టాయ్ లెట్ కి ఫోన్ తీసుకువెళ్తున్నారా..?

First Published Sep 16, 2021, 2:06 PM IST

 అలా టాయ్ లెట్ కి ఫోన్ తీసుకొని వెళ్లడం వల్ల అనేక సమస్యలు  ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాని వల్ల కలిగే  అనర్థాలేంటో చూస్తే.. ఇంకోసారి టాయ్ లెట్ కి ఫోన్ తీసుకువెళ్లరట.

ఈ రోజుల్లో తిండి లేకపోయినా బతికే వారు ఉన్నారేమో కానీ.. చేతిలో సెల్ ఫోన్ లేకుండా.. దానితో సమయం గడపకుండా లేనివారు ఎవరూ లేరనే చెప్పాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు స్మార్ట్ ఫోన్ లోనే కాలం గడిపేస్తున్నారు ఈ కాలం యువత. అయితే.. ఈ మధ్య ఓ సంస్థ చేసిన సర్వేలో..  చాలా మంది బాత్రూమ్ కి కూడా ఫోన్ తీసుకొని వెళ్తున్నారట.

టాయ్ లెట్ కి ఫోన్ ఎందుకు అంటే.. ఆ సమయంలో న్యూస్ చూస్తుంటామని కొందరు.. పాటలు వింటూ ఉంటాం అని మరి కొందరు చెబుతున్నారు.  కారణం ఏదైనా  అసలు టాయ్ లెట్ కి ఫోన్ తీసుకొని వెళ్లొచ్చా..? దీనిపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం..
 

తాజా సర్వేలో తేలిన విషయం ఏమిటంటే.. 90శాతం మంది టాయ్ లెట్ కి స్మార్ట్ ఫోన్ తీసుకొని వెళ్తున్నారని తేలడం గమనార్హం.
 

అయితే.. అలా టాయ్ లెట్ కి ఫోన్ తీసుకొని వెళ్లడం వల్ల అనేక సమస్యలు  ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాని వల్ల కలిగే  అనర్థాలేంటో చూస్తే.. ఇంకోసారి టాయ్ లెట్ కి ఫోన్ తీసుకువెళ్లరట.

టాయ్ లెట్ కి ఫోన్ తీసుకొని వెళ్లడంలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉందట. బాత్రూమ్ లోని క్రిములన్నీ.. ఫోన్ పైనే చేరతాయట. అంతేకాదు.. ఫోన్ స్క్రీన్ పై ఎక్కువ సేపు ఉంటాయట. ఫోన్ మీద వాటి జీవితకాలం కూడా ఎక్కువగా ఉంటుందట. అలానే ఫోన్ వాడటం వల్ల ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది.

ఫోన్లు ఈజీగా బ్యాక్టీరియా, వైరస్ ను అట్రాక్ట్ చేస్తాయి. టాయిలెట్ లోకి ఫోన్ తీసుకెళ్లినప్పుడు మీరు దాన్ని జాగ్రత్తగానే పెట్టచ్చు. బేసిన్ మీదో, టాయిలెట్ పేపర్ మీదో పెట్టచ్చు. కానీ ఫోన్ ముట్టిన చేతులతో మీరు ఎక్కడెక్కడ టచ్ చేస్తారో దానివల్ల బ్యాక్టీరియా, వైరస్ ఎక్కడినుండి ఎక్కడికి ప్రయాణం అవుతుందో ఎలా చెప్పగలం.

ఇక.. ఫోన్ చేస్తూ కూర్చుంటే మామూలుగానే మనకు సమయం తెలీదు. బాత్రూమ్ కి కూడా ఫోన్ తీసుకొని వెళ్లడం వల్ల.. టాయ్ లెట్ సీటు పై  ఎక్కువ సేపు కూర్చుంటారట. దానివల్ల కూడా కొత్త సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

అంతేకాదు.. ఫోన్ చూస్తూ.. పొట్టపై ఒత్తిడి పెట్టడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

టాయిలెట్ సీటుపై ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఇది జరుగుతుంది. దీనివల్ల రెక్టమ్ మీద ఒత్తిడి పెరిగి నొప్పి, వాపు, రక్తస్రావం మొదలవుతుంది. ఇది బ్యాక్టీరియా సోకే ప్రమాదాన్ని పెంచుతుంది.

చాలా మంది తమకు వర్క్ ఎక్కువగా ఉందని.. ఆ టాయ్ లెట్ కి వెళ్లే సమయంలో కూడా వృద్ధా చేయకూడదని తీసుకువెళ్తున్నామని చెబుతుంటారట. అయితే.. ఆ కొద్ది ఫ్రీ టైం కూడా తీసుకోకుంటే మొదడుకి ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది.

అంతేకాదు.. కొద్దిసేపు కూడా గ్యాప్ ఇవ్వకుండా ఫోన్ లో గడుపుతూ ఉండటం వల్ల.. మీరు ఫోన్ కి మరింత ఎడిక్ట్ అయిపోతారు. మన అవసరానికి ఫోన్ వాడటం వేరు.. అంతేకాదు.. ఆ ఫోన్ లేకుండా బతకలేకపోయే స్థితిలోకి వస్తే మాత్రం దాని నుంచి బయటపడటం కష్టమని నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా.. టాయ్ లెట్ కి ఫోన్ తీసుకొని వెళ్లినప్పుడు.. ప్రమాదవశాత్తు అది టాయ్ లెట్ కమోర్డ్ లో పడే ప్రమాదం ఉంది. దాని వల్ల మీరు మీ ఫోన్ ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి.. వీటన్నింటినీ బుర్రలో పెట్టుకొని.. ఇంకోసారి టాయ్ లెట్ కి ఫోన్ తీసుకొని వెళ్లకండి.

click me!