Weight Loss Tips: డైటింగ్ లేదు, జిమ్ లేదు.. కేవలం ఈ 4 జ్యూస్ లు తాగితే చాలు.. వేగంగా బరువు తగ్గుతారు..

First Published Jun 28, 2022, 3:48 PM IST

Weight Loss Tips: ప్రస్తుత కాలంలో జనాలు తీరిక లేకుండా గడుపుతున్నారు. అందుకే చాలా మంది అధిక బరువు సమస్య బారిన పడుతున్నారు. వ్యాయామం, డైటింగ్ చేస్తే బరువును తగ్గొచ్చు. కానీ ఆ సమయం కూడా దొరకని వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారు ఈ నాలుగు జ్యూస్ లను తాగితే సులువుగా బరువు తగ్గుతారు. 
 

మారుతున్న కాలంలో సమయం లేకపోవడం వల్ల ప్రజలు ఫాస్ట్ ఫుడ్ (Fast food), Canned food తినడం ప్రారంభించారు. దీని వల్ల చాలా మంది స్థూలకాయులు (Obese)గా మారుతున్నారు. పెరిగిన బరువును తగ్గించుకోవడానికి  జిమ్ లకు వెల్లడం, డైటింగ్ ను ఫాలో అవుతుంటారు. కానీ వీటిని రెగ్యులర్ గా చేయలేకపోతున్నారు. దీనివల్ల బరువు ఏ మాత్రం తగ్గరు. అటువంటి పరిస్థితిలో మీరు మీ ఆహారంలో కొన్ని రసాలను చేర్చుకోగలిగితే.. మీరు వేగంగా బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ జ్యూస్ లతో మీ చర్మం కాంతివంతంగా మారుతుంది కూడా. మిమ్మల్ని మీరు స్లిమ్ ఫిట్ గా ఉంచుకోవడానికి మీ ఈ నాలుగు జ్యూస్ లు బాగా ఉపయోగపడతాయి. 
 


క్యారెట్ జ్యూస్ (Carrot Juice)

క్యారెట్ జ్యూస్ (Carrot Juice) బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. క్యారెట్ జ్యూస్ లో డైటరీ ఫైబర్ (Dietary fiber)ఉంటుంది. ఇది ఆకలిని నియంత్రిస్తుంది. అందుకే మీ డైట్ లో ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ ను తీసుకుంటే.. అది బరువును కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఇది కాకుండా ఇందులో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది కంటిచూపునకు  ప్రయోజనకరంగా ఉంటుంది.
 

దానిమ్మ రసం (Pomegranate juice)

బరువు తగ్గడానికి దానిమ్మ రసం (Pomegranate juice) కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దానిమ్మలో అయాన్లు (Ions), జింక్ (Zinc), ఫైబర్ (Fiber), పొటాషియం (Potassium), ఒమేగా 6 (Omega 6) ఉంటాయి. ఇది ఊబకాయాన్ని నివారించడంలో సహాయపడుతుంది. చైనాలోని Tsinghua University నిర్వహించిన పరిశోధనలో దానిమ్మ పండ్లు ఊబకాయం అభివృద్ధిని నిరోధించగలవని కనుగొన్నారు. దీనిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కేలరీలు తక్కువగా ఉంటాయి. దీని వల్ల మీ కడుపును ఎక్కువ కాలం నిండుగా ఉంచుతుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక కప్పు దానిమ్మ గింజలను లేదా జ్యూస్ ను మీ డైట్ లో చేర్చుకోండి.

టొమాటో జ్యూస్ (Tomato juice)

ఎరుపు టమోటాలలో అధిక మొత్తంలో ఫైబర్ (Fiber)ఉంటుంది. దీనిని తినడం ద్వారా మీ కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. ఆకలి కూడా నియంత్రణలో ఉంటుంది. దీని వల్ల మీరు ఎక్కువగా తినకుండా ఉంటారు. కాబట్టి మీ డైట్ లో ఒక కప్పు లేదా ఒక గ్లాసు టమోటా జ్యూస్ తీసుకోండి. టొమాటో జ్యూస్ కూడా చర్మాన్ని కాంతివంతంగా తయారుచేస్తుంది. 
 

బీట్ రూట్ జ్యూస్ (Beetroot Juice)

రక్తం పెరగడానికి,  బరువు తగ్గడానికి బీట్ రూట్ జ్యూస్ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. బీట్ రూట్ జ్యూస్ లో కూడా చాలా తక్కువ మొత్తంలో కేలరీలు ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. మీరు బీట్ రూట్ జ్యూస్ లేదా రైతాను డైట్ లో చేర్చుకోవచ్చు.
 

click me!