ఈ మూడు రోజులుగా బిగ్ బాస్ హౌస్ లో టికెట్ టు ఫినాలే రేస్ జరుగుతుంది. బిగ్ బాస్ పాత కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి తీసుకువచ్చి.. రోజుకో కంటెండర్ ను సెలక్ట్ చేయిస్తున్నాడు బిగ్ బాస్. మొదటి రోజు నిఖిల్, హరికా వచ్చారు. రెండో రోజు మానస్, ప్రియాంక జైన్ వచ్చారు.
ఇక ఈరోజు పునర్నవి, వితికా షేరు హౌస్ లోకి వచ్చారు మొదటి కంటెండర్ గా రోహిణి, రెండో కంటెండర్ గా అవినాశ్ విజయం సాధించగా.. తాజా ఎపిసోడ్ లో ఫైనల్ కంటెస్టెంట్ గా నిఖిల్ ఎన్నిక అయ్యారు. ఈరేసు చాలా టఫ్ కాంపిటేషన్ మద్య జరిగింది. ముందుగా పునర్నవి, వితికా షేరు హౌస్ లోకి వచ్చీ రావడంతో కాస్త ఎంటర్టైన్ చేశారు అవినాశ్, రోహిణి. వారి కామెడీ స్కిట్ తో అలరించారు. హౌస్ లో ఉన్నవారిని కూడా కడుపుబ్బా నవ్వించారు.