Tips to lose Weight: బరువు తగ్గాలనుకునే వారికి చక్కటి చిట్కాలు.. కేవలం ఏడు రోజులే..

First Published Jan 16, 2022, 10:40 AM IST


Tips to lose Weight: నేడు చాలా మంచి ఎదుర్కొంటున్న అది పెద్ద సమస్య బరువు, లావుగా అవడం. ఈ సమస్యల మూలంగా నలుగురిలో తిరగడానికి కూడా ఇబ్బందిపడుతుంటారు. అందుకే దీని నుంచి బయటపడేందుకు ఎన్నో  ప్రయత్నాలు చేసి.. ఫలితం రాక నిరాశ చెందిన వారున్నారు. అలాంటి వారు కేవలం వారం రోజులు ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం వస్తుంది.

Tips to lose Weight: ప్రస్తుతం చాలా మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య బరువు పెరగడం. ఈ సమస్య వల్ల నులుగురిలో మాట్లాడటానికి కూడా నామోషీగా ఫీలవుతుంటారు. అందులోనూ తమకిష్టమైన దుస్తులు వేసుకోవడానికి కూడా వెనుకాడుతుంటారు. కారణం అందులో వాళ్లు ఇంకా లావుగా కనిపిస్తామేమోననే భయం. అందుకే ఎంత అందంగా ఉన్నా.. లావుగా ఉంటే మనల్ని ఎవరూ పట్టించుకోరని ఫీలవుతుంటారు. ముఖ్యంగా అధిక బరువు కారణంగా శారీరక శ్రమ కూడా చేయలేరు. 

దానికారణంగా ఇంకా ఇంకా బరువు పెరుగుతుంటారు. ఈ సమస్యలన్నింటి నుంచి తొందరగా బయటపడేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రకరకాల Exercises, డైటింగ్స్ ప్లాన్స్ వేసుకుని ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా కూడా బరువు తగ్గని వారు చాలా మందే ఉన్నారు. అలాంటి వారికోసమే ఈ సింపుల్ చిట్కాలు. కేవలం ఏడు రోజులు వీటిని పాటిస్తే.. వారం రోజుల్లో చక్కటి ఫలితాన్ని ఇవ్వడం పక్క. మరికెందుకు ఆలస్యం ఈ ఆర్టికల్ చదివి బరువును నియంత్రించండి.
 

బరువు ఖచ్చితంగా తగ్గాలనుకుంటే డైట్ ప్రోగ్రామ్ ను ప్లాన్ చేసుకోవాల్సిందే. అందులో మీ మెనూ ప్లాన్ క్లియర్ గా ఉండేలా చూసుకోవాలి. అయితే చాలా మంది  Workouts ద్వారానే బరువు తగ్గుతారని భావిస్తుంటారు. కానీ అది మన పొరపాటే. ఎందుకంటే వర్కౌట్స్ వల్ల కేవలం 20 శాతం మాత్రమే బరువును కోల్పోతారు. అదే డైట్ వల్ల 80 శాతం బరువు తగ్గుతారు. అందుకే వర్కౌట్స్ కంటే డైట్ కే ఎక్కువ Preference ఇవ్వండి. 

మీరు తీసుకునే ఆహారంలో ప్రతిరోజూ Carbohydrates పరిమాణం ఎంత మేరకు ఉంటుందో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే Carbohydrates అధికంగా ఉంటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఈ కార్బోహైడ్రేట్స్ ను నియంత్రించుకుంటే బరువు చాలా తగ్గుతారు. మీ డైటింగ్ ప్లాన్ లో ఇదే చాలా కీలకం. చాలా వరకు మనకు తెలియకుండానే ఈ కార్బోహైడ్రేట్స్ మోతాదుకు మించి తీసుకుంటూ ఉంటాం. అందుకే తీసుకునే ఈ కార్బోహైడ్రేట్స్ పరిమాణం తగ్గేలా చూసుకోవాలి. 

తరచుగా ఆకలి అవుతుంటే అధికంగా తినడం మానుకోండి. మీకు తెలియకుండానే ఫుడ్ ను అధికంగా తీసుకునే ప్రమాదం ఉంది. అందుకే ఒక  ప్లాన్ ప్రకారం ఫుడ్ ను కొద్ది కొద్దిగానే తీసుకోవాలి. అందులోనూ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండే ఫుడ్ ను తీసుకోవడం మానేయండి. వీటిని బదులుగా ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా ఆహారాన్ని తీసుకోవాలి. 

Weight loss అవ్వాలనుకునే వారు వేపుళ్లకు, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలి. వీటికి బదులుగా కూరగాయలకే ఎక్కువ ప్రాధాన్యతనివ్వండి. కార్బోహైడ్రేట్లు తక్కువ పరిమాణంలో ఉండే టొమాటో, క్యాబేజి, కాప్సికమ్, కాలిఫ్లవర్, స్పినాచ్, బ్రోకోలి, బెల్ పెప్పర్స్, మష్రూమ్ లు మీ రోజూ వారి ఆహారంలో చేర్చండి. 

 వెయిట్ లాస్ తో బాధపడే వారు ఖచ్చితంగా బయటఫుడ్ కు దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు ఇంట్లోనే వండుకునే తినే విధంగా చూసుకోవాలి. ఇంట్లో వండుకుని తినే ఆహారంలో Nutrient ఎక్కువగా లభిస్తుంది. అలాగే ప్రోటీన్లు, విటమిన్లు కూడా అధిక మొత్తంలో లభిస్తాయి. అందుకే బయటి ఆహారాన్ని తినడం పూర్తిగా తగ్గించి.. ఇంట్లోనే వండుకుని తినండి. 

Exercise ల ద్వారా కూడా బరువు ఈజీగా తగ్గించుకోవచ్చు. అందుకే ప్రతిరోజూ Exercise చేయడం అలవాటు చేసుకోండి. బరువును తగ్గించండో Exercises కీలక పాత్రను పోషియిస్తాయి. 7. అలాగే ఏ ఫుడ్ తీసుకుంటే బరువు తగ్గుతారో అటువంటి ఆహారాన్నే ప్రిపేర్ చేసుకోండి.  పైన చెప్పిన చిట్కాలను క్రమం తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా 3 నెలల్లో మంచి ఫలితాలను చూస్తారు.         
 

click me!