పాలు తాగితే బరువు తగ్గుతరా?

First Published Dec 29, 2022, 4:55 PM IST

బరువు తగ్గడానికి  కష్టపడిపోతున్నారా? అయితే రెగ్యులర్ గా పాలను తాగండి. ఎందుకంటారేమో.. పాలను తాగితే బరువు తగ్గడం నుంచి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు తెలుసా? 
 

ప్రతిరోజూ ఉదయం ఒక గ్లాసు పాలను ఖచ్చితంగా తాగాలని పిల్లలను బలవంతం చేయడం చూసే ఉంటరు. దీనికి కారణాలు లేకపోలేదు మరి. ఆకలి కోరికలను తగ్గించే పెప్టైడ్ వైవై అని పిలువబడే హార్మోన్ పాలలో పుష్కలంగా ఉంటుంది. అందుకే పాలతో రోజును ప్రారంభించమని పెద్దలు చెప్తుంటారు. ఇది మీ కడుపును నిండుగా ఉంచుతుంది. ఫలితంగా మీరు అతిగా తినలేరు. అలాగే ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను అసలే తినరు. నిజానికి బరువు తగ్గడానికి పాలు ఎంతో సహాయపడతాయి. దీనికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. 
 

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్న వాళ్లు బరువు పెరగడానికి దారితీసే నిర్దిష్ట ఆహారాలకు దూరంగా ఉండాలి. అయితే పాలను తాగితే కూడా బరువు పెరిగిపోతామని చాలా మంది పాలను పక్కన పెట్టేస్తుంటారు. కానీ పాలను తాగితే బరువు పెరిగిపోతాము అనే దానిలో ఏ మాత్రం నిజం లేదంటున్నారు నిపుణులు. ఇవి మీరు ఆరోగ్యకరరంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి.
 

బరువు తగ్గడానికి పాలు సహాయపడవని ఎందుకు నమ్ముతారంటే?

పాలు బరువును ఏ మాత్రం తగ్గించవని అనడానికి పాలలో కేలరీలు, కొవ్వు ఎక్కువగా ఉండటమే కారణం. అయినప్పటికీ పాలలో పోషకవిలువలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అంతేకాదు పాలను రోజూ తాగడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే సులువుగా బరువు కూడా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 
 

బరువు తగ్గడానికి పాలు సహాయపడతాయా?

ఇందులో సందేహమే లేదు. పాలు నిజంగా బరువు తగ్గడానికి సహాయపడతాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ జరిపిన అధ్యయనం  ప్రకారం..  పాలు,  పాల ఉత్పత్తులు బరువు తగ్గడానికి ఎఫెక్టీవ్ గా సహాయడతాయని వెల్లడించింది. 
 

బరువు తగ్గడానికి పాలు ఉత్తమమైనవి అని చెప్పడానికి 5 కారణాలు :

పాలు ప్రోటీన్ కు గొప్ప మూలం. మన శరీరంలో కండర ద్రవ్యరాశిని నిర్మించడానికి, నిర్వహించడానికి అవసరమైన మాక్రోన్యూట్రియెంట్ పాలలో పుష్కలంగా ఉంటుంది. కండర ద్రవ్యరాశిని నిర్మించడం వల్ల బరువు తగ్గడం సులువు అవుతుంది. దీనివల్ల ఆరోగ్యకరమైన సమతుల్యతలో కొవ్వును కోల్పోతూ.. బలంగా మారుతారు. 

పాలు ఆకలి కోరికలను తగ్గిస్తాయి. అలాగే పెప్టైడ్ YY హార్మోన్ కారణంగా మిమ్మల్ని ఎక్కువ సేపు నిండుగా ఉంచుతాయి. 

పాలల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మీ జీవక్రియను ప్రోత్సహిస్తుంది. ఇది చివరికి బరువు తగ్గడానికి దారితీస్తుంది.

పాలు, అరటి స్మూతీ లో ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఈ పోషకాలు మిమ్మల్ని ఎక్కువ సేపు సంతృప్తిగా ఉంచడానికి సహాయపడతాయి.

పాలలో విటమిన్ బి 12, మెగ్నీషియం, జింక్ లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ ప్రోటీన్, కాల్షియంతో పాటుగా మీరు బరువు తగ్గడానికి సహాయపడతాయి. 

అయితే పాలు తాగుతూ బరువు తగ్గాలనుకుంటే మాత్రం స్కిమ్డ్ (క్రీమ్ తొలగించిన పాలు) పాలను తాగాలి. 

బరువు తగ్గడానికి స్కిమ్డ్ పాలు ఎందుకు మంచివి?

బరువు తగ్గాలనుకునే వారికి స్కిమ్డ్ పాలు బాగా ఉపయోగపడతాయి. ఎందుకంటే వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. అలాగే దీనిలోని థర్మోజెనిక్ ప్రభావం వల్ల  బరువు తగ్గడం సులువు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతే ఎక్కువ కేలరీలను బర్న్ చేసేటప్పుడు, అదనపు శక్తిని ఖర్చు చేసేటప్పుడు ప్రోటీన్ కంటెంట్ ను జీవక్రియ చేయడం నెమ్మదిగా సాగుతుంది. 
 

అదనపు ప్రయోజనం కోసం పాలలో తేనె, పసుపు కలపండి

గోరు వెచ్చని పాలను తాగితే రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. పాలను తాగడం వల్ల మన శరీరం వెచ్చగా అవుతుంది. మన శరీరానికి శక్తి కూడా అందుతుంది. పాలలో తేనె లేదా పసుపును కలిపి తాగినా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. వీటిని పాలలో వేసుకుని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి. రాత్రిళ్లు హాయిగా నిద్రపోవడంతో పాటుగా ఎన్నో ప్రయోజనాలను పొందుతారు.
 

click me!