పొద్దున వేడినీళ్లు తాగితే నిజంగా బరువు తగ్గుతారా..?

First Published Aug 26, 2022, 2:52 PM IST

వేడినీళ్లు తాగితే బరువు తగ్గుతారనడంలో ఎలాంటి నిజం లేదని నిపుణులు తేల్చి చెబుతున్నారు. కానీ వేడి నీళ్లు ఈ అనారోగ్య సమస్యలను తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. 

బరువు తగ్గడం అంత తేలికైన పని కాదు. దీని కోసం ఎన్నో రకాల వ్యాయామాలను చేయాల్సి ఉంటుంది. అలాగే ఇష్టమైన ఆహారపు అలవాట్లను కూడా వదులుకోవాల్సి వస్తుంది. అయినా అంత తొందరగా బరువు తగ్గని వారు చాలా మందే ఉన్నారు. అయినా చాలా మంది వేగంగా బరువు తగ్గడానికి ఏమైనా సులభ మార్గాలు ఉన్నాయా అంటూ సెర్చ్ చేస్తుంటారు. అయితే శాస్త్రీయ ఆధారాలు లేకుండా వేగంగా బరువు తగ్గుతారనే విషయంలో నిజాలు లేవని గ్రహించండి. 
 

అయితే శాస్త్రీయ ఆధారాలు లేకుండా బరువు తగ్గుతారంటూ చెప్పిన విషయాల్లో వేడి నీళ్లు ఒకటి. ప్రతిరోజూ పరిగడుపున వేడినీళ్లు తాగితే చాలా ఫాస్ట్ గా బరువు తగ్గుతారంటూ వార్తలు చాలానే వచ్చాయి. నిజానికి వేడినీళ్లు బరువు తగ్గేందుకు ఎంత మాత్రం సహాయపడవు. 

అయితే వేడినీళ్లను ఉదయం పరిగడుపున తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి కూడా వేడినీళ్లు సహాయపడతాయి. ఇక ఈ గోరువెచ్చని నీటికి కాస్త నిమ్మరసం జోడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. నిమ్మరసానికి బదులుగా కొద్దిగా పసుపు పొడిని (ఇంట్లో తయారు చేసిన పసుపు)ను వేసి తాగండి. ఇవన్నీ శరీరాన్ని ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను నుంచి రక్షిస్తాయి. 
 

ఉదయం పూట వేడినీళ్లు తాగడం వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు

గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల రక్త ప్రవాహం పెరుగుతుంది. దీంతో శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సక్రమంగా సరఫరా అవుతుంది. ఇది మొత్తం ఆరోగ్యంపై సానుకూల ప్రభావాన్ని చూపెడుతుంది.
 

కొంతమందికి మలబద్దకం సమస్య ఎక్కువగా ఉంటుంది. అయితే గోరువెచ్చని నీళ్లు మలబద్దకం సమస్యను పోగొట్టడానికి సహాయపడతాయి. ఈ సమస్య ఉన్నవారు ప్రతిరోజూ ఉదయం క్రమం తప్పకుండా పరిగడుపున గోరువెచ్చని నీళ్లను తాగాలి. ఈ గోరువెచ్చని వాటర్ మలం కడుపు లోపల చిక్కుకోకుండా చూస్తుంది. అలాగే కడుపు నుంచి మలం బయటకు పంపడానికి సహాయపడుతుంది. 
 

పరిగడుపున గోరు వెచ్చని నీళ్లను తాగడం వల్ల కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు వంటి సమస్యలు వెంటనే తగ్గిపోతాయి.  ఇక ఆడవారు గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల రుతుస్రావ నొప్పి కూడా తగ్గిపోతుంది. 

రోజంతా కొద్ది కొద్దిగా గోరువెచ్చని నీళ్లను తాగితే పొట్ట ఆరోగ్యంగా, శుభ్రంగా ఉంటుంది. ఈ నీళ్లతో ఎసిడిటీ (Acidity), అజీర్థి (indigestion), కడుపు నొప్పి (Stomach ache)వంటి ఎన్నో సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. 
 

గోరు వెచ్చని నీళ్లు చర్మ సమస్యలను తొలగించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. ముఖంపై మచ్చలు, ముడతలు, మొటిమలు వంటి సమస్యలన్నింటినీ గోరువెచ్చని నీళ్లు పోగొడుతాయి. అంతేకాదు ఇది చర్మ రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. 

click me!