
సూపర్‌స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కలయికలో రూపొందుతున్న భారీ చిత్రం చిత్రం కూలీ. షూటింగ్ ప్రారంభం కాకుండానే ఈ చిత్రానికి పెద్ద షాక్ తగిలింది. రజనీ, లోకేష్ తొలిసారిగా కలిసి చేస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ ఎక్సపెక్టే,న్స్ ఉన్నాయి. రీసెంట్ గా మేకర్స్.. ఈ మూవీని గ్రాండ్ గా అనౌన్స్ చేశారు. ఆ సమయంలో విడుదల చేసిన చిన్న టీజర్.. ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఆ టీజర్ లో రజనీ కాంత్ బంగారంతో నిండిన ఓ డెన్ లోకి అడుగుపెట్టి, అక్కడ ఉన్న మనుషులను ఒక రేంజ్ లో ఆడుకుంటున్నట్టు టీజర్ లో చూపించారు. గోల్డ్ స్మగ్లింగ్ చేసే వ్యక్తుల డెన్ లో అడుగు పెట్టిన హీరో.... బంగారు గడియారాలతో ఒక గొలుసు చేసి దాంతో అక్కడ ఉన్న రౌడీలను తుక్కు తుక్కుగా కొట్టిన విజువల్స్ అభిమానులకు విపరీతంగా నచ్చింది. ఇక ఈ వీడియోలో రెండు పాటలు కూడా ఉన్నాయి. 'నినైతలే ఇనికుం' సినిమాలోని 'శంభో శివ శంభో' పాట లిరిక్స్ ను, ' తగన్ మగన్ ' మూవీలోని 'వా వా పక్కం వా' పాట మ్యూజిక్ ను వాడారు. అందులో ఓ పాట ఇప్పుడు మేకర్స్ కు లీగల్ సమస్యలు తెచ్చిపెట్టింది!
నా పాటను వాడుకున్నారంటూ ఇళయరాజా సదరు నిర్మాతకు నోటీసులు పంపారు. కూలీ మూవీ టీజర్‌లో వినిపించిన మ్యూజిక్ అంతా అనిరుద్ సొంతంగా కంపోజ్ చేసిందే... 'వా వా పక్కం వా' ఆనే ఒక్క సాంగ్ తప్ప! రజనీకాంత్ హీరోగా యాక్ట్ చేసిన, 1983లో విడుదల అయిన 'తగన్ మగన్' సినిమాలో సాంగ్ అది. మేస్ట్రో ఇళయరాజా ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్ కంపోజ్ చేసింది కూడా ఆయనే.
తన అనుమతి లేకుండా తన పాటను 'కూలీ' దర్శక నిర్మాతలు వాడుకున్నారని ఇళయరాజా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది కాపీ రైట్ హక్కుల ఉల్లంఘన కిందకు వస్తుందని ఆయన పేర్కొన్నారు. కాపీ రైట్స్ ఉల్లంఘన కింద 'కూలీ' నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ (Sun Pictures)కు ఇళయరాజా నోటీసులు పంపించారు. స్పందించకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు.
టీజర్ లో 'వా వా పక్కం వా' సాంగ్ మ్యూజిక్ చేర్చడానికి ఇళయరాజా నుంచి అధికారిక అనుమతి తీసుకోలేదని నోటీసులో హైలైట్ చేసింది ఆయన టీమ్. సరైన అనుమతులు తీసుకోవాలని లేకుంటే టీజర్ నుంచి మ్యూజిక్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేసింది. కాపీ రైట్ హక్కుల ఉల్లంఘన కిందకు ఇది వస్తుందని గుర్తు చేసింది.
సాధారణంగా కొత్త సినిమాల్లో పాత సాంగ్స్ వాడితే ఆయా సంగీత దర్శకుడు, గేయ రచయిత అనుమతులు తీసుకుంటారు. రాయల్టీ ఇవ్వడం కూడా ఆనవాయితీ. ఇప్పుడు ఇళయరాజాతో ఈ సమస్యను కూలీ మేకర్స్.. రాయల్టీతో పరిష్కరించుకునే అవకాశం ఉందని చెన్నై వర్గాల టాక్.
ఇప్పటికే కాపీ రైట్స్ విషయంలో ఇళయరాజా వేసిన ఓ కేసు.. కర్ణాటక కోర్టులో నడుస్తోంది. అలాగే ఇళయరాజా పాటలకు చెందిన రాయల్టీకి సంబంధించిన ఓ నాలుగైదు కేసులు మద్రాస్ హైకోర్టులో నడుస్తుండగా ఇప్పుడు ఈ కేసు వచ్చి చేరింది. ఆ పాత రాయల్టీ కేసుల విషయంలో నిర్మాతకు, పాటలు వ్రాసిన వారికి కూడా ఉంటాయి అంతేగాని సంగీత దర్శకుడికి పూర్తి హక్కులు ఉండవంటూ ఇళయరాజా (Ilayaraja) కు వ్యతిరేకంగా తీర్పు రావడం గమనార్హం.
గతంలో కూడా లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) తన సినిమాల్లో కొన్ని పాత సినిమాల పాటలు వినియోగించారు. ఆ సినిమాల్లో కూడా ఇళయరాజా ట్యూన్స్ ఉన్నాయి. తాను ప్రొడ్యూస్ చేసిన సినిమా “ఫైట్ క్లబ్” అలాగే “విక్రమ్” లోని టైటిల్ ట్రాక్ లలో కూడా రాజాగారి ట్యూన్స్ ఉన్నాయి. మొత్తానికి కూలీ విషయంలో తాను కేసు వేశారు.