ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఎంత ముఖ్యమో మన అందరికీ తెలుసు. ఉదయం తీసుకునే ఆహారం పైనే మనం రోజంతా ఎలా ఉంటామనేది ఆధారపడి ఉంటుంది. అయితే చాలామంది బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. లేదా లేటుగా తింటుంటారు. అలా చేస్తే ఏమవుతుందో ఇక్కడ చూద్దాం.
సాధారణంగా అల్పాహారాన్ని బ్రెయిన్ ఫుడ్ అంటారు. ఇది చాలా ముఖ్యమైనది. రోజంతా ఉత్సాహంగా ఉండాలంటే కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. కానీ చాలామంది బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేస్తుంటారు. లేదా చాలా లేటుగా తింటుంటారు. దానివల్ల చాలా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా వృద్ధులకు ఇది చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. అల్పాహారం ఆలస్యంగా ఎందుకు తినకూడదో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
24
వృద్ధులపై ప్రభావం
సాధారణంగా వృద్ధులు తమ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లలో రాజీ పడకూడదు. ఆహారపు అలవాట్లలో మార్పులు వారి ఆయుష్షును తగ్గించే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అల్పాహారం తినే సమయం వారి మొత్తం ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
34
లేటుగా తింటే ఏ సమస్యలు వస్తాయంటే?
ఆరోగ్య సమస్యలను గుర్తించడానికి ఆహార సమయాలే మొదటి సంకేతం. వీటిలో మార్పులు శరీరంలో పెద్ద సమస్యలకు దారితీస్తాయి. ఆలస్యంగా అల్పాహారం తీసుకోవడం వల్ల డిప్రెషన్, ఒత్తిడి, నోటి సమస్యలు, నిద్రలేమి వంటివి వస్తాయి. ముఖ్యంగా లేటుగా బ్రేక్ ఫాస్ట్ చేసేవారు రాత్రిపూట సరిగ్గా నిద్రపోరు. ఎక్కువసేపు మెలుకువతో ఉంటారని నిపుణులు చెబుతున్నారు.
2018లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. ఆలస్యంగా నిద్రపోయేవారికి మరణ ప్రమాదం ఎక్కువని తేలింది. ఇది వృద్ధులలో మరింత ప్రమాదకరం. ఆలస్యంగా చేసే అల్పాహారం వృద్ధులలో ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది మరణంతో ముడిపడి ఉందని పరిశోధకులు అంటున్నారు. సరైన సమయానికి తినడం వారి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. దీర్ఘాయువు కోసం వృద్ధులకు మూడు పూటలా సరైన సమయానికి ఆహారం ఇవ్వడం ముఖ్యం.