చలికాలంలో ఈ పండ్లను మిస్ చేయకండి.. లేదంటే దగ్గు, జలుబు, జ్వరం వంటి రోగాలొస్తయ్..

First Published Nov 6, 2022, 10:05 AM IST

చలికాలంలో దగ్గు, జలుబు, జ్వరం వంటి వ్యాధులు రావడం సర్వ సాధారణం. వీటి కారణంగా కొంతమంది తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు. అయితే ఈ సీజన్ లో కొన్ని పండ్లను తింటే రోగ నిరోధక శక్తి పెరిగి.. ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే ప్రమాదం తగ్గుతుంది.

fruits

చలికాలం వచ్చేసింది. ఉదయం, సాయంత్రం వేళల్లో అయితే వెదర్ మరీ  చల్లగా అయిపోతుంది. ఈ చల్లగాలుల వల్ల జలుబు, దగ్గు, జ్వరంతో పాటుగా వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ చలికి తోడు కాలుష్యం కూడా విపరీతంగా పెరిగిపోయింది. వీటి కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలొచ్చే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎలాంటి రోగాలొచ్చే అవకాశం ఉండదు. అందుకే ఈ సీజన్ లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచే విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లను తప్పకుండా తినాలని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ పండ్లను తింటే మన శరీరానికి దగ్గు, జలుబు వంటి ఎన్నో వ్యాధులతో పోరాడే శక్తి అందుతుంది. ఇంతకీ ఈ సీజన్ లో ఏ పండ్లను ఖచ్చితంగా తినాలో తెలుసుకుందాం పదండి. 

నారింజ

ఈ చలికాలంలో మన శరీరానికి విటమిన్ సి అత్యవసరమని డాక్టర్లు చెబుతున్నారు. మన శరీరంలో ఈ విటమిన్ పుష్కలంగా ఉంటే జలుబు వచ్చే అవకాశం తగ్గుతుంది. ఒకవేళ జలుబు చేసినా చాలా తొందరగా తగ్గిపోవడానికి సహాయపడుతుంది. నారింజలో విటమిన్ సి తో పాటుగా ఫోలేట్, పొటాషియంలు పుష్కలంగా ఉంటాయి.  దీనిలో ఉండే విటమిన్ సి మన నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. 
 

ఉసిరికాయ

చలికాలంలో ఉసిరికాయను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్లు, జుట్టు , చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే డ్రైనెస్ ను పోగొట్టడానికి సహాయపడుతుంది. ఉసిరికాయను ఉపయోగించడం వల్ల ఉదర సంబంధ సమస్యలు తగ్గిపోతాయి. ఇందుకోసం ఉసిరికాయను జ్యూస్ చేసుకుని తాగొచ్చు. 
 

నల్ల ద్రాక్ష 

శీతాకాలంలో కూడా నల్లద్రాక్షలు అందుబాటులో ఉంటాయి. ఈ నల్ల ద్రాక్షలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో  ఉంటుంది. ఈ సీజన్ లో నల్లద్రాక్షలను తింటే ఎన్నో అనారోగ్య నయమవుతాయి. నల్ల ద్రాక్షను తినడం వల్ల రక్తపోటు, రక్తంలో చ్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అంతేకాదు శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కూడా తగ్గిపోతుంది. వీటిలో ఉండే ఫైటోకెమికల్స్ గుండెను  ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండెకు సంబంధించిన సమస్యలను నయం చేస్తాయి. దీనిలో ఉండే కెరోటినాయిడ్లు కంటిచూపును మెరుగుపరుస్తాయి. వారానికి ఒకసారి బ్లాక్ గ్రేప్స్ జ్యూస్ ను తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 
 

క్యారెట్లు

చలికాలంలో క్యారెట్లు పుష్కలంగా లభిస్తాయి. దీన్ని కూరగా చేసుకుని కూడా తినొచ్చు. అలాగే సలాడ్ రూపంలో కూడా తీసుకోవచ్చు. క్యారెట్లలో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది. ఇది కంటిచూపును పెంచడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. క్యారెట్లలో ఎక్కువ మొత్తంలో ప్రోటీన్లు, కార్భోహైడ్రేట్లు, ఫైబర్ లు ఉంటాయి. దీనిలో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. వీటివల్ల జీర్ణం సులువుగా అవుతుంది. జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. 
 

click me!