Cooking Tips: వంట చేసేటప్పుడు కూరలో నీరు అవసరం అయితే.. చల్లటి నీరు పోస్తున్నారా? లేక కాచిన వేడి నీరు పోస్తున్నారా? దేని వల్ల కూర రుచి అద్భుతంగా మారుతుందో తెలుసా?
చికెన్ గ్రేవీ కర్రీ, పప్పు లాంటి కూరలు వండటానికి నీరు చాలా అవసరం. కూర ఉడుకుతున్నప్పుడు మధ్యలో నీరు పోయాల్సి ఉంటుంది. అయితే.. అలాంటప్పుడు కొందరు నార్మల్ టెంపరేచర్ లో ఉన్న వాటర్ పోసేస్తారు. కొందరు మాత్రం.. నీళ్లు వేడి.. చేసి వేడి నీరు పోస్తూ ఉంటారు. రెండింటికీ తేడా ఏంటి? రెండింటిలో ఏది బెస్ట్..? వంటలో రుచి పెరగడానికి ఈ నీరు కూడా కారణం అవుతాయా? ఇప్పుడు తెలుసుకుందాం...
24
చల్లటి నీరు పోస్తే ఏమౌతుంది..?
కూర ఉడుకుతున్నప్పుడు.. దాని ఉష్ణోగ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో సడెన్ గా చల్లగా ఉన్న నీరు పోస్తే.. ఆ పాత్రలోని మొత్తం ఉష్ణోగ్రత ఒక్కసారిగా తగ్గిపోతుంది. దీంతో.. కూర ఉడకడానికి ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుంది. కూర పూర్తవ్వడానికి ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుంది. అదే వేడి నీరు పోయడం వల్ల కూర తొందరగా ఉడుకుతుంది. మధ్యలో ఎలాంటి బ్రేకులు పడవు. మరీ ముఖ్యంగా,వేడి నీరు పోయడం వల్ల మాంసం చాలా మెత్తగా ఉడుకుతుంది. చికెన్ మాత్రమే కాదు.. మటన్, బీఫ్ లాంటివి త్వరగా ఉడకడానికి సహాయపడుతుంది.
ఉడుకుతున్న మాంసంలో చల్లటి నీరు కలిపితే, మాంసం మెత్తగా ఉడకకపోగా... కాస్త గట్టిపడే అవకాశం ఉంటుంది. దీని వల్ల..కూర మనం అనుకున్నంత మృదువుగా రాదు. ఉడకడానికి కూడా చాలా ఎక్కువ సమయం పడుతుంది. వేడి నీరు కలపడం వల్ల ఇలాంటి సమస్యలు ఏమీ రావు.
34
పప్పు కూడా...
కేవలం మాంసం కూరలు మాత్రమే కాదు.. పప్పు, కూరలకు కూడా ఇదే సూత్రం వర్తిస్తుంది. ముఖ్యంగా పప్పు, శనగలు, రాజ్మా వంటి పదార్థాలు ఉడుకుతున్న సమయంలో చల్లటి నీరు పోస్తే.. ఆ పప్పు సమానంగా ఉడకదు. అదే, వేడి నీరు పోస్తే.. పప్పు సమానంగా ఉడుకుతుంది. మెత్తగా కూడా ఉడుకుతుంది. రుచి కూడా బాగుంటుంది.
వేడినీళ్లు వాడటం వల్ల వంట సమయం ఆదా అవుతుంది, ఆహారం సహజమైన రుచి కూడా పాడవదు. ఇలా తరతరాలుగా వస్తున్న ఈ చిన్న చిట్కా వంట నాణ్యతను, రుచిని ఎంతగా పెంచుతుందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇకపై మీరు వంట చేసేటప్పుడు ఈ సింపుల్ టెక్నిక్ గుర్తుంచుకోండి!