Honey : రోజూ 1 టీస్పూన్ తేనెను తింటే ఈ జబ్బులకు దూరంగా ఉంటారు

Published : Sep 16, 2025, 06:13 PM IST

Honey :తేనె మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని గనుక రోజూ ఒక టీ స్పూన్ తింటే మనం ఎన్నో రోగాలకు దూరంగా ఉంటామని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు తేనె మన ఆరోగ్యానికి ఎలాంటి మేలు చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

PREV
15
తేనె ప్రయోజనాలు

తేనె తీయగా, టేస్టీగా ఉంటుంది. అందుకే దీనిని ఎన్నో రకాల ఆహారాల్లో ఉపయోగిస్తారు. అయితే తేనె మన ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది తెలుసా? దీనిలో ఉండే ఎన్నో ఔషదగుణాల కారణంగా దీనిని ఆయుర్వేదంలో బాగా ఉపయోగిస్తారు. తేనెలో విటమిన్లు, అమైనో ఆమ్లాలు, గ్లూకోజ్, ప్రోటీన్లు, శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అసలు రోజూ ఒక టీ స్పూన్ తేనెను తినడం వల్ల మనం ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతామో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది

మనకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉంటేనే మనం దగ్గు, జలుబు, జ్వరం, వైరల్ ఫీవర్లు వంటి జబ్బులకు దూరంగా ఉంటాం. అయితే మనం రోజూ ఒక టీ స్పూన్ తేనెను తింటే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. రోజూ టీస్పూన్ తేనెను తింటే దగ్గు, జలుబు వంటి అనారోగ్య సమస్యలు దూరంగా ఉంటాం.

గుండె ఆరోగ్యం

రోజూ ఒక టీస్పూన్ తేనెను తింటే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. తేనె మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను, ట్రైగ్లిజరైడ్స్ ను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇవి గనున ఎక్కువగా ఉంటే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. తేనె తింటే ఈ సమస్య ఉండదు. రోజూ తేనెను తినడం వల్ల గుండెజబ్బులొచ్చే రిస్క్ తగ్గుతుంది. గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది.

35
చర్మానికి మేలు

తేనె కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా ఉపయోగపడుతుంది. అవును మీరు గనుక రోజూ ఒక టీస్పూన్ తేనెను తింటే మీ చర్మం హెల్తీగా ఉంటుంది. తేనె చర్మానికి మంచి పోషణను అందిస్తుంది. తేమగా ఉంచుతుంది. చర్మం సహజంగా మెరిసేలా చేయడానికి కూడా సహాయపడుతుంది. తేనె చర్మ సమస్యలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

45
షుగర్ నియంత్రణకు

తేనె చక్కెర లాగ రక్తంలో చక్కెర స్థాయిలను వెంటనే పెంచదు. ఇది షుగర్ ను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. దీనిలో చక్కెర కంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. రోజూ ఒక టీస్పూన్ తేనెను తింటే మీ శరీరం ఇన్సులిన్ ను ఉపయోగించుకునే సామర్థ్యం పెరుగుతుంది. అయితే దీన్ని ఎక్కువగా మాత్రం తీసుకోకూడదు. లేదంటే షుగర్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. అంతేకాదు గోరువెచ్చని నీళ్లలో టీస్పూన్ తేనెను కలిపి తాగితే మీరు బరువు కూడా తగ్గుతారు.

ఉబ్బసం, జలుబు తగ్గుతాయి

తేనెను ఉపయోగించి మనం దగ్గు, జలుబు, జ్వరం, ఉబ్బసం వంటి సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అందుకే దీన్ని సాంప్రదాయ వైధ్యంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇది ఆస్తమా లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుందని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

55
గాయాలు మానుతాయి

రోజూ టీస్పూన్ తేనెను తినడం వల్ల గాయాలు త్వరగా మానుతాయని నిపుణులు చెబుతున్నారు. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇది గాయాలను త్వరగా మాన్పడానికి సహాయపడుతుంది.అలాగే ఇది చలికాలంలో వచ్చే గొంతునొప్పిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. తేనెలో ఉండే వేడి స్వభావం ఇందుకు సహాయపడుతుంది.

రక్తం పెరుగుతుంది

శరీరంలో రక్తం తక్కువగా ఉండేవారికి కూడా తేనె బాగా సహాయపడుతుంది. తేనెలో జింక్, పొటాషియంలు పుస్కలంగా ఉంటాయి. ఇవి రక్తాన్ని పెంచడానికి సహాయపడతాయి. మీరు రోజూ ఒక టీ స్పూన్ తేనెను తింటే హిమోగ్లోబిన్ బాగా పెరుగుతుంది. రక్తహీనత సమస్య తగ్గుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories