ఆడవాళ్లకు ఈ క్యాన్సర్లే ఎక్కువగా వస్తాయి.. జర పైలం

First Published Feb 4, 2023, 3:42 PM IST

ప్రతి ఏడాది ఫిబ్రవరి 4 న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని జరుపుకుంటాం.. ఈ ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న వారికి మద్దతునిస్తూ క్యాన్సర్ వ్యాప్తి గురించి, దాని నివారణా గురించి అవగాహన పెంచడానికి దీన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు.

cancer

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2023: ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఈ ప్రాణాంతక రోగంతో అర్థాంతరంగా చనిపోతున్నారు. చిన్నపిల్లలు, పెద్దలు అంటూ ఎంతో మంది దీనికి బలైపోతున్నారు. కానీ వ్యాధి సంకేతాలు, లక్షణాలు అంత తొందరగా బయటపడవు. చాలా రకాల క్యాన్సర్లు వ్యాధి ముదిరినంకనే లక్షణాలను చూపెడుతాయి. అయితే చాలాసార్లు క్యాన్సర్ ను పరీక్ష లేదా ఎక్స్రే ద్వారా గుర్తించవచ్చు. క్యాన్సర్ ను ముందుగానే గుర్తించడానికి ప్రతి ఒక్కరూ క్యాన్సర్ ప్రారంభ సంకేతాలను తెలుసుకోవాలి. వీటిని గుర్తిస్తే మీరు క్యాన్సర్ నుంచి బయటపడొచ్చు. ఇకపోతే ఆడవారికి అత్యంత సాధారణంగా వచ్చే క్యాన్లర్లు, వాటి లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

cancer

మహిళల్లో సర్వసాధారణమైన క్యాన్సర్లు ఏమిటి?

మహిళల్లో అత్యంత సాధారణ క్యాన్సర్ రకాలు చర్మం, రొమ్ము, ఊపిరితిత్తులు, కొలొరెక్టల్, గర్భాశయం. గర్భాశయ, అండాశయ క్యాన్సర్ మహిళలను మాత్రమే ప్రభావితం చేస్తుంది. ఏ రకమైన క్యాన్సర్ అయినా సరే దీన్ని ప్రారంభదశలో గుర్తిస్తే క్యాన్సర్ నుంచి ప్రాణాలతో బయటపడొచ్చు. 
 

breast cancer

రొమ్ము క్యాన్సర్

రొమ్ము క్యాన్సర్ కేసులలో 30 శాతం మంది చనిపోతున్నారని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా 2017 లో అంచనా వేయబడిన సర్వే ప్రకారం.. 2,82,500 మహిళా క్యాన్సర్ మరణాలలో 14 శాతం మంది రొమ్ముక్యాన్సర్ తో చనిపోయారని అంచనా వేయబడింది. 8 మంది ఆడవారిలో ఒకరు రొమ్ము క్యాన్యర్ బారిన పడుతున్నారట.  రొమ్ములో వాపు లేదా గడ్డలు లేదా చంకలో వాపు ఉంటే మీకు రొమ్ము క్యాన్సర్ ఉందని అర్థం చేసుకోవాలి. అంతేకాదు చనుమొన ఆకృతి మారడం లేదా చనుమొన నుంచి రక్తస్రావం లేదా ఉత్సర్గ ఉన్నా రొమ్ము క్యాన్సర్ గానే భావించాలి. 
 


ఊపిరితిత్తుల క్యాన్సర్

ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత ప్రాణాంతకమైన క్యాన్సర్ గా పరిగణించబడుతుంది. ప్రపంచ వ్యాప్తంగా దీని బారిన పడి దాదాపుగా 21 శాతం చనిపోతున్నారని వరల్డ్ క్యాన్సర్ రీసెర్చ్ ఫండ్ ఇంటర్నేషనల్ తెలిపింది. 15 శాతం మరణాలకు రొమ్ము క్యాన్సర్ ప్రధాన కారణం కాగా, పెద్దప్రేగు క్యాన్సర్ కారణంగా 8 శాతం మరణాలు సంభవిస్తున్నాయి. మూడు వారాలకు పైగా నిరంతర దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎన్నటికీ తగ్గని జ్వరం, కఫంలో రక్తం, తలనొప్పి లేదా ఒళ్లు నొప్పులు, బరువు తగ్గడం వంటివి ఊపిరితిత్తుల క్యాన్సర్ కు సంకేతాలు. 
 

ovarian cancer!

అండాశయ క్యాన్సర్

మహిళలకు వచ్చే మరొక సాధారణ క్యాన్సర్ అండాశయ క్యాన్సర్. ఇది అండాశయాలు, ఫెలోపియన్ గొట్టాలలో కణాల అసాధారణ పెరుగుదల. కణాలు నియంత్రణ లేకుండా పెరిగి అండాశయాలు, ఫెలోపియన్ గొట్టాలపై కణితులు ఏర్పడినప్పుడు అండాశయ క్యాన్సర్ వస్తుంది. అండాశయ క్యాన్సర్ ను ముందుగా గుర్తించడం అంత సులువుగా గుర్తించలేం. ఎందుకంటే ఈ క్యాన్సర్ లక్షణాలు అస్పష్టంగా ఉంటాయి. అందుకే మీ శరీరంలో జరిగే మార్పులను గమనించడం చాలా ముఖ్యం. అవసరమైతే డాక్టర్ ను సంప్రదించండి.
 

cervical cancer

 గర్భాశయ క్యాన్సర్

ఇది గర్భాశయం ముఖద్వారాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక్కడే కణాలు అసాధారణంగా పెరుగుతాయి. ఇది క్యాన్సర్ కు దారితీస్తుంది. అయితే ఇది యోని లేదా మూత్రాశయం లేదా పురీషనాళానికి వ్యాపించొచ్చు. దీనిలో గర్భాశయం లేదా ఉదరం సమీపంలోని శోషరస గ్రంథులను కలిగి ఉండొచ్చు. గర్భాశయ క్యాన్సర్ ప్రారంభంలో ఎలాంటి సంకేతాలను లేదా లక్షణాలను చూపించదు. అయినప్పటికీ వ్యాధి అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇది అసాధారణ యోని రక్తస్రావం లేదా ఉత్సర్గకు కారణమవుతుంది. అంటే సెక్స్ తర్వాత.

click me!