`గజిని`రీమేక్‌ని పవన్ ఎందుకు తిరస్కరించాడు? ఆ పని చేయడానికి భయపడ్డాడా? అసలేం జరిగిందంటే?

Published : May 03, 2024, 08:51 PM ISTUpdated : May 04, 2024, 09:14 AM IST

పవన్‌ కళ్యాణ్‌ చాలా రీమేక్‌ చిత్రాలు చేసి సక్సెస్‌ అందుకున్నాడు. స్టార్‌డమ్‌ తెచ్చుకున్నాడు. కానీ `గజిని` రీమేక్‌ని మాత్రం ఆయన రిజెక్ట్ చేశాడట. కారణం బయటపెట్టాడు పవన్‌.   

PREV
18
`గజిని`రీమేక్‌ని పవన్ ఎందుకు తిరస్కరించాడు? ఆ పని చేయడానికి భయపడ్డాడా? అసలేం జరిగిందంటే?

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ నటించిన చిత్రాల్లో చాలా వరకు రీమేక్‌ లే ఉంటాయి. రీమేక్‌ లు ఆయనకు ఇండస్ట్రీలో తిరుగులేని స్టార్‌డమ్‌ని, సక్సెస్‌ని తెచ్చిపెట్టాయి. ఇప్పుడు పవర్‌ స్టార్‌గా రాణించడం వెనుక వాటి పాత్ర చాలా కీలకమని చెప్పొచ్చు. ఇటీవల కూడా ఆయన బ్యాక్‌ టూ బ్యాక్‌ మూడు రీమేక్‌లు చేశారు పవన్‌. 
 

28

ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయన కొత్తగా ఒరిజినల్‌ స్టోరీస్‌తో రాబోతున్నారు. అయితే రీమేక్‌లలో కొన్నింటిని పవన్‌ కళ్యాణ్‌ రిజెక్ట్ చేశారు. కొన్ని తనకు నచ్చక, మరికొన్ని వాటిని న్యాయం చేయలేక, ఇంకొన్నింటికి భయపడి నో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే తాజాగా పవన్‌ ఓ ఇంట్రెస్టింగ్‌, షాకింగ్‌ విషయాన్ని బయటపెట్టారు.  
 

38

`గజిని` సినిమా రీమేక్‌ రైట్స్ తో మేకర్స్ తనని అప్రోచ్‌ అయ్యారట. తెలుగులో రీమేక్‌ చేయాలని నిర్మాతలు వస్తే నో చెప్పాడట పవన్‌. దీనికి సంబంధించిన ఓ అరుదైన వీడియో వైరల్‌ అవుతుంది. వరుసగా రీమేక్‌లు చేసిన పవన్ కళ్యాణ్‌ `గజిని` రీమేక్స్ ఎందుకు నో చెప్పాడు. 
 

48

`గజిని` మూవీకి నో చెప్పడానికి కారణం ఏంటో చెప్పాడు పవన్‌. తమిళ సినిమాల్లో చాలా ప్రయోగాలు చేస్తారని, స్టార్‌ హీరోలు డిఫరెంట్‌ గెటప్స్ వేస్తారని, డీ గ్లామర్‌గానూ కనిపించి మెప్పిస్తారని తెలిపారు. `అలాంటి సినిమాలను తమిళ ఆడియెన్స్ ఆదరిస్తారు. ఎంకరేజ్‌ చేస్తారు. కానీ మన వద్ద అలా చూడరు. హీరో అంటే గ్లామర్‌గా, అందంగా కనిపించాలి. నీట్‌గా ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి ప్రయోగాలను తెలుగు ఆడియెన్స్ చూస్తారా అనేది ఓ డౌట్` అని చెప్పారు పవన్‌. 
 

58

`గజిని`లో సూర్య గుండుతో కనిపిస్తారు. మతిమరుపుతో అదరగొట్టాడు. నేను గుండు గీయించుకుంటే ఫ్యాన్స్ చూస్తారా? తెలుగు ఆడియెన్స్ చూస్తారా? అనేది డౌట్‌. చూడరేమో అనే భయంతోనే ఆ సినిమా రీమేక్‌ని తిరస్కరించాను అని వెల్లడించారు పవన్‌ కళ్యాణ్‌. తనకే కాన్ఫిడెన్స్ లేదని, గుండు గీయించుకుంటే ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు, అందుకే నో చెప్పినట్టు వెల్లడించారు పవన్‌. అందుకే డబ్ చేయడమే బెటర్‌ అని చెప్పానని తెలిపారు. 
 

68

ఇవన్నీ తనలో ఉన్న భయాలు అని, ఇలా చాలా సినిమాలను రిజెక్ట్ చేసినట్టు తెలిపారు. అయితే ఇవన్నీ మనలో ఉన్న భయాలే అని, ఎక్కడో చోట వాటికి ఫుల్‌ స్టాప్‌ పెట్టాలని, దెబ్బలు చాలా తింటాం, ఇలాంటివి కూడా చేస్తే రిజెల్ట్ ఏంటో తెలుస్తుందన్నారు పవన్‌. అయితే చేస్తే చేయోచ్చేమో కానీ మనంపై బడ్జెట్‌ పెట్టేందుకు నిర్మాతలు ముందుకు రారు, ఇప్పటికే గెడ్డంతోనే కనిపిస్తేనే మార్చండి అంటున్నారు, అలాంటి ఫ్లాష్‌ బ్యాక్‌లో పెట్టండి అంటున్నారని చెప్పారు పవన్‌. `పంజా` సినిమా టైమ్‌లో యాంకర్‌ సుమతో పవన్‌ కళ్యాణ్‌ స్పెషల్‌గా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ అరుదైన ఇంటర్వ్యూ యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతుండటం విశేషం. 
 

78

`గజిని`సినిమాని తమిళంలో సూర్య, ఆసిన్‌ జంటగా నటించగా ఏఆర్‌ మురుగదాస్‌ రూపొందించారు. అక్కడ ఇది పెద్ద విజయం సాధించింది. పవన్‌ నో చెప్పడంతో దీన్ని తెలుగులో డబ్‌ చేయగా, ఇక్కడ కూడా పెద్ద హిట్‌ అయ్యింది. హిందీలో అమీర్‌ ఖాన్‌ హీరోగా రీమేక్‌ చేశారు. అక్కడ కూడా సూపర్‌ హిట్‌ అయ్యిందీ మూవీ. కానీ పవన్‌ కళ్యాణ్‌ రీమేక్‌ చేసి ఉంటే మాత్రం రిజెల్ట్ ఎలా ఉండేదో ఊహించుకుంటేనే గూస్‌బంమ్స్ వస్తుంది.  

88

పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం `ఓజీ`, `ఉస్తాద్ భగత్‌ సింగ్‌`, `హరిహర వీరమల్లు` చిత్రాల్లో నటిస్తున్నారు. ఎన్నికల కారణంగా ఈ చిత్రాల షూటింగ్‌లు ఆగిపోయాయి. ఎన్నికలు అయిపోయాక వీటిని పూర్తి చేయబోతున్నారు పవన్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories