Interesting News:ఈ వార్తలు మీరు మిస్ అయ్యారేమో ఆసక్తిగా ఉంటాయి, ఓసారి చదివేయండి

Published : Sep 14, 2025, 07:00 AM IST

ప్రతివారం కొన్ని ఆసక్తికరమైన వార్తలు (News) వస్తూ ఉంటాయి. కానీ అనుకోకుండా అవి మన కంట పడకపోవచ్చు. అలా మీరు కూడా ఈ కింది కథనాలను చదవకపోతే ఇప్పుడు చదివేయండి. ఇవి ఆసక్తికరంగా ఉంటాయి. 

PREV
15
కెనడా వ్యక్తి వల్ల ఫుట్‌పాత్ క్లీన్

ఇప్పుడు సోషల్ మీడియా చాలా పవర్ ఫుల్‌గా పనిచేస్తోంది. ఏదైనా వీడియో వైరల్ అయితే చాలు దానికి తగ్గట్టు ప్రతిస్పందన కూడా కనిపిస్తోంది. తాజాగా కెనడాకు చెందిన ఒక వ్యక్తి బెంగళూరుకు వచ్చాడు. అక్కడ మెజిస్టిక్ బస్టాండ్ నుండి సమీపంలో ఉన్న స్టార్‌బక్స్ వరకు నడుచుకుంటూ వెళ్ళాడు. అలా వెళుతున్నప్పుడు ఒక వీడియోను తీసి పోస్ట్ చేశాడు. ఆ దారిలో ఓపెన్ గా ఉండిపోయిన డ్రెయిన్లు, ముళ్ళ తీగలు పేమెంట్, ఫుడ్డింగులు గురించి చెప్పాడు. ఇవన్నీ అక్కడ తిరిగేవారికి ఇబ్బందులు గురిచేస్తాయని ఆ వీడియోలో చెప్పాడు. వెంటనే బెంగళూరు అధికారులు ఆ రోడ్డును మొత్తం శుభ్రం చేసింది. అతని వీడియో వైరల్ అవ్వడంతో అది అధికారుల కంటపడింది. ఆ ప్రాంతమంతా ఇప్పుడు పరిశుభ్రంగా మారిపోయింది.

25
ముందు కొడుకుగా బాధ్యతలు పంచుకో

తండ్రీ కొడుకులు మధ్య జరుగుతున్న ఒక ఆస్తి యుద్ధంలో తెలంగాణ కోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది. పెద్దపల్లి జిల్లాకు చెందిన తండ్రి కొడుకుల మధ్య ఆస్తి తగాదా వచ్చింది. వారి భూమిని సింగరేణి కాలరీస్ స్వాధీనం చేసుకుని కోటి రూపాయలకు పైగా పరిహారం చెల్లించింది. అయితే ఆ డబ్బును తనకు ఇవ్వకుండా తన తండ్రి, చెల్లి, ఆ చెల్లెలి భర్త పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఒక కొడుకు కోర్టులో పిటిషన్ వేశాడు. దానిపై మాట్లాడుతూ న్యాయమూర్తులు ఒక కొడుకు తన తండ్రి పట్ల బాధ్యతగా ఉండాలని ముందు తన విధులను నిర్వర్తించాలని ఆ తర్వాతే ఆస్తుల కోసం అడగాలని అన్నారు. ఆ రిట్ పిటిషన్లో విచారణకు స్వీకరించడానికి ఎటువంటి కారణం లేదని కొట్టిపడేశారు. తండ్రికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఒక కొడుకు ప్రవర్తనను మేము అభినందించలేమని చెప్పారు.

35
నేపాల్ కొత్త ప్రధాని ప్రేమకథ మనదేశంలోనే

నేపాల్ తాత్కాలిక ప్రధానమంత్రిగా సుశీల కర్కి ప్రమాణ స్వీకారం చేశారు. నేపాల్ లో జరిగిన అల్లకల్లోలం మధ్య నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినా సుశీల ప్రధానమంత్రిగా మారారు. ఆమె వయసు 73 ఏళ్లు. అయితే ఆమె చదువు వారణాసిలో సాగింది. కాశీలో ఉన్న బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో పొలిటికల్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆమె ఈ యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడే దుర్గాప్రసాద్ సుభేది అనే వ్యక్తిని కలిసింది. ఆమెని అతడినే ప్రేమించి పెళ్లి చేసుకుంది. దుర్గాప్రసాద్ కూడా నేపాలి కాంగ్రెస్ నాయకుడు. ఆయన కూడా చదువు కోసం వారణాసికి వచ్చారు.

45
ఆ ప్రదేశాల్లో రీల్స్ ఫోటోలు తీయకండి

ఢిల్లీ వెళ్లినవారు అన్ని ప్రదేశాలతో పాటు సుప్రీంకోర్టును చూసేందుకు వెళుతూ ఉంటారు. అయితే సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంగణంలో ఫోటోలు తీసుకోవడం సోషల్ మీడియా రీల్స్ చేయడం వంటివి చేయకూడదు. ఎందుకంటే దీని హై సెక్యూరిటీ జోన్ గా ప్రకటించారు. కాబట్టి సుప్రీంకోర్టును దూరం నుంచి చూసి వచ్చేయండి. లోపలికి వెళ్లి అక్కడ ఫోటోలు దిగేందుకు ప్రయత్నిస్తే అటు నుంచి అటే కోర్టులోకి వెళ్లి జరిమానాను ఎదుర్కోవాల్సి వస్తుంది.

55
నిర్దోషిగా విడుదలై 9 కోట్లు అడుగుతున్నాడు

జూలై 11, 2006న ముంబైలో జరిగిన ఏడు రైలు పేలుళ్ల గురించి ఎవరు మర్చిపోలేరు. ఎందుకంటే ఆ ఘటనలో 180 మందికి పైగా మరణించారు. అప్పటినుంచి అబ్దుల్ వాహిద్ షేక్ అనే వ్యక్తి విచారణలో ఎదుర్కొంటున్నాడు. తాజాగా ఆయన నిర్దోషిగా బయటకు వచ్చాడు. అప్పటి నుంచి తనకు ఇన్నాళ్లు మానసికంగా హింసించినందుకు కస్ట్టోడియల్ టార్చర్ కు 9 కోట్ల పరిహారాన్ని కోరుతూ కోర్టులో పిటిషన్ వేశాడు. కేసులో అబ్దుల్‌ని మాత్రమే కాదు మిగిలిన నిందితులందరినీ ఈ ఏడాది జూలైలోనే బాంబే హైకోర్టు నిర్దోషులుగా విడుదల చేసింది. ఆ తర్వాత అబ్దుల్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు వెళ్ళాడు. తన పునరావాసానికి మద్దతు ఇవ్వాలని కోరాడు. జైలు శిక్ష వల్ల కెరీర్, విద్య, వ్యక్తిగత జీవితం అంతా పోయిందని కాబట్టి తనకు తొమ్మిది కోట్ల రూపాయలు పరిహారంగా ఇవ్వాలని ఆయన కోరుతున్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories