నిజానికి బిగ్ బాస్ అనే వ్యక్తి ఎవరూ లేరు. అది ఒక ఫిక్షనల్ క్యారెక్టర్ మాత్రమే. ఇక ఆ బిగ్ బాస్ వాయిస్ రేణుకుంట్ల శంకర్ అనే డబ్బింగ్ ఆర్టిస్ట్ ది. ఆయన చాలా కాలంగా సినిమాలు, సీరియల్స్ కి డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నారు. శంకర్ వాయిస్ బిగ్ బాస్ క్యారెక్టర్ కి చక్కగా సెట్ అయ్యింది. దీంతో అన్ని సీజన్స్ కి ఆయనే బిగ్ బాస్ వాయిస్ అందిస్తున్నారు.
కాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాల్లో షో ముగియనుంది. హౌస్లో తొమ్మిది మంది ఉన్నారు. విన్నర్ ఎవరనే ఉత్కంఠ నెలకొంది.