old clothes
ప్రస్తుత కాలంలో చాలా మంది మంది ఇంట్లో ఉండే పాత వస్తువులను రీసైకిల్ చేసి ఉపయోగించడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మరీ కూడా కూడా వస్తువులను పారేయడానికి బదులుగా ఉపయోగించాలనుకుంటే ఈ ఆర్టికల్ ను తప్పకుండా చదవండి. ఈ ఆర్టికల్ లో మనం పాత బట్టలను తిరిగి ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం..
old clothes
డోర్ మ్యాట్స్
డోర్ మ్యాట్స్ ను కూడా పాత బట్టలతో చాలా ఈజీగా తయారుచేయొచ్చు. దీన్ని ఏదైనా పాత ఫ్యాబ్రిక్ తో తయారు చేయొచ్చు. మీరు వేసుకున్న ఏదైనా మందపాటి క్లాత్ ఉంటే దానితో డార్ మ్యాట్ లను తయారుచేయండి. యూట్యూబ్ లో వీటికి సంబంధించిన వీడియోలు చాలానే ఉంటాయి. వీటిని మీరు ఏవిధంగా తయారుచేయాలనుకుంటున్నారో ఆ విధంగా కట్ చేసి స్టిచ్ చేయండి. వీటిని రకరకాల క్లాత్ తో తయారుచేయొచ్చు. ఇవి అందంగా కనిపిస్తాయి కూడా.
pillow
దిండు కవర్
కావాలనుకుంటే పాత బట్టలతో మీరు దిండు కవర్లను కూడా తయారు చేసుకోవచ్చు. దిండుకు అనుగుణంగా ఫ్యాబ్రిక్ ను కట్ చేయడం చాలా ఈజీ. ఆ తర్వాత మంచిగా కుట్టేసి దిండును అందులో తొడిగేస్తే సరిపోతుంది.
washing machine
వాషింగ్ మెషీన్ కవర్
వాషింగ్ మెషీన్ కవర్ ను తయారు చేయడం కూడా చాలా సులభం. దీనికి ముందుగా మీరు వాషింగ్ మెషీన్ సైజును కొలవాలి. దీన్ని బట్టి మీ పాత బట్టలను కట్ చేయండి. ఆ తర్వాత దీనిని కుట్టండి. ఆ తర్వాత వాషింగ్ మెషీన్ ను తొడిగించండి. అయితే వాషింగ్ మెషీన్ కవర్ తయారు చేసేటప్పుడు దాని సైజుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. లేదంటే వాషింగ్ మెషిన్ కు సరిపోకపోవచ్చు. దీనివల్ల వాటికి దుమ్ము, ధూళి పట్టే అవకాశం ఉండదు.