ఉదయం లేవగానే ఇలా చేస్తే ఎంత ఫాస్ట్ గా బరువు తగ్గుతారో తెలుసా..

First Published Oct 11, 2022, 3:59 PM IST

బరువు తగ్గాలని ఎన్నెన్నో చేస్తుంటారు. అయితే ఉదయం నిద్రలేవగానే ఈ మూడు పనులను చేస్తే చాలా అంటే చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 
 

weight loss

బరువు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయి. కారణమేదైనా.. బరువు పెరగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్, మధుమేహం, అధిక రక్తపోటు వంటి ఎన్నో దీర్ఘకాలిక రోగాలొచ్చే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. ఆరోగ్యకరమైన ఆహారాలన్ని తీసుకుంటూ.. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే బరువు తగ్గడం తేలిక అవుతుంది. వీటితో పాటుగా ఉదయం నిద్రలేవగానే ఈ పనులను చేస్తే కూడా ఫాస్ట్ గా బరువు  తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

నీళ్లను తాగాలి

ఉదయం నిద్రలేవగానే శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే రాత్రి తిన్నాక, పడుకునే ముందు నీళ్లను తాగే అలవాటు చాలా మందికి ఉండదు. అందుకే ఉదయం నిద్రలేచిన వెంటనే గ్లాస్ లేదా రెండు గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగండి. దీనివల్ల శరీరం హైడ్రేట్ గా మారి జీవక్రియ పెరుగుతుంది. అలాగే శరీరంలో ఉన్న అదనపు కేలరీలు కూడా బర్న్ అవడం ప్రారంభమవుతుంది. ఉదయం సాదా వాటర్ తో పాటుగా జీరా వాటర్ లేదా నిమ్మకాయ నీరు లేదా సెలెరీ లేదా అవిసె గింజల నీటిని కూడా తాగొచ్చు. ఇవి మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. 
 

walking

15 నుంచి 20 నిమిషాల నడక

బరువు తగ్గేందుకు శరీరక శ్రమ చాలా అవసరం. ఒక వేళ మీరు ఖచ్చితంగా బరువు తగ్గాలనుకుంటే మాత్రం రెగ్యులర్ గా 15 నుంచి 20 నిమిషాల పాటు నడవాలి. శరీరం మొత్తం కదిలేట్టు నడవడం ఇంకా ప్రయోజనకరంగా  ఉంటుంది. దీనికి బదులుగా వ్యాయామం చేసినా శరీరంలో కేలరీలు కరిగిపోతాయి. ఒకరోజు రెండు రోజులు కాకుండా రోజూ వ్యాయామం చేయండి. దీన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. ఉదయం వ్యాయామం మీరు ఫాస్ట్ గా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. అంతేకాదు దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా నియంత్రణలో ఉంటాయి. వ్యాయామమే కాదు యోగా, ధ్యానం వంటివి కూడా చేయొచ్చు. ఇవి మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి. 

soaked badam

నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ను  తినడం అలవాటు చేసుకోండి

మీకు తెలుసా..? మీ శరీరంలో విటమిన్లు, ప్రోటీన్లు లేదా పోషకాలు లోపిస్తే కూడా బరువు పెరిగిపోతుంటారు. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ ను తినడం అలవాటు చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ను తినడం వల్ల మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. పోషకాల లోపం కూడా పోతుంది. 
 

click me!