BSNL: రూ.91కే 60 రోజుల వ్యాలిడిటీ.. బీఎస్ఎన్ఎల్ మ‌రో సూపర్ రీఛార్జ్ ప్లాన్

First Published | Nov 28, 2024, 9:59 PM IST

BSNL 91 Rupees Plan Offers 60 Days Validity : తక్కువ ధరకే ఎక్కువ రోజుల వ్యాలిడిటీ కావాలనుకునే వారి కోసం ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్  (BSNL) కొత్త రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఆ వివరాలు మీకోసం..

BSNL రీఛార్జ్ ప్లాన్

ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ - బీఎస్ఎన్ఎల్ (BSNL) ప్రయివేటు సంస్థలతో పోటీ పడుతూ తన వినియోగదారులకు రోజువారీ తక్కువ ధర రీఛార్జ్ ప్లాన్‌లను అందిస్తోంది. BSNL ప్లాన్‌లు అత్యాధునికమైనవి. ప్రతి బడ్జెట్‌కు తగ్గ రీఛార్జ్ ప్లాన్‌లు BSNLలో ఉన్నాయి. ఈ సంస్థ రీఛార్జ్ ప్లాన్‌లు చాలా చవకైనవిగా కూడా ున్నాయి. జియో, ఎయిర్ టెల్, వోడాఫోన్ ఐడీయాలతో (Jio, Airtel, VI) పోలిస్తే ఎక్కువ ప్రయోజనాలను అందించేవిగా ఉన్నాయి.

BSNL రీఛార్జ్ ప్లాన్

ప్రైవేట్ కంపెనీలతో పోలిస్తే BSNL ప్లాన్‌లు చాలా చవకైనవి. BSNL పోర్ట్‌ఫోలియోలో అద్భుతమైన ప్రయోజనాలతో అనేక రీఛార్జ్ ప్లాన్‌లు ఉన్నాయి. మీరు BSNL కస్టమర్ అయితే మీకోసం BSNL మరో అద్భుతమైన, చాలా చవకైన రీఛార్జ్ ప్లాన్ ను తీసుకువచ్చింది. అదే 91 రూపాయలతో 60 రోజుల పాటు వ్యాలిడిటీ సర్వీసుతో ఉన్న సూపర్ రీఛార్జ్ ప్లాన్. 


BSNL రీఛార్జ్ ప్లాన్

BSNL ₹91 ప్లాన్

ఈ చవకైన BSNL ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ ప్లాన్ ధర 91 రూపాయలు. దీనిలో యూజర్లు 60 రోజుల వ్యాలిడిటీ పొందుతారు. ఇతర టెలికాం కంపెనీలు Reliance Jio, Airtel, VI ఈ ధరలో ఇలాంటి ఆఫర్ ను అస్సలు ఇవ్వడం లేదు. 

BSNL రీఛార్జ్ ప్లాన్

BSNL ₹91 రీఛార్జ్ ప్లాన్‌లో యూజర్లు నిమిషానికి @15pకి వాయిస్ కాల్స్ పొందుతారు. ఇంకా హోమ్ LSA, నేషనల్ రోమింగ్‌లో డేటా @1p/MB + SMS @25p/sms ఉంటుంది. ముంబై, ఢిల్లీలలో MTNL నెట్‌వర్క్‌తో కూడా పనిచేస్తుంది.

BSNL రీఛార్జ్ ప్లాన్

తక్కువ ఖర్చుతో మీ సిమ్ ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉండాలంటే ఈ BSNL ప్లాన్ మీకు బాగా సరిపోతుంది. ఈ ప్లాన్‌లో టాక్‌టైమ్ వోచర్ తీసుకుని కాల్ సౌకర్యాన్ని పొందాలనుకుంటే సెకనుకు 1.5 పైసా ఖర్చు అవుతుంది. ఇది వ్యాలిడిటీ ప్లాన్, కాబట్టి యూజర్లు కాల్స్, SMSలు అందుకోవచ్చు, కానీ కాల్స్ చేయలేరు, మెసేజ్‌లు పంపలేరు. ఈ సేవలను ఉపయోగించుకోవడానికి వారు ప్రత్యేకంగా టాప్ అప్ వోచర్ ను రీఛార్జ్ చేసుకోవాలి.

Latest Videos

click me!