ప్రతి సంవత్సరం చివర్లో గూగుల్.. ఇండియన్స్ ఎక్కువగా సెర్చ్ చేసిన వార్తలు, వ్యక్తులు, ఫుడ్స్, ఫోటోస్ జాబితాను విడుదల చేస్తుంటుంది. అయితే ఈ ఏడాదిలో అంటే 2023 లో భారత్ లో అత్యధికంగా సెర్చ్ చేసిన పర్యాటక ప్రాంతాల జాబితాను విడుదల చేసింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
వియత్నాం
సుసంపన్నమైన చరిత్ర, గొప్ప సంస్కృతి, అందమైన ప్రకృతి దృశ్యాలుండే వియత్నాం ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది. ఇక్కడి వంటకాలు, ఫుడ్స్ పర్యాటకులను బలే ఆకర్షిస్తాయి. ఇతర ఖండాలతో పోలిస్తే ఇది చాలా సురక్షితమైన ప్రదేశం. ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతేకాదు చాలా సౌకర్యవంతంగానూ ఉంటుంది. వియత్నాం హనోయ్ సందడిగా ఉండే వీధులు మిమ్మల్ని తెగ ఆకట్టుకుంటాయి. ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు పర్యాటకులు పెద్ద సంఖ్యలో ఈ ప్రదేశాన్ని సందర్శిస్తారు.
గోవా
ఈ జాబితాలో గోవా రెండో స్థానంలో ఉంది. గోవా బీచ్ లకు ఎంతో ప్రసిద్ది చెందింది. అందుకే ఇక్కడికి సెలబ్రిటీల నుంచి ప్రపంచం నలుమూలల నుంచి వచ్చి చూసిపోతుంటారు. సంవత్సరం పొడవునా మంచి హాలిడే డెస్టినేషన్ ఇది. ఇక్కడి ప్రశాంతమైన వాతావరణానికి మిమ్మల్ని అక్కడి నుంచి కదలనీయదు. అందుకే ప్రసిద్ధి చెందిన గోవా ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇక్కడ బోమ్ జీసస్ బసిలికా, ఫోర్ట్ అగువాడా, మైనపు మ్యూజియం, హెరిటేజ్ మ్యూజియాలు మిమ్మల్ని చూపు తిప్పుకోనీయవు.
srilanka
శ్రీలంక
2023 లో గూగుల్లో బాగా వెతికిన జాబితాలో శ్రీలంక నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ పురాతన భవన శిథిలాలు, పవిత్ర దేవాలయాల నుంచి అందమైన బీచ్ లు, పచ్చని తేయాకు తోటలు మన మనస్సును కట్టిపడేస్తాయి. శ్రీలంక జర్నీ మనకు ఎన్నో మెమోరీస్ ను అందిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం శ్రీలంకకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు.
Sri lanka
శ్రీలంక
2023 లో గూగుల్లో బాగా వెతికిన జాబితాలో శ్రీలంక నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ పురాతన భవన శిథిలాలు, పవిత్ర దేవాలయాల నుంచి అందమైన బీచ్ లు, పచ్చని తేయాకు తోటలు మన మనస్సును కట్టిపడేస్తాయి. శ్రీలంక జర్నీ మనకు ఎన్నో మెమోరీస్ ను అందిస్తుంది. ఇది ప్రతి సంవత్సరం శ్రీలంకకు ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు.
థాయిలాండ్
ఈ జాబితాలో థాయ్ లాండ్ 5వ స్థానంలో ఉంది. బ్యాంకాక్ లో సందడిగా ఉండే మార్కెట్లు, దేవాలయాల నుంచి ఫుకెట్, కో ఫై ఫై వంటి ఉష్ణమండల ద్వీపాల అందం మనల్ని అక్కడి నుంచి కదలనీయవు. థాయ్ లాండ్ సాంస్కృతిక నేపథ్యం, సహజ అద్భుతాల కలయికను మనం ఇక్కడ ఆస్వాదించొచ్చు.
కాశ్మీర్
భారతదేశం ఉత్తర భాగంలో ఉన్న కాశ్మీర్ 6 వ స్థానంలో ఉంది. మైమరిపించే పర్వతాలు, చారిత్రక ఉద్యానవనాలు, గడ్డకట్టిన సరస్సులు, పవిత్ర ప్రదేశాలు, అందమైన హౌస్ బోట్లు, కురిసే మంచు, ఆతిథ్య స్థానికులతో కాశ్మీర్ ప్రతి యాత్రికుడిని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఇక్కడున్న ప్రకృతి అద్భుతాలు, సాంస్కృతిక సంపద మనల్ని కట్టిపడేస్తాయి. కాశ్మీర్ పర్యాటకులకు ఫేవరెట్ డెస్టినేషన్. దీన్ని భూలోక స్వర్గం అని కూడా అంటారు.
Ladakh to Coorg
కూర్గ్
కర్ణాటకలోని మంచుతో కప్పబడిన హిల్ స్టేషన్ కూర్గ్ ఈ జాబితాలో 7వ స్థానంలో ఉంది. 'స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా'గా పిలువబడే కూర్గ్.. కాఫీ తోటలు, జలపాతాలు, పచ్చని ప్రకృతి దృశ్యాలకు నిలయం. అందుకే ఇది పర్యాటకులను ఎక్కువగా ఆకర్షిస్తుంది.
అండమాన్ నికోబార్ దీవులు
బంగాళాఖాతంలో ఉన్న అండమాన్ నికోబార్ దీవులు ఈ జాబితాలో 8వ స్థానంలో ఉన్నాయి. అందమైన స్వర్గంగా పరిగణించబడే ఈ ద్వీపాలు దాని సహజ సౌందర్యం, వైవిధ్యమైన సముద్ర జీవులకు ప్రసిద్ది చెందాయి.
Italy
ఇటలీ
ఈ జాబితాలో ఇటలీ 9వ స్థానంలో ఉంది. ఐరోపా నడిబొడ్డున ఉన్న ఇటలీని చూడాలన్నది ప్రతి ప్రయాణికుడి కల. అలాగే దీనికున్న గొప్ప పురాతన చరిత్ర నుంచి రుచికరమైన వంటకాల వరకు ఇక్కడున్న ప్రతీదీ పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటుంది.
Switzerland
స్విట్జర్లాండ్
స్విట్జర్లాండ్ ఈ జాబితాలో 10వ స్థానంలో ఉంది. ఆల్పైన్ అందాలు, అందమైన సరస్సులు, మనోహరమైన పల్లెలు కలిగిన ఈ దేశం సంప్రదాయాన్ని, ఆధునికతను సులభంగా మిళితం చేస్తుంది. అందుకే ఇక్కడకు కూడా ప్రతి ఏటా ఎంతో మంది పర్యాటకులు వెలుతుంటారు.