుగు ప్రాచీన వటవృక్షాలు ఉన్నాయి. అక్షయవట- ప్రయాగరాజ్, గృధవట-సోరోన్ 'శూకరక్షేత్ర', సిద్ధవట- ఉజ్జయిని, వంశీవట- వృందావన్.

మొఘల్ కాలంలో నిషేధం

యమునా తీరంలో అక్బర్ కోటలో అక్షయవట ఉంది. మొఘల్ కాలంలో దీని దర్శనం నిషేధించబడింది. బ్రిటిష్ కాలంలో, స్వతంత్ర భారతదేశంలో కూడా కోట సైన్యం ఆధీనంలో ఉండటం వల్ల వృక్ష దర్శనం అరుదుగా ఉండేది.

2018లో యోగీ సర్కార్ అక్షయవట దర్శనం, పూజ కోసం సామాన్యులకు అవకాశం కల్పించారు.  పౌరాణిక ప్రాముఖ్యత కలిగిన తీర్థాల కోసం యోగీ సర్కార్ అనేక అభివృద్ధి ప్రాజెక్టులను మంజూరు చేసింది. ఇక్కడ కారిడార్ పనులు కూడా జరుగుతున్నాయి.

కొట్టినా, కాల్చినా తిరిగి పుట్టుకొచ్చే వటవృక్షం

అయోధ్య నుండి ప్రయాగరాజ్‌కు వచ్చిన ప్రముఖ సన్యాసి, శ్రీ రామ్ జానకి మహల్ అధిపతి స్వామి దిలీప్ దాస్ త్యాగి మాట్లాడుతూ... అక్షయవటను నాశనం చేయడానికి మొఘల్ కాలంలో అనేక ప్రయత్నాలు జరిగాయన్నారు. దాన్ని నరికి, చాలాసార్లు కాల్చారు, కానీ విఫలమయ్యారు. కొట్టినా, కాల్చినా కొన్ని నెలల తర్వాత అక్షయవట తిరిగి పుట్టుకొస్తుంది. యోగీ సర్కార్ చేపట్టిన అక్షయవట సుందరీకరణ, అభివృద్ధి పనులను ఆయన స్వాగతించారు. మహాకుంభ్‌లో సంగమ స్నానం తర్వాత దీన్ని దర్శించుకుంటే భక్తులకు పుణ్యం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. 

click me!