ఐస్ ప్యాక్, హాట్ ప్యాక్... ఏ నొప్పికి ఏ ప్యాక్ మంచిది?

First Published Dec 18, 2020, 11:37 AM IST

దెబ్బకు, నొప్పికి కాపడం మంచి మందు అని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. అందుకే ఏదైనా దెబ్బలు తగిలినా, ఒళ్లు నొప్పులు వచ్చినా ముందుగా కాపడం పెడుతుంటారు. అయితే వీటిల్లో వేడినీటి కాపడం, ఐస్ కాపడం రెండు రకాలుగా ఉంటాయి. ఏ నొప్పికి ఏ రకమైన కాపడం మంచిది.. ఏఏ సందర్భాల్లో ఏ కాపడం వాడితే మంచిదో తెలిస్తే నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. 

దెబ్బకు, నొప్పికి కాపడం మంచి మందు అని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారు. అందుకే ఏదైనా దెబ్బలు తగిలినా, ఒళ్లు నొప్పులు వచ్చినా ముందుగా కాపడం పెడుతుంటారు. అయితే వీటిల్లో వేడినీటి కాపడం, ఐస్ కాపడం రెండు రకాలుగా ఉంటాయి. ఏ నొప్పికి ఏ రకమైన కాపడం మంచిది.. ఏఏ సందర్భాల్లో ఏ కాపడం వాడితే మంచిదో తెలిస్తే నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.
undefined
దీనికంటే ముందు అసలు ఐస్ ప్యాక్, హాట్ ప్యాక్ లతో అసలు శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి. అవి ఎలా పనిచేస్తాయి? నొప్పి నుండి ఎలా ఉపశమనం కలిగిస్తాయి? అనేది తెలుసుకుంటే ఈ సారి మీకు నొప్పి వచ్చినప్పుడు దానికి ఏ కాపడం పెట్టాలనేది మీకే ఓ అంచనా వస్తుంది.
undefined
ముందుగా ఐస్ ప్యాక్ గురించి చూద్దాం. దెబ్బ తగలగానే వెంటనే ఐస్ పెట్టమని డాక్టర్లనుంచి పెద్దవారి వరకు చెబుతుంటారు. ఐస్‌ అద్దడం వల్ల గాయం తాలూకు నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. ఇది ఎక్కువగా తాజాగాయాల విషయంలోనే ఎక్కువగా జరుగుతుంది. ఇలాంటి గాయాల మీదే ఐస్‌ ఎక్కువగా ప్రభావం చూపుతుంది.
undefined
దెబ్బతగిలినప్పుడు ఓపెన్‌ ఊండ్‌ కాకుండా ఉన్నప్పుడు సాధారణంగా ఆ ప్రాంతంలో వాపు రావడం, ఎరుపెక్కడం జరుగుతుంది. వాపు వచ్చి, దానివల్ల ఆ ప్రదేశంలో కాస్త వేడిగా అనిపిస్తుంది. అప్పుడు అక్కడ ఐస్‌ పెట్టడం వల్ల లోపల చల్లబడినట్లుగా అనిపిస్తుంది. దీంతో ఆ ప్రాంతంలోని రక్తనాళాలు సంకోచిస్తాయి. కొద్ది నిమిషాల తర్వాత అవే రక్తనాళాలు వ్యాకోచిస్తాయి.
undefined
ఇలా రక్తనాళాల సంకోచ–వ్యాకోచాలను ‘లూయీస్‌–హంటింగ్‌ చర్య’ అంటారు. దీని వల్ల చిన్న రక్తనాళాలు వ్యాకోచించగానే దెబ్బతగిలినప్పుడు ఏర్పడ్డ మలిన పదార్థాలన్నీ ఒక్కసారిగా రక్తంలో కలిసి పలచబారిపోతాయి. దాంతో వాపు తగ్గుతుంది. ఆ ప్రాంతంలో వాపు, దెబ్బ త్వరగా తగ్గడానికి రక్తనాళాల వ్యాకోచం, రక్తప్రసరణ ఎక్కువగా తోడ్పడతాయి.
undefined
అంతేకాదు... ఐస్‌ పెట్టడం వల్ల కోల్డ్‌ రిసెప్టార్స్‌ ఉత్తేజం చెంది ఎండార్ఫిన్స్, ఎన్‌కెఫలిన్స్‌ అనే స్టిమ్యులెంట్స్‌ విడుదలవుతాయి. దాంతో నొప్పి తగ్గుతుంది. ఐస్‌ పెట్టగానే నరాల నుంచి వెళ్లే సంకేతాల వేగం తగ్గుతుంది. కండరాల బిగుతు కూడా తగ్గుతుంది.
undefined
అయితే ఈ ఐస్ ప్యాక్ ఎలా పెట్టాలి. ఎంత సేపు పెట్టాలి అనేది కూడా తెలిసి ఉండాలి. ఏదో పైపైన రుద్దేయడం కాకుండా.. ఐస్‌ ప్యాక్‌ కనీసం 10–15 నిమిషాలు పెట్టాలి. ఐస్‌ క్యూబ్స్‌ను టవల్‌లోగాని, లేదా ఏదైనా కవర్‌లోగాని పెట్టి ఐస్‌ప్యాక్‌ పెట్టవచ్చు. అలాగే జెల్‌ప్యాక్స్‌ రూపంలోనూ వాడవచ్చు.
undefined
ఆర్థరైటిస్‌ ఉన్నప్పుడు, వాపు, మంట వచ్చిన చోట, తాజా గాయాలు అయినప్పుడు. ఓపెన్‌ ఇంజ్యురీ కానప్పుడు ఐస్‌ కాపడం పెడితే ఉపశమనం ఉంటుంది.
undefined
అలాగే వేడి కాపడం దీర్ఘకాలిక నొప్పుల్లో బాగా పనికివస్తుంది. ఇక కొన్ని సందర్భాల్లో నొప్పి ఒక చోటి నుంచి మరోచోటికి పాకుతున్నప్పుడు కూడా ఈ వేడికాపడం ఉపశమనం కలిగిస్తుంది. మహిళలకు నెలసరి సమయాల్లో నడుము వద్ద నొప్పి వస్తున్నప్పుడు వేడికాపడంతో ఒకింత ఉపశమనం కలుగుతుంది.
undefined
అంతేకాదు వేడికాపడం తాలూకు ప్రభావం చర్మం పైపొరలకే పరిమితం కాకుండా, కండరాల మీద కూడా ఉంటుంది. దీనివల్ల గాయమైన చోట వేడికాపడం పెట్టగానే ఆ పరిసరాల్లో రక్తప్రసరణ ఎక్కువవుతుంది. దాంతో అక్కడ మెటబాలిక్‌ రేట్‌ కూడా పెరుగుతుంది. నరాలూ ఉత్తేజితమవుతాయి.
undefined
కాబట్టి ఆ ప్రాంతంలో పట్టే చెమటలో మలినాలు విసర్జితమవుతాయి. దీనివల్ల కండరాలు రిలాక్స్‌ అవుతాయి. ఈ చర్యలన్నింటి వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. కొద్దికొద్దిగా వేడి కాపడం పెడుతూ, కనీసం 10–15 నిమిషాలు పెట్టాలి. మృదువైన బట్టను వేడినీళ్లలో ఉంచి, పిండి అద్దడం ద్వారా వేడికాపడం పెట్టవచ్చు.
undefined
అయితే ఇటీవల మెడికల్‌ షాపుల్లో హాట్‌ వాటర్‌ బ్యాగ్స్‌ కూడా లభ్యమవుతున్నాయి. ఆ బ్యాగులలో వేడి చేసిన నీటిని నింపి వేడికాపడం పెట్టవచ్చు. ఇవేగాక ఇప్పుడు ఎలక్ట్రిక్‌ హీట్‌ ప్యాక్‌గాని, వ్యాక్స్‌తో గాని వేడికాపడం పెట్టే సౌకర్యాలూ అందుబాటులో ఉన్నాయి.
undefined
ఇక వేడి కాపడం నడుమునొప్పి, ఏదైనా పనిచేయడం ద్వారా వచ్చిన వెన్ను నొప్పి, మెకానికల్‌ బ్యాక్‌పెయిన్‌, డిస్క్‌ పొలాప్స్‌, సయాటికా, నెలసరి నొప్పి వంటి వాటికి మంచి ఉపశమనంగా ఉంటుంది.
undefined
click me!