Soaked Almonds: 15 రోజులపాటు నానబెట్టిన బాదం తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Published : Aug 01, 2026, 05:43 PM IST

Soaked Almonds: ఉదయాన్నే టీ, కాఫీలతో రోజును ప్రారంభించే అలవాటు చాలామందికి ఉంటుంది. కానీ పొద్దున్నే నానబెట్టిన బాదం తినడం ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నిపుణులు. 15 రోజులపాటు వరుసగా నానబెట్టిన బాదం తింటే శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయో ఇక్కడ చూద్దాం.

PREV
15
బాదం తినడం వల్ల ప్రయోజనాలు

మనం రోజూ పాటించే చిన్న చిన్న మంచి అలవాట్లే మన ఆరోగ్యానికి పెద్ద మేలు చేస్తాయి. అలాంటి మంచి అలవాట్లలో ఒకటి ఉదయం నానబెట్టిన బాదం తినడం. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రాత్రంతా నానబెట్టిన బాదం పప్పును ఉదయం తినడం వల్ల కొన్ని ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి. అలా 15 రోజుల పాటు నానబెట్టిన బాదం తింటే శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో ఇక్కడ తెలుసుకుందాం.

25
శరీరానికి శక్తి

బాదంలో శరీరానికి అవసరమైన ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్ ఈ, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో కొన్ని నానబెట్టిన బాదం తినడం వల్ల రోజంతా శక్తి స్థాయిలు మెరుగ్గా ఉంటాయి. బాదంలో ఉండే పోషకాలు శరీరానికి నెమ్మదిగా శక్తిని అందిస్తాయి. ఉదయం అలసటగా అనిపించే వారికి బాదం తినడం మంచి అలవాటు. ముఖ్యంగా ఎక్కువ సమయం పని చేసే వారు, చదువుకునే వారు రోజును ఉత్సాహంగా ప్రారంభించడానికి ఇది చక్కగా సహాయపడుతుంది.

35
బరువు నియంత్రణకు..

నానబెట్టిన బాదంలో ఉండే ఫైబర్ మెరుగైన జీర్ణవ్యవస్థకు సహాయపడుతుంది. 15 రోజులపాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉంటుంది. దీంతో తరచూ ఆకలి వేయడం తగ్గుతుంది. ఆరోగ్యకరమైన ఆహార నియమాలతో పాటు బాదం తీసుకోవడం ద్వారా బరువు కూడా అదుపులో ఉంటుంది.

45
చర్మ ఆరోగ్యం

బాదంలో ఉండే విటమిన్ ఈ.. చర్మ ఆరోగ్యానికి ఉపయోగపడే ముఖ్యమైన పోషకం. 15 రోజుల పాటు క్రమం తప్పకుండా బాదం తీసుకోవడం వల్ల చర్మానికి అవసరమైన పోషకాలు అందుతాయి. చర్మం ఆరోగ్యంగా కనిపించడానికి, పొడిబారకుండా ఉండడానికి ఇది చక్కగా సహాయపడుతుంది. 

బాదం మెదడు ఆరోగ్యానికి కూడా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర పోషకాలు మెదడు పనితీరుకు మద్ధతు ఇస్తాయి. ప్రతిరోజూ ఉదయం బాదం తినే అలవాటు ఏకాగ్రత, చురుకుదనానికి సహాయపడుతుంది.

55
గుండె ఆరోగ్యం

బాదంలో ఉండే మెగ్నీషియం వంటి ఖనిజాలు శరీరంలోని అనేక జీవక్రియలకు అవసరం. క్రమబద్ధమైన ఆహారంలో భాగంగా బాదాన్ని తీసుకుంటే గుండె ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. అయితే బాదం పప్పును ఎలా తీసుకుంటున్నాం? ఎంత తీసకుంటున్నామన్నది కూడా ముఖ్యమే. సాధారణంగా రాత్రి నీటిలో నానబెట్టిన బాదాన్ని ఉదయం తొక్క తీసి తినడం మంచి అలవాటు. ఎంత పరిమాణంలో తినాలి అనేది వ్యక్తి వయసు, ఆరోగ్య పరిస్థితి, ఆహార అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. రోజూ 5 నుంచి 10 బాదం పప్పులు తినడం మంచిది. డయాబెటీస్, అలెర్జీలు లేదా ప్రత్యేక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఆహారంలో మార్పులు చేసుకునే ముందు వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

Read more Photos on
click me!

Recommended Stories