4.ఉద్యోగం చేస్తే సరిపోదు..
డబ్బు సంపాదించడానికి ఉద్యోగం చేస్తే సరిపోదు. జీవితంలో ఆర్థికంగా ఎదగాలి. దాని కోసం డబ్బు సంపాదిస్తే సరిపోదు. డబ్బు ఎలా ఖర్చు చేయాలి? ఎలా పొదుపు చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. ఆర్థిక స్వాంతంత్రత కచ్చితంగా నేర్చుకోవాలి.
5.తప్పులు చేయడానికి భయపడకూడదు..
జీవితంలో ఆడపిల్ల తప్పు చేయకూడదు అని మన సమాజం ఎక్కువగా నమ్ముతుంది. కానీ, జీవితంలో అందరూ తప్పులు చేస్తారు. కానీ అదే తప్పు నుంచి పాఠం నేర్చుకొని ముందుకు వెళ్లడమే అసలైన విజయం అని కచ్చితంగా చెప్పాలి.
6.నీ ఆనందాన్ని పక్కన పెట్టకూడదు..
ఇతరులను సంతోషపెట్టడం మంచిదే. కానీ అందుకోసం నీ ఆరోగ్యం, నీ కలలు, నీ సంతోషాన్ని ఎప్పుడూ త్యాగం చేయొద్దు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం కూడా జీవితంలో ఒక ముఖ్యమైన విలువ.
తల్లులు గుర్తించుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం...
కూతుళ్లు ఎక్కువగా విన్నదానికంటే చూసిందే ఎక్కువగా నేర్చుకుంటారు. కాబట్టి గౌరవం, నిజాయితీ, కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను మాటల్లో చెప్పడంతో పాటు, మీ ప్రవర్తనలో కూడా చూపించడం చాలా ముఖ్యం. ప్రతి అమ్మ తన కూతురికి జీవితంలో అన్ని సమస్యలకు సిద్ధమైన సమాధానాలు ఇవ్వలేకపోవచ్చు. కానీ సరైన విలువలు, ఆత్మగౌరవం, ధైర్యం, స్వతంత్ర ఆలోచనను నేర్పగలిగితే, ఆమె ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలదు.