బరువు తగ్గే చిట్కాలు: బరువు తగ్గడానికి ఈ ఐదు పానీయాలు అద్బుతంగా పనిచేస్తాయి..

First Published Aug 26, 2022, 1:57 PM IST

రెగ్యులర్ గా వ్యాయామం, డైటింగ్ చేసినప్పటికీ బరువు తగ్గడం లేదా.. అయితే ఈ ఐదు పానీయాలను ప్రయత్నించండి.. రిజల్ట్ ను వెంటనే చూస్తారు తెలుసా..

బరువు తగ్గాలని ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినప్పటికీ బరువు తగ్గని వారు చాలా మందే ఉన్నారు. రెగ్యులర్ గా వ్యాయామం చేస్తూ.. మంచి డైట్ ను ఫాలో అయితే బరువు తగ్గే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అయితే కొంతమంది మాత్రం ఇవి చేసినా తగ్గరు. అలాంటి వారు ఈ అద్బుతమైన పానీయాలను తాగితే.. మీరు వేగంగా బరువు తగ్గుతారు. అవేంటో తెలుసుకుందాం పదండి. 
 

గ్రీన్ టీ

గ్రీన్ టీ హెల్తీ డ్రింక్. వీటిలో జీవక్రియను మెరుగుపరిచే లక్షణాలుంటాయి. గ్రీన్ టీలో కెఫిన్, కాటెచిన్ అని పిలువబడే ఒక రకమైన ఫ్లేవనాయిడ్, యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఈ కాటెచిన్ అదనపు కొవ్వును విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది.  కెఫిన్, కాటెచిన్ లు శరీరం వినియోగించే శక్తి మొత్తాన్ని పెంచుతాయి.
 

అల్లం వాటర్

అల్లం వాటర్ కూడా బరువు తగ్గడానికి అద్బుతంగా పనిచేస్తుంది. భోజనం చేసిన తర్వాత గోరువెచ్చని వాటర్ లో అల్లం కలిపి తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తగ్గుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
 

పైనాపిల్

ఒక పైనాపిల్ ముక్కలో 42 కేలరీలు మాత్రమే ఉంటాయి. అలాగే  4 శాతం కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఈ పండులో మాంగనీస్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొవ్వు, కార్బోహైడ్రేట్ల జీవక్రియను నియంత్రిస్తుంది, దీంతో మీరు వేగంగా బరువు తగ్గుతారు. పైనాపిల్ జ్యూస్ బరువు తగ్గేందుకు ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. 
 

మెంతివాటర్

మెంతుల్లో మన ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో ఔషదగుణాలుంటాయి. ముఖ్యంగా ఐరన్, మెగ్నీషియం, విటమిన్ బి6, కాపర్, డైటరీ ఫైబర్, ప్రోటీన్  వంటి ఇతర విటమిన్లు, ముఖ్యమైన ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు వీటిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. మెంతివాటర్ ను ప్రతిరోజూ ఉదయం పరిగడుపున తాగాలి. మెంతి నీరు శరీరంలో విపరీతంగా పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి సహాయపడుతుంది. 

తేనె-దాల్చినచెక్క నీరు

దాల్చిన చెక్క లో కూడా ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి మీ జీవక్రియ రేటును పెంచడానికి సహాయపడతాయి. ఇది బరువు తగ్గించే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. దాల్చిన చెక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ నున కూడా నియంత్రించడానికి సహాయపడుతుంది. గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక 1 టీ స్పూన్ దాల్చిన చెక్క పౌడర్, కొద్దిగా తేనెను కలుపుకుని ప్రతిరోజూ ఉదయం పూట తాగితే బరువుతో పాటుగా బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. 

దాల్చిన చెక్క ఆకలిని తగ్గించడంతో పాటుగా.. ఆకలి కోరికలను కూడా తగ్గిస్తుంది. దీన్నితీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాల వినియోగం తగ్గుతుంది. దాల్చిన చెక్కలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బయాటిక్ లక్షణాలు ఉంటాయి. పరిగడుపున దాల్చిన చెక్క వాటర్ ను తాగడం వల్ల బరువు తగ్గే ప్రాసెస్ వేగవంతం అవుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 
 

click me!