2023 లో పక్కా బరువు తగ్గాలని ప్లాన్ వేసుకున్నారా? అయితే ఈ సలాడ్లను తప్పకుండా తినండి..

First Published Jan 2, 2023, 11:42 AM IST

కొత్త ఏడాదిలో ఇది చేయాలి? అది చేయకూడదు.. అంటూ ఎన్నో ప్లాన్స్ వేసుకుంటారు. ఇక కొంతమంది ఈ ఏడాదైనా పక్కా బరువు తగ్గాలని లక్ష్యం పెట్టుకుంటారు. ఇలాంటి వారికి కొన్ని సలాడ్లు బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే. 

ప్రతి కొత్త సంవత్సర ఇవి చేయాలి? అవి చేయకూడదు? ఇలాగే ఉండాలి అంటూ ఎన్నో ప్లాన్స్ వేసుకుంటుంటారు. ఓవర్ వెయిట్ తో బాధపడే చాలా మంది ఈ ఏడాదైనా పక్కాగా బరువు తగ్గాలని అనుకుంటారు. ఇందుకోసం ఎన్నో ప్లాన్స్ వేసుకుంటారు. కానీ అందులో జరిగేవి మాత్రం కొన్నే. భోజన ప్రియులు బరువు తగ్గడం అంత సులువు కాదు. ఎందుకంటే వీరు ఫుడ్ ను తీసుకోకుండా అస్సలు ఉండరు. బరువు తగ్గాలంటే నోటిని అదుపులో పెట్టాల్సిందే. ముఖ్యంగా జంక్, ఫాస్ట్ ఫుడ్, ఆయిల్ ఫుడ్స్ ను అసలే తినకూడదు. ఎందుకంటే ఇవి మీ శరీర బరువును మరింత పెంచుతాయి. ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే కొన్ని రకాల టేస్టీ టేస్టీ సలాడ్లు బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే..

 మిక్స్డ్ సలాడ్

మిశ్రమ సలాడ్ లో రకరకాల కూరగాయలు, పండ్లు, కాయలు ఉంటాయి. వివరంగా చెప్పాలంటే.. తీరొక్క ఆహార పదార్ధాల కలయికే మిశ్రమ సలాడ్. ఈ సలాడ్లకు చికెన్ వంటి సన్నని మాంసాలను కూడా వేయొచ్చు. ఈ సలాడ్లు మన ఎముక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఎముకలను బలంగా చేస్తాయి. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుతాయి. డయాబెటీస్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్లు సోకే ప్రమాదాన్ని తగ్గించడానికి కూడా సహాయపడతాయి .

కూరగాయల సలాడ్

ఆకుపచ్చని సలాడ్లు అని కూడా పిలువబడే కూరగాయల సలాడ్లు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఎంతో సహాయపడతాయి. ఎక్కువగా కూరగాయలతో తయారైన సలాడ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ సలాడ్ లో ఎక్కువ పదార్థాలు పచ్చివి అయితే..  కొన్ని మాత్రం వండినవి కూడా ఉంటాయి. ఈ సలాడ్లలో ప్రధానంగా పాలకూర, బేబీ బచ్చలికూర, కాలే, కొత్తిమీర వంటి ఆకుకూరలు ఉంటాయి. అలాగే టమోటాలు, మిరియాలు, కీరదోసకాయలు, ఉల్లిపాయలు, క్యారెట్లు, మొలకలు,ముల్లంగి కూడా ఉంటాయి.

ఎగ్ సలాడ్

ఎగ్ సలాడ్ లో ప్రోటీన్లు, అసంతృప్త కొవ్వులు, విటమిన్ బి 6, విటమిన్  డి, విటమిన్ బి 12 వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్ల లో ఫైబర్, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ సలాడ్ ను తీసుకోవడం వల్ల మీ గట్ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ సలాడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఫాస్ట్ గా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. 
 

beetroot salad

బీట్రూట్ సలాడ్

బీట్ రూట్ లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. అంతేకాదు దీనిలో విలువైన విటమిన్లు, ఖనిజాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. నిజానికి దీనిలో మీ శరీరానికి అవసరమైన అన్ని విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఈ దుంపలలో ఎన్నో ప్రయోజనకరమైన మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. ఇవి మంటను తగ్గిస్తాయి. కణాలు దెబ్బతినకుండా రక్షిస్తాయి.
 

చిక్పా సలాడ్

చిక్పా సలాడ్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉంటాయి. అంతేకాదు దీనిలో విటమిన్లు, ఖనిజాలు, ఇతర రసాయన సమ్మేళనాలు సమృద్ధిగా ఉంటాయి. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. చిక్పీస్ స్థూల, సూక్ష్మపోషకాలకు మంచి మూలం. దీనిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో పిండి పదార్థాలు తక్కువగా ఉంటాయి. అలాగే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. 
 

click me!