Chicken: చికెన్ సరిగా ఉడకకుండా తింటే ఏమౌతుందో తెలుసా?

Published : Sep 16, 2025, 05:10 PM IST

Chicken:  చికెన్ తో చాలా రకాల వెరైటీలు చేసుకొని తింటూ ఉంటారు. కానీ.. ఇదే చికెన్ సరిగా ఉడకుండా తింటే ఎంత ప్రమాదమో తెలుసా? ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా? నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం.... 

PREV
15
Chicken

మీరు చికెన్ ప్రియులా..? ముక్క లేనిదే ముద్ద మింగుడు పడదా? ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో చికెన్ తింటున్నారా? అయితే.. ఈ న్యూస్ మీ కోసమే. చికెన్ ని రకరకాల రూపంలో వండుకొని చాలా మంది తింటూ ఉంటారు. చికెన్ తినడం కూడా ఆరోగ్యానికి మంచిదే. అందులో ఉండే ప్రోటీన్ మన శరీరానికి చాలా అవసరం. ఇది సరిగా ఉడికిన తర్వాత మనం తింటే.. మనకు మంచిదే. కానీ.. సరిగా ఉడికించకుండా తింటే మాత్రం... చాలా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

25
డాక్టర్లు ఏమంటున్నారంటే...

సరిగా ఉడికించని చికెన్ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు.. ఏకంగా శరీరానికి పక్షవాతం వస్తుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ విషయం మేము కాదు.. AIIMS కి చెందిన ఓ డాక్టర్ స్వయంగా చెప్పారు.

AIIMS, హార్వర్డ్ , స్టాన్‌ఫోర్డ్ నుండి శిక్షణ పొందిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ సౌరభ్ సేథి సోషల్ మీడియాలో ఒక వీడియోను షేర్ చేశారు. ఉడికించని చికెన్ తినడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ , తరువాత గిలియన్ బారే సిండ్రోమ్ సంభవిస్తాయని ఆ డాక్టర్ వీడియోలో పేర్కొనడం గమనార్హం. సగం ఉడికించిన చికెన్ శరీరానికి ఎందుకు సమస్యగా మారుతుందో ఇప్పుడు చూద్దాం...

35
గిలియన్ బారే సిండ్రోమ్ అంటే ఏమిటి?

గిలియన్-బారే సిండ్రోమ్ అనేది అరుదైన తీవ్రమైన నాడీ సంబంధిత రుగ్మత. ఈ వ్యాధిలో, వ్యక్తి రోగనిరోధక వ్యవస్థ పొరపాటున నరాలపై దాడి చేసి శరీరంలో జలదరింపుకు కారణమవుతుంది. దీని కారణంగా, వ్యక్తికి పక్షవాతం సమస్య వస్తుంది. కాళ్ళు , చేతుల్లో జలదరింపు, నడవడంలో ఇబ్బంది, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. వైరల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కారణంగా గిలియన్-బారే సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది.

45
గులియన్ బారే సిండ్రోమ్, ఉడికించని చికెన్ మధ్య సంబంధం ఏమిటి?

గులియన్ బారే సిండ్రోమ్, ఉడికించని చికెన్‌కు ప్రత్యక్ష సంబంధం లేదు. కానీ సరిగా ఉడికించని చికెన్‌లో కొన్ని బ్యాక్టీరియా సజీవంగా ఉంటుంది, ఇది తీవ్రమైన ఇన్ఫెక్షన్ లేదా పాక్షిక ఇన్ఫెక్షన్‌కు కారణమవుతుంది. బ్యాక్టీరియా నాడీ వ్యవస్థను చేరుకున్నప్పుడు, నరాల సంకేతాల ప్రసారం సరిగ్గా జరగదు. దీని కారణంగా, శరీరంలోని ఏ భాగంలోనైనా పక్షవాతం వచ్చే అవకాశం పెరుగుతుంది.

55
ఈ లక్షణాలు కనపడితే ఏం చేయాలి?

పైన చెప్పిన లక్షణాలు మీకు కనిపిస్తే.. వాటిని విస్మరించకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. సకాలంలో చికిత్స తీసుకుంటే ఒక పెద్ద వ్యాధిని నివారించవచ్చు. గొంతు కండరాల నియంత్రణ కోల్పోవడం వల్ల కొంతమందికి మాట్లాడేటప్పుడు లేదా ఆహారాన్ని మింగేటప్పుడు కూడా సమస్యలు మొదలవుతాయి. అదే సమయంలో, కొంతమందికి మూత్రం లేదా మలవిసర్జన చేయడంలో కూడా ఇబ్బంది ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఎదురైనా వైద్యులను సంప్రదించడం మర్చిపోవద్దు.

Read more Photos on
click me!

Recommended Stories