షాకింగ్.. సీబీఐ కస్టడీనుండి వందకేజీల బంగారం మాయం.. !..

First Published Dec 12, 2020, 10:10 AM IST

తమిళనాడులో సిబిఐ కస్టడీలో103 కేజీల బంగార అదృశ్యమయింది.  సిబిఐ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్న ఈ ఘటన మీద హైకోర్టు పోలీసు దర్యాప్తుకు ఆదేశించింది. అయితే స్థానిక పోలీసుల దర్యాప్తుతో సీబిఐ ప్రతిష్ట దెబ్బతింటుందని, సిబి-సిఐడిని దర్యాప్తుకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ మీద మాట్లాడుతూ కోర్టు ‘ఇది సిబిఐకి అగ్ని పరీక్షలాంటిదని తెలిపింది. వారు సీతలా పవిత్రంగా ఉంటే ఈ కేసునుండి బయటపడొచ్చు. లేకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సిందే’ అని చెప్పుకొచ్చింది. 

తమిళనాడులో సిబిఐ కస్టడీలో103 కేజీల బంగార అదృశ్యమయింది. సిబిఐ ప్రతిష్టను దిగజార్చేలా ఉన్న ఈ ఘటన మీద హైకోర్టు పోలీసు దర్యాప్తుకు ఆదేశించింది. అయితే స్థానిక పోలీసుల దర్యాప్తుతో సీబిఐ ప్రతిష్ట దెబ్బతింటుందని, సిబి-సిఐడిని దర్యాప్తుకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ మీద మాట్లాడుతూ కోర్టు ‘ఇది సిబిఐకి అగ్ని పరీక్షలాంటిదని తెలిపింది. వారు సీతలా పవిత్రంగా ఉంటే ఈ కేసునుండి బయటపడొచ్చు. లేకపోతే పరిణామాలు ఎదుర్కోవాల్సిందే’ అని చెప్పుకొచ్చింది.
undefined
సిబిఐ స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాష్ట్ర పోలీసులకు బదులుగా సిబిఐ లేదా నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చేత దర్యాప్తు చేయించాలని కోరినప్పుడు, న్యాయమూర్తి పి ఎన్ ప్రకాష్ మాట్లాడుతూ, “కోర్టు ఈ అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోదు, చట్టం ఇలాంటి అనుమానాలకు తావివ్వదు. పోలీసులందర్నీ నమ్మాల్సిందే. సిబిఐకి ప్రత్యేకంగా కొమ్ములున్నాయని, స్థానిక పోలీసులకు సమర్థత లేదని చెప్పడం సరికాదు’ అన్నారు.
undefined
చెన్నైలోని మినరల్స్ అండ్ మెటల్స్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎమ్‌ఎమ్‌టిసి) అధికారులు.. బంగారం, వెండి దిగుమతుల కంపెనీ అయిన సురానా కార్పొరేషన్ లిమిటెడ్ కు సాయం చేశారనే ఆరోపణలపై 2012 లో నమోదైన కేసుకు సంబంధించి సిబిఐ ఈ బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ సమయంలో బంగారు కడ్డీలు, ఆభరణాల రూపంలో ఉన్న 400.47 కిలోల బంగారాన్ని చెన్నైలోని సురానా ఆఫీస్ నుండి సిబిఐ స్వాధీనం చేసుకుంది. ఈ బంగారాన్ని సంస్థ లాకర్లలో పెట్టి సీజ్ చేశారు. ఈ ఖజానాకు సంబంధించిన తాళాన్ని చెన్నైలోని ప్రత్యేక సిబిఐ కోర్టుకు సమర్పించినట్లు సిబిఐ పేర్కొంది. అయితే దీనికి సంబంధించిన వివరాలు, తేదీ డాక్యుమెంట్స్ లో పేర్కోలేదు.
undefined
అయితే ఇదే సిబిఐ 2013సెప్టెంబర్ లో మరో కేసు సురానా కంపెనీ మీద మరో కేసు నమోదు చేసింది. 2012లో సీజ్ చేసిన బంగారాన్ని ఆ కేసు నుండి సురానా కంపెనీ ఫారిన్ ట్రేడ్ ఫాలసీని ఉల్లంఘించిన కేసుకు బదిలీ చేయాలని ఇందులో కోరింది. స్వాధీనం చేసుకున్న బంగారాన్ని మొదటి కేసు నుండి తాజా కేసుకు బదిలీ చేయాలని సిబిఐ అభ్యర్థించింది - దీని తరువాత రికార్డు స్థాయిలో 400 కిలోల బదిలీకి కోర్టు అనుమతించింది. బంగారం అప్పటికే వాలెట్ లో ఉన్నందున "కోర్టులో భౌతికంగా చూపించలేదు".
undefined
ఆ తరువాత 2015లో ఈ రెండో కేసును ఇక ‘లభించే ఆధారాలేమీ లేవు’ అనే కారణంతో కేసును మూసేయాలని కోర్టుకు నివేదిక సమర్పించింది. దీనికి సిబిఐ స్పెషల్ కోర్టు అంగీకరించింది, కాని స్వాధీనం చేసుకున్న బంగారాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డిజిఎఫ్టి) కు అప్పగించాలని ఆదేశించింది. ఈ ఉత్తర్వును తరువాత మద్రాస్ హైకోర్టు సురానా పిటిషన్పై పక్కన పెట్టింది.
undefined
ఈలోగా, రూ. 1,160 కోట్ల రుణ బకాయిల కోసం ఎస్ బిఐ సురానాపై చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే సురానా కంపెనీ నుండి సిబిఐ స్వాధీనం చేసుకున్న బంగారాన్ని కోరుతూ ప్రత్యేక సిబిఐ కోర్టును బ్యాంకు ఆశ్రయించింది.
undefined
సిబిఐకి వ్యతిరేకంగా దర్యాప్తుకు ఆదేశిస్తూ శుక్రవారం నాడు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులో ఇలా అంది.. ఇది హాలీవుడ్ బ్లాక్ బస్టర్ సినిమా మకన్నాస్ గోల్డ్ లో దివంగత ఒమర్ షరీఫ్ పోషించిన ప్రసిద్ధ పాత్ర కొలరాడో లాగా, వీరంతా ప్రత్యేక కోర్టులో బంగారు వేటకు వెళ్లారు. కొలరాడో బంగారు నిధులను పంచుకోవడానికి మంకీ, అపాచీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లుగా, ఎస్బిఐ మరియు సురానా ఒక ఒప్పందం కుదుర్చుకొని ప్రత్యేక కోర్టు ముందు రాజీ మెమో దాఖలు చేశాయి. 400.47 కిలోల బరువున్న బంగారాన్ని బకాయిల పరిష్కారం కోసం అప్పగించాలని’ కోరాయంటూ చెప్పుకొచ్చింది. .
undefined
సురానా పిటిషన్‌ను సిబిఐ వ్యతిరేకించింది, దీనికి వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ మద్దతు ఉంది. చివరగా, 2019 డిసెంబర్‌లో, ఎస్‌బిఐని సంప్రదించిన నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్, సురానా చెల్లించాల్సిన ఆరు బ్యాంకులకు పంపిణీ కోసం బంగారాన్ని అప్పగించాలని ఆదేశించింది.
undefined
ఇదిలా ఉంటే, ఈ ఏడాది ఫిబ్రవరిలో సిబిఐ, బ్యాంకు ప్రతినిధుల సమక్షంలో లాకర్లు తెరిచినప్పుడు, బంగారంలో 103.864 కిలోల తరుగు గుర్తించబడింది. ఇది అందర్నీ షాక్ కు గురిచేసింది.. అని హైకోర్టు పేర్కొంది.
undefined
అయితే దీనిమీద సిబిఐ వివరణ ఇస్తూ బంగారాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత సురానా కంపెనీలో ఉన్న యంత్రాల తోనే బరువు తూచామని, అప్పుడు దాని బరువు 400.47 కిలోలు వచ్చిందని అదే విషయం లాకర్ల మీదున్న స్టిక్కర్లమీద ఉందని హైకోర్టుకు తెలిపింది. కాబట్టి తగ్గిన బంగారానికి సిబిఐకి ఎలాంటి బాధ్యత లేదని పేర్కొంది. స్వాధీనం చేసుకున్న సమయంలో బంగారం, ఆభరణాలు అన్నీ కలిసి తూకం వేశారని, ఆ తరువాత ఫిబ్రవరిలో, అధునాతన మెషీన్లతో ఒక్కొక్క వస్తువు బరువునూ తూచారని దీనివల్ల బరువులో వ్యతాసం వచ్చి ఉండొచ్చని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్పుకొచ్చారు.
undefined
ఈ వాదనలను కోర్టు తిరస్కరించంది. ఎంతైనా వందకిలోల తేడా ఎలా వస్తుందో కోర్టు అర్థం చేసుకోలేకపోతోందని చెప్పుకొచ్చింది. అంతేకాదు బంగారం.. గంజాయి లాగా రోజులు గడిచిన కొద్ది తరుగులో తేడా రాదంటూ చురక అంటించింది.
undefined
సిబిఐ స్పెషల్ కోర్టుకు సిబిఐ బంగారాన్ని భౌతికంగా అప్పగించి అక్కడినుండి తప్పుకుందని, తమ తప్పు లేదని అరిచి గీ పెట్టినంత మాత్రాన ప్రయోజనం లేదు. ఇది ఇప్పుడు సిబిఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి, ప్రాపర్టీ క్లర్క్ మెడకు చుట్టుకుంది. వారిని అనుమానించి అరెస్ట్ చేయాల్సి వస్తుందని తెలిపింది.
undefined
‘అనుమానితుల్లో సీజర్ భార్య ఉండడం’లో తప్పు లేదు.. అంటూ చెన్నైలోని సిబి సిఐడి మెట్రో వింగ్ కు దొంగతనం కింద సాధారణ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, దర్యాప్తును ఎస్పీ ర్యాంక్ అధికారికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఆరు నెలల్లో దర్యాప్తు పూర్తి చేయాలని తెలిపింది.
undefined
click me!