రైలు టిక్కెట్ బుక్ చేస్తున్నారా.. రూల్స్ మారాయి.. ఏంటో తెలుసా?

Published : Sep 15, 2025, 08:07 PM IST

IRCTC Reservation: అక్టోబర్ 1 నుంచి IRCTC ఆన్‌లైన్ రిజర్వేషన్‌లో కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఆధార్ వెరిఫికేషన్, ఏజెంట్ల బుకింగ్‌కు పరిమితులు వంటి రైల్వే కొత్త రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

PREV
15
అక్టోబర్ 1 నుంచి భారతీయ రైల్వేలో కొత్త రూల్స్

భారతీయ రైల్వే ఆన్‌లైన్ రిజర్వేషన్ విధానంలో కీలక మార్పులు చేస్తోంది. అక్టోబర్ 1, 2025 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ ప్రారంభమైన తర్వాత తొలి 15 నిమిషాలు ఆధార్ వెరిఫికేషన్ చేసిన యూజర్లకే టికెట్ బుకింగ్ అవకాశం ఉంటుంది. ఈ నిబంధన IRCTC వెబ్‌సైట్, మొబైల్ యాప్‌లపై అమలు అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

25
రైల్వే ఆన్‌లైన్ టిక్కెట్ రిజర్వేషన్ లో ఏజెంట్లకు పరిమితులు

కొత్త నిబంధనల ప్రకారం రైల్వే అధికృత ఏజెంట్లు రిజర్వేషన్ ప్రారంభమైన తర్వాత తొలి 10 నిమిషాల వరకు టికెట్లు బుక్ చేయలేరు. ఈ మార్పు ప్రయాణికులకు ప్రాధాన్యత కల్పించడానికి, అలాగే ఏజెంట్లు సాఫ్ట్‌వేర్ ద్వారా ముందుగానే సీట్లు బుక్ చేయడాన్ని అడ్డుకోవడానికి తీసుకున్న చర్యలుగా ఉన్నాయి. దీని కారణంగా ప్రయాణికులు నేరుగా బుక్ చేసుకోవడానికి సీట్లు అందుబాటలో ఉంటాయని ఇండియన్ రైల్వే తెలిపింది.

35
రైల్వే టికెట్ బుకింగ్ కొత్త సమయాలు

ప్రస్తుతం సాధారణ రిజర్వేషన్ ప్రతిరోజూ అర్థరాత్రి 12:20 గంటలకు ప్రారంభమై రాత్రి 11:45 వరకు కొనసాగుతుంది. ప్రయాణానికి 60 రోజుల ముందే బుకింగ్ విండో తెరుచుకుంటుంది. ఉదాహరణకు, ఒక ప్రయాణికుడు నవంబర్ 15న ప్రయాణం చేయాలనుకుంటే, సెప్టెంబర్ 16న రాత్రి 12:20కు బుకింగ్ చేసుకోవచ్చు. అప్పుడు 12:20 నుండి 12:35 వరకు ఆధార్ వెరిఫికేషన్ చేసిన అకౌంట్ ఉన్నవారే టికెట్ బుక్ చేయగలరు.

45
టిక్కెట్ బుకింగ్ లో ఇంతకుముందే రైల్వే పలు చర్యలు

జూలై 2025లో ఇండియన్ రైల్వే ఇప్పటికే తాత్కాలిక (Tatkal) ఆన్‌లైన్ బుకింగ్ కోసం ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి చేసింది. ఆధార్ లింక్ చేయని యూజర్లు తత్కల్ టికెట్లు బుక్ చేయలేరు. ఇప్పుడు అదే నిబంధన సాధారణ రిజర్వేషన్‌లోనూ మొదటి 15 నిమిషాలకు వర్తిస్తుంది.

55
రైల్వే మార్పులతో ప్రయాణికులకు కలిగే లాభాలు ఏంటి?

ప్రయాణికులు అక్టోబర్ 1కు ముందే తమ IRCTC అకౌంట్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోవాలి. ఈ మార్పుతో పారదర్శకత పెరగనుంది. సాధారణ ప్రయాణికులకు ప్రారంభ సమయంలో టికెట్ పొందే అవకాశాలు పెరుగుతాయి. రైల్వే శాఖ ఈ మార్పు ద్వారా మోసాలను అరికట్టడమే కాకుండా, నిజమైన ప్రయాణికులకు ప్రాధాన్యత కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మార్పులు అమలులోకి రాగానే, దేశవ్యాప్తంగా కోట్లాది రైలు ప్రయాణికులకు సురక్షితమైన, సమాన అవకాశాలు కలిగిన టిక్కెట్ రిజర్వేషన్ ప్రక్రియ అందుబాటులోకి రానుంది.

Read more Photos on
click me!

Recommended Stories