కాఫీ స్క్రబ్ తో జుట్టు సమస్యలకు చెక్... ఎలాగంటే....

First Published | Oct 27, 2021, 2:34 PM IST

కాఫీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి మీ ఆరోగ్యానికి, చర్మానికి బాగా ఉపయోగపడతాయి. అందం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో కాఫీ ఎక్స్‌ట్రాక్ట్‌లను ఉపయోగించడమే దీనికి కారణం. వీటితో పాటు తలకు గ్రౌండెడ్ కాఫీ పొడిని రాసుకోవడం వల్ల hair issuesను తగ్గించవచ్చని తెలుసా? 

వేడి వేడి కాఫీ వాసన ముక్కుపుటాలకు తగిలితే చాలు.. ఉత్సాహం కలుగుతుంది. ఇక ఓ కప్పు కాఫీ తాగితే.. శరీరం మొత్తం ఉత్తేజితమవుతుంది. రుచి, వాసనతో రోజంతా హాయిగా పనిచేసుకునేలా ఉల్లాసాన్ని అందిస్తుంది. 

coffee powder

అయితే grounded coffee మీ రుచిని, ఆత్మను సంతృప్తి పరచడమే కాకుండా ఇంకెన్నో ప్రయోజనాలు కలిగిస్తుందని మీకు తెలుసా? ముఖ్యంగా కాఫీ మీ జుట్టుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిస్తే.. ఆశ్చర్యపోకుండా ఉండగలరా? 

Latest Videos


కాఫీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి మీ ఆరోగ్యానికి, చర్మానికి బాగా ఉపయోగపడతాయి. అందం, వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తులలో కాఫీ ఎక్స్‌ట్రాక్ట్‌లను ఉపయోగించడమే దీనికి కారణం. వీటితో పాటు తలకు గ్రౌండెడ్ కాఫీ పొడిని రాసుకోవడం వల్ల hair issuesను తగ్గించవచ్చని తెలుసా?  

coffee tips

కాఫీ మీ జుట్టుకు ఎలా మంచిది?

కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. వీటివల్ల జుట్టు పెరగడానికి,  జుట్టు సమస్యల్ని సహజసిద్ధంగా పరిష్కరించడానికి కాఫీ బాగా సహాయపడుతుంది. జుట్టు, మాడు పైన ఉన్న చర్మం సహజంగా ఆమ్లంగా ఉంటాయి. దీనిని pH స్కేల్ ఉపయోగించి కొలుస్తారు.

హెయిర్ ఫైబర్స్ pH 3.67 అయితే స్కాల్ప్ 5.5 pHని కలిగి ఉంటుంది. తక్కువ pH విలువ అధిక ఆమ్ల స్వభావాన్ని సూచిస్తుంది. అధిక pH విలువ కలిగిన ఉత్పత్తులను ఉపయోగించడం వలన జుట్టు నీరస పడిపోవడం, ఊడిపోవడానికి కారణం ఇదే. 

విచిత్రంగా.. కాఫీ సహజంగా ఆమ్లంగా ఉంటుంది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ ప్రకారం మీడియం రోస్ట్‌లో 5.11 pHను కలిగి ఉంటుంది.

అందువల్ల, కాఫీని జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు, మాడు పైన ఉన్న చర్మం pH స్థాయిని తిరిగి సమతుల్యం చేయవచ్చు. మీరు కాఫీ తాగినా తాగకపోయినా.. కాఫీతో జుట్టును కడుక్కోవడం లేదా కాఫీతో మాడుమీద మసాజ్ చేయడం వంటివి చేయండి. వీటివల్ల సహజంగా జుట్టు సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి. 

కాఫీ గ్రౌండ్‌తో ఇంట్లో హెయిర్ స్క్రబ్‌ని ఎలా తయారు చేసుకోవచ్చు. అది ఎలా పని చేస్తుందో చూద్దాం. 

కాఫీ గ్రౌండ్స్‌తో Scalp scrub

గ్రౌండెడ్ కాఫీతో స్కాల్ప్‌ను స్క్రబ్ చేయడం వల్ల ఎక్స్‌ఫోలియేట్ చేయడంలో సహాయపడుతుంది. మృతకణాలు తొలగిపోతాయి. ఇది రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. స్కాల్ప్ అనేది శరీరంలోని అత్యంత విస్మరించబడే భాగం. తరచుగా మృతకణాలతో మూసుకుపోతుంది అని నిపుణులు అంటున్నారు. 

దీన్ని పరిష్కరించి కొత్త జుట్టు పెరుగుదలను పెంచడానికి, పాత వాటిని తొలగించడం అవసరం. స్క్రబ్బింగ్ చుండ్రు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌లను నివారించడంలో సహాయపడుతుంది. స్కాల్ప్‌పై చర్మాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది.

జుట్టు కోసం  coffee scrub ఎలా తయారు చేయాలంటే.. 


2 టేబుల్ స్పూన్లు తాజా గ్రౌండ్ కాఫీ

1 టేబుల్ స్పూన్ బాదం నూనె

9 చుక్కల టీ ట్రీ ఎసెన్షియల్ ఆయిల్ 

1 టేబుల్ స్పూన్ coconut sugar

8 చుక్కల peppermint essential oil

తయారు చేసే విధానం.. 

ఒక గిన్నె తీసుకుని అందులో గ్రౌండ్ కాఫీ వేసి, అందులో కొబ్బరి పంచదార, బాదం నూనె కలపాలి. తరువాత ఎసెన్షియల్ ఆయిల్స్ వేసి బాగా కలపాలి. దీనివల్ల ముద్దలుగా ఏర్పడకుండా ఉంటుంది. 

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తడి తలమీద అప్లై చేయండి. తరువాత circular motionsలో మసాజ్ చేయాలి. ఆ తరువాత మామూలు నీటితో శుభ్రంగా కడిగేయాలి.  

అయితే దీన్ని ప్రతీరోజూ చేయకూడదు. కారణం ఈ స్క్రబ్ వల్ల తలమీద విడుదలయ్యే natural oilsను నాశనం చేస్తుంది. అందుకే చూసుకుని పాటించడం మంచిది. 

click me!