పురుషాంగం ఎప్పుడు పెరగడం స్టార్ట్ అవుతుంది.. ఎప్పుడు ఆగిపోతుంది..?

First Published Mar 21, 2023, 10:13 AM IST

దీనిమీద చాలా మందికి డౌట్స్ ఉంటాయి. అసలు ఇది ఎప్పుడు పెరగడం మొదలవుతుంది.. ఎప్పుడు పెరగడం ఆగిపోతుందని. అయితే అబ్బాయిలకు యుక్తవయసులో పురుషాంగం పెరగడం ప్రారంభవుతుంది. 
 

PENIS

అబ్బాయిలకు ఒక వయసు వచ్చిన తర్వాత పురుషాంగం పెరగడం మొదలవుతుంది. అంటే యుక్తవయసులో పురుషాంగం పెరగడం స్టార్ట్ అవుతుందన్న మాట. అంటే వీరు లైంగిక పరిపక్వత చెందడం స్టార్ట్ అయినప్పుడు. యుక్తవయస్సు ప్రారంభం 9 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉంటుంది. ఇది సాధారణ వయస్సు పరిధి. అయితే కొంతమంది అబ్బాయిలకు యుక్త వయస్సు దీనికంటే తర్వాత రావొచ్చు. యుక్తవయస్సు వచ్చిన అబ్బాయిల్లో పురుషాంగం పెరుగుదల సాధారణంగా 12 సంవత్సరాల నుంచి ప్రారంభమవుతుంది. ఇది సగటు వయస్సు. అయితే ఇది వ్యక్తికి వ్యక్తికి మారే అవకాశం ఉంది. 
 

వృషణ పెరుగుదల

యుక్తవయసుకు మొదటి సంకేతం వృషణ పెరుగుదల. యుక్తవయసు వృషణంలో మార్పులతో ప్రారంభమవుతుంది. యుక్తవయసుకు వచ్చిన అబ్బాయిల వృషణ చర్మం నల్లగా మారుతుంది. అలాగే పరిమాణం పెరుగుతుంది. చర్మం కూడా పలుచగా మారుతుంది. అలాగే చిన్న గడ్డలు లేదా హెయిర్ ఫోలికల్స్ అభివృద్ధి చెందుతాయి.
 

penis

పురుషాంగం పెరగడం ఎప్పుడు ఆగిపోతుంది?

మొదట పురుషాంగం పొడవుగా పెరిగి తర్వాత దాని చుట్టూ పెరుగుతుంది. పురుషుల ఎత్తు మాదిరిగానే పురుషాంగం కూడా వేగంగా పెరుగుతుంది. పురుషాంగం సాధారణంగా యుక్త వయస్సు అయిపోయే వరకు పెరుగుతుంది. అంటే ఇది సుమారు ఐదు సంవత్సరాలు ఉంటుంది. యుక్తవయసు సాధారణంగా 18 నుంచి 21 సంవత్సరాల మధ్య ముగుస్తుంది.
 

"సాధారణ పరిమాణం" ఉందా?

పురుషాంగం పెరుగుదల, ఆకారం, వాటి పరిమాణం మారుతూ ఉంటాయి. "సాధారణ" లేదా "పరిపూర్ణ" లేదా "ఆదర్శ" పరిమాణం అంటూ ఏం లేదు. మూత్రవిసర్జన లేదా సెక్స్ వంటి కార్యకలాపాల్లో మీరు సమస్యలను ఎదుర్కొంటుంటే తప్ప పరిమాణం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు అంటారు.  దీని కోసం మీరు యూరాలజిస్ట్ ను సంప్రదించొచ్చు.
 

పురుషాంగం పరిమాణాన్ని పెంచొచ్చా? 

పురుషాంగం పరిమాణాన్ని పెంచే వైద్య , శస్త్రచికిత్సలు ఉన్నాయి. అయినప్పటికీ వీటివల్ల ఎన్నో ప్రమాదాలు, సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే పురుషాంగం పరిమాణాన్ని సురక్షితంగా పెంచగలవని నిర్ధారించడానికి తగినంత శాస్త్రీయ ఆధారాలతో ఓవర్ ది కౌంటర్ మాత్రలు గానీ, సప్లిమెంట్స్ గానీ, క్రీములు లేదా వ్యాయామాలు గానీ లేవు. ఈ విధానాల ద్వారా వచ్చే సమస్యలు ప్రమాదకరమైనవి. అందుకే సరైన వైద్య ప్రిస్క్రిప్షన్ లేకుండా దేనినీ ప్రయత్నించకండి.

పరిమాణం ముఖ్యమేనా?

చాలా అధ్యయనాలు ఎక్కువ మంది పురుషులు సగటు పురుషాంగం పరిమాణాన్ని అతిగా అంచనా వేస్తారని కనుగొన్నారు. పురుషాంగం పరిమాణం గురించి  పట్టించుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే దీనిపై ఎన్నో అపోహలు ఉన్నాయి. పురుషాంగం పరిమాణం గురించే మీ భాగస్వామి పట్టించుకోరు. దాన్ని చూసే మిమ్మల్ని ఇష్టపడరని తెలుసుకోవాలి. అలాగే అది మీరు సెక్స్ లో ఎంత సమర్థవంతంగా ఉన్నారో చెప్పదు. మీ పురుషాంగం పరిమాణం మీ టెస్టోస్టెరాన్ స్థాయిలు, మగతనం లేదా పునరుత్పత్తి సామర్థ్యానికి సంకేతం అంతకంటే కాదు. అలాగే మీ ఎత్తు మీ పురుషాంగం పరిమాణాన్ని సూచించదు. అందుకే ఇలాంటి విషయాలను పట్టించుకోకండి. 
 

click me!